గుజరాత్‌లో మళ్లీ పవర్‌లోకి బీజేపీ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తిగా వెల్లడయ్యాయి.
గుజరాత్‌లో పాలక బీజేపీ భారీ విజయం నమోదు చేయగా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మెజారిటీ స్థానాలను గెల్చుకుంది.
గుజరాత్..
గుజరాత్ రాష్ట్రంలో 1985 నుంచి వరుసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఏడో సారీ విజయం అందుకుంది.
182 సీట్లున్న ఈ అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో పాలక బీజేపీ 158 సీట్లు గెలిచింది.
కాంగ్రెస్ 17 స్థానాలలో గెలుపొందింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది.
స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించగా సమాజ్‌వాది పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.
ఓట్ల శాతం చూసుకుంటే బీజేపీకి 52.5 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 27.28 శాతం ఓట్లు వచ్చాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ 12.9 శాతం ఓట్లు సాధించింది.
ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ సహా మిగతా ఏ పార్టీలకూ ఒక్క శాతం ఓట్లు కూడా సంపాదించలేకపోయాయి.

ఫొటో సోర్స్, twitter/himachal pradesh congress
హిమాచల్‌ప్రదేశ్
68 సీట్లున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా గురువారమే పూర్తయింది.
కాంగ్రెస్ 40 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది.
పాలక బీజేపీ 25 స్థానాలను గెలుచుకుంది.
ఈ రాష్ట్రంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
బీజేపీకి 43 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ 43.9 శాతం ఓట్లు సాధించాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ 1.1 శాతం ఓట్లు దక్కించుకుంది.
హిమాచల్‌ప్రదేశ్‌లో 1990లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ప్రజలు ఒక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కడితే ఆ తరువాత ఎన్నికలలో కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నారు. ఏ పార్టీకీ వరుసగా రెండు సార్లు అవకాశం ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌లో బీజేపీకి ఎన్నడూ లేనన్ని సీట్లు..
1995 నుంచి బీజేపీ గుజరాత్‌లో వరుసగా అధికారంలో ఉంది. అయితే, ప్రస్తుతం సాధించినన్ని సీట్లు గతంలో ఎన్నడూ సాధించలేదు.
1985లో బీజేపీ అక్కడ 11 సీట్లు గెలుచుకోగా 1990 ఎన్నికలలో 67 సీట్లు సాధించింది.
1995 ఎన్నికలలో 121 సీట్లు గెలుచుకుని తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారం అందుకుంది. అప్పటి నుంచి వరుసగా గెలుస్తూనే ఉంది.
1998లో 117 సీట్లు, 2002లో 127, 2007లో 117, 2012లో 115 సీట్లతో ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది.
2017లోకూడా వరుసగా ఆరోసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా సీట్ల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గింది.
ఆ ఎన్నికలలో 99 స్థానాలలో బీజేపీ విజయం సాధించింది.
ప్రస్తుత 2022 ఎన్నికలలో 158 స్థానాలలో గెలిచింది.
1985లో 147 సీట్లు సాధించిన కాంగ్రెస్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో గతంలో అత్యధికంగా 147 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌దే ఇంతవరకు రికార్డ్ విజయం. ఇప్పుడు బీజేపీ ఆ రికార్డును అధిగమించి 158 సీట్లతో కొత్త రికార్డు నెలకొల్పింది.
1985 ఎన్నికలలో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 147 స్థానాలలో విజయం సాధించింది.
ఇప్పుడు బీజేసీ ఆ సంఖ్య దాటితే కొత్త రికార్డు నమోదు చేసింది.
ఇక ఈ ఎన్నికలతో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో బోణీ చేసింది. 5 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ 12.9 శాతం ఓట్లు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓట్ల లెక్కింపు ఇలా
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైంది.
గుజరాత్‌లో ఓట్ల లెక్కింపు కోసం 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
182 మంది కౌంటింగ్ పరిశీలకులు, 182 మంది ఎన్నికల అధికారులు, 494 మంది సహాయ ఎన్నికల అధికారులను ఓట్ల లెక్కింపు విధుల కోసం కేటాయించినట్లు గుజరాత్ ఎన్నికల ప్రధాన అధికారి లపీ భారతీ చెప్పారు.
రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. రెండో దశ తర్వాత మొత్తం 59.11 శాతం పోలింగ్ నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. మొదటి దశ ఓటింగ్‌లో 63.14 శాతం ఓటింగ్ నమోదైంది.
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడి 68 స్థానాల కోసం నవంబర్ 12న పోలింగ్ జరిగింది. మొత్తం 75.6 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఓట్ల లెక్కింపు కోసం 59 ప్రాంతాల్లో 69 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి మనీశ్ గార్గ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘ఆపరేషన్ లోటస్ భయం లేదు’: రాజీవ్ శుక్లా
రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, సోనియా గాంధీ ప్రోత్సాహం, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కారణమని మీడియాతో మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ ఇన్‌చార్జ్ రాజీవ్ శుక్లా అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ భయం లేదని, తాము ఏమీ చేయలేమనే సంగతి వారికి కూడా తెలుసు అని ఆయన ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
డిసెంబర్ 12న గుజరాత్ సీఎం ప్రమాణ స్వీకారం
గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడంతో డిసెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ట్వీట్ చేశారు.
గాంధీనగర్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా వస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భార్యను కీలు బొమ్మగా మార్చేసే ఈ గ్యాస్‌లైటింగ్ ఏమిటి, దీన్ని మొదట్లోనే గుర్తించడం ఎలా?
- ఎలాన్ మస్క్: ట్విటర్ ఆఫీస్‌ను ‘హోటల్’గా మార్చిన కొత్త బాస్
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహించింది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








