క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భారత్‌ను రనౌట్ల దురదృష్టం వెంటాడుతోందా?

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, ani

    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్‌-2023లో భారత మహిళల జట్టు కథ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి మెట్టు వద్ద టీమిండియా బోల్తా పడింది.

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

అలీసా హేలీ (25), బెత్ మూనీ (54) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇరువురు ఆరంభం నుంచి ఎటాకింగ్ ఆటతీరు కనపర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

వీరిద్దరి తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్) కూడా అద్భుతమైన పోరాటం కనబరిచింది.

ఆమెకు ఆష్లీ గార్డనర్ (31) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో కంగారూ జట్టు భారీ స్కోరు చేసింది.

ఆస్ట్రేలియా జట్టు చివరి 10 ఓవర్లలో 103 పరుగులు చేసింది. వీటిలో చివరి ఐదు ఓవరల్లోనే 61 పరుగులు వచ్చాయి.

చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 30 పరుగులు సమర్పించుకున్నారు.

ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చివరి ఓవర్లో లయ తప్పడంతో లానింగ్ రెండు సిక్సర్లు కొట్టింది. ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులు రాబట్టింది ఆసీస్.

దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు సాధించింది.

టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ధీటుగా బదులిచ్చిన టీమిండియా

173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్ బౌలర్లు హడలెత్తించారు.

భారత స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన (2 బంతుల్లో 5 పరుగులు) , షెఫాలి వర్మ (6 బంతుల్లో 9 పరుగులు), యస్తిక భాటియాలను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు.

28 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది భారత్.

పటిష్ట బౌలింగ్ దళం కలిగిన కంగారూ జట్టుపై కొండంత లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందన్న ఆశలు సగటు భారత క్రికెట్ అభిమాని వదిలేసుకున్నారు.

ఇక అప్పుడే క్రీజులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43 పరుగులు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52 పరుగులు) లు విధ్వంసం సృష్టించారు.

ఎటాకింగ్ ఆటతో టీమిండియా పోటీలోకి తెచ్చారు. ఇద్దరూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరి ధాటికి టీమిండియా 10 ఓవర్లలోనే మూడు వికెట్లకు 93 పరుగులు సాధించింది.

అయితే కీలక సమయంలో జెమీమా షార్ట్ పిచ్ బంతికి ఔటయింది. తలమీదుగా వెళుతున్న బంతిని వేటాడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చింది.

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్ అద్భుత ఆటతీరు

ఇక జెమీమా ఔటయ్యాక జట్టును గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న కెప్టెన్ హర్మన్ ధాటిగా ఆడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హర్మన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

అయితే 15 ఓవర్లో రెండు ఫోర్లు బాది ఊపు మీద కనిపించిన కెప్టెన్ అదే ఓవర్లో అనూహ్య రీతిలో రనౌట్ అయింది. డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడిన హర్మన్ ప్రీత్ రెండో పరుగు కోసం పరిగెత్తింది. అయితే బ్యాట్‌ను క్రీజ్‌లో ఉంచబోతుండగా అనూహ్యరీతిలో బ్యాట్ స్ట్రక్ అయ్యింది. దీంతో మరో అడుగు క్రీజులో పెట్టాలనుకునేలోపే ఆసీస్ వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసింది.

హర్మన్ ప్రీత్ రనౌట్ భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్స్ తడబడటంతో విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచింది టీమిండియా. మ్యాచ్ ఆసీస్ వశమైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే హర్మన్ ప్రీత్ రనౌట్ చూసిన ప్రతీ భారత క్రికెట్ అభిమానికి 2019 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్‌ను గుర్తుకుతెచ్చింది.

ఆ మ్యాచ్ లో కూడా కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. ఆ రనౌట్‌ను భారత అభిమానులు ఇప్పటికీ మర్చిపోరు.

ఆ రనౌట్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటి? అప్పుడేం జరిగింది?

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

అభిమానులు మర్చిపోని మ్యాచ్ అది..

2019 పురుషుల వన్డే ప్రపంచ కప్ సెమీస్‌ మ్యాచ్ అది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు తక్కువ పరుగులకే పెవిలియన చేరారు. దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఆఖర్లో మహేంద్రసింగ్ ధోనీ (50), రవీంద్ర జడేజా (77) ఇన్నింగ్స్ టీమిండియాను పోటీలోకి తెచ్చింది.

చివర్లో భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరం. ధోనీ బ్యాటింగ్ చేస్తుండటంతో అభిమానులు విజయంపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు.

మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ధోనీ రనౌట్‌తో స్టేడియం మూగబోయింది. ఆ మ్యాచ్‌లో కివిస్ గెలిచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

అప్పుడు భారత జట్టుకు కెప్టెన్ ధోనీ. అతడి జెర్సీ నంబర్ ఏడు.

ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్‌ 2023లోనూ సెమీస్‌లో రనౌట్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టు కెప్టెన్. ఆమె జెర్సీ నంబర్ కూడా ఏడు.

రెండు ప్రపంచ‌కప్‌లలోనూ కెప్టెన్ల రనౌట్ భారత్‌‌ ఓటమికి దారి తీయడం అభిమానులను కలత చెందేలా చేస్తోంది.

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో ట్రెండింగ్

భారత క్రికెట్ అభిమానులు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా హర్మన్, ధోనీ రనౌట్ ఫొటోలు, క్లిప్పింగ్స్ పెట్టి తమ బాధను వ్యక్త పరుస్తున్నారు.

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ హర్మన్ రనౌట్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అన్నారు. ఫైనల్ చేరనందుకు ఇండియా నిరాశ చెందుతోందని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఆకాంక్ష శ్రీవాస్తవ అనే నెటిజన్ ట్విటర్ లో '' చాలా తప్పిదాలు ఉన్నాయి, వికెట్ల మధ్య పరిగెత్తడంలో విపరీతమైన శ్రద్ధ అవసరం. మనం గెలిచిన మ్యాచ్‌లో ఓడిపోయినట్లు అనిపించింది. కానీ మా జట్టు ప్రయత్నిస్తోంది.

మహిళా జట్టు ఇప్పుడు దానికి తగిన ప్రాధాన్యతను పొందుతోంది.'' అని అన్నారు.

సెమీఫైనల్ ఔర్ రనౌట్ కా బహుత్ పురానా రిస్తా హై (సెమీఫైనల్, రనౌట్‌లకు చాలా పాత సంబంధం ఉంది) అంటూ ప్రయాగ్ తివారి అనే నెటిజన్ పోస్టు పెట్టారు.

అప్పుడు ఇప్పుడు మనకే ఎందుకు ఇలా? అంటూ మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు.

మరోవైపు హర్మన్ రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అంటూ ఐసీసీ కూడా ట్విటర్‌లో పోస్టు పెట్టింది.

ఈ మ్యాచ్‌పై బీసీసీఐ కార్యదర్శ జై షా ట్విట్టర్‌లో స్పందిస్తూ ''ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు కఠిన పరాజయం. మైదానంలో మా అమ్మాయిల స్ఫూర్తికి మేం గర్వించకుండా ఉండలేం. టీం తమ సర్వస్వాన్ని అందించింది. వారు నిజమైన యోధులని నిరూపించారు. ఉమెన్ ఇన్ బ్లూ! '' అని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)