Women's T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు... టీం ఇండియా కంటే బలంగా ఉన్న జట్లు ఏవి?

క్రికెట్ మైదానం

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ రేపు మొదలవుతోంది.

దక్షిణాఫ్రికా వేదికగా ఎనిమిదో వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది.

తొలిసారి 2009వ సంవత్సరం ఇంగ్లండ్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్ జరిగింది. 2010, 2012, 2014, 2016, 2018, 2020 ఇలా ఏడు సీజన్లు జరిగాయి. కరోనా కారణంగా 2022లో వరల్డ్ కప్ జరగలేదు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, ఐర్లాండ్ కొత్తగా చేరాయి.

ఫార్మాట్‌ ఎలా?

మహిళల టీ20 ప్రపంచకప్‌లోని 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-1లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి.

గ్రూప్-2లో భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ర్యాంకింగ్స్‌లో ఏ టీం ఎక్కడ?

  • ఆస్ట్రేలియా
  • ఇంగ్లండ్
  • న్యూజీలాండ్
  • భారత్
  • దక్షిణాఫ్రికా
  • వెస్టిండీస్
  • పాకిస్తాన్
  • శ్రీలంక
  • బంగ్లాదేశ్
  • ఐర్లాండ్

టీం ఇండియా ఒక్కసారి కూడా ఈ ప్రపంచకప్‌ గెలవలేకపోయింది.

2023 వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఈనెల 10న అంటే రేపు దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య కేప్‌టౌన్‌లో జరగనుంది.

రెండో మ్యాచ్ వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

భారత్ వర్సెస్ పాకిస్తాన్

క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఫిబ్రవరి 12వ తేదీన కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

అదే రోజు బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌ కూడా జరుగుతుంది.

ఫైనల్స్ ఎప్పుడు?

టోర్నీలో మొదటి సెమీఫైనల్ ఫిబ్రవరి 23న, రెండో సెమీఫైనల్ ఫిబ్రవరి 24న జరగనుంది.

కాగా, ఈ టోర్నీ ఫైనల్‌ ఫిబ్రవరి 26న కేప్‌టౌన్‌లో జరుగుతుంది. ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఫిబ్రవరి 27 తేదీని రిజర్వ్ చేసింది.

రేణుకా సింగ్

ఫొటో సోర్స్, Getty Images

టీం ఇండియా జట్టులో ఎవరున్నారు?

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.

రిజర్వ్ ప్లేయర్లు: మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్.

ఎవరు ఫేవరేట్?

2023 జనవరి 25న ఐసీసీ భారత మహిళా క్రికెటర్ రేణుకా సింగ్‌ను ఎమర్జింగ్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.

ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్‌కు చెందిన ఆలిస్ క్యాప్సే, భారత ప్లేయర్ యాషికా భాటియాలను వెనక్కినెట్టి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు రేణుకా.

అయితే వ్యక్తిగత ర్యాంకింగ్ పరిశీలిస్తే ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్ (జనవరి 25) ప్రకారం రేణుకా సింగ్ బౌలర్లలో ఏడో స్థానంలో ఉన్నారు.

మహిళా బౌలర్లలో ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కే చెందిన సారా గ్లెన్ రెండో స్థానంలో ఉన్నారు.

భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ మూడో స్థానంలో ఉండగా, స్నేహ రానా 9వ స్థానంలో ఉన్నారు.

బ్యాటర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మగ్రా అగ్రస్థానంలో ఉన్నారు. భారత్‌కు చెందిన స్మృతి మంధాన మూడో స్థానంలో, షెఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.

హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, స్మృతి మంధన ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

26 ఏళ్ల స్మృతి భవిష్యత్తులో భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డనర్ అగ్రస్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన దీప్తి శర్మ మూడో స్థానంలో ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బలమైన జట్లు ఏవి?

ఆస్ట్రేలియా

2022 జనవరి నుంచి ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడింది.

భారత్‌పై కంగారూ జట్టు ఈ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌ నిర్ణయం కూడా సూపర్‌ ఓవర్‌లోనే జరిగింది. అంటే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది.

అంతేకాకుండా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు టీ20 ప్రపంచకప్‌లలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

ఇంగ్లండ్

2009లో ప్రారంభమైన మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు.. 2012, 2014, 2018లో ఫైనల్‌కు చేరినా.. మళ్లీ ఈ ట్రోఫీని అందుకోలేకపోయింది.

ఇంగ్లండ్ జట్టు 2022లో ఆడిన 18 మ్యాచ్‌లలో 13 విజయాలు సాధించింది. మొత్తంమీద ఆస్ట్రేలియా తర్వాత ఈ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ రెండో బలమైన పోటీదారిగా ఉంది.

వెస్టిండీస్

వెస్టిండీస్ జట్టు 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. కానీ గత సంవత్సరంలో ఆ జట్టు ప్రదర్శన అంత బాగా లేదు.

గతేడాది వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఆడిన 18 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింటిలో మాత్రమే విజయం సాధించింది.

న్యూజీలాండ్

ప్రపంచకప్ కోసం పోటీపడుతున్న జట్లలో న్యూజీలాండ్ కూడా బలమైందే. గత సంవత్సరం ఆడిన 18 మ్యాచ్‌లలో 10 గెలిచింది.

న్యూజీలాండ్ జట్టు ఛాంపియన్‌గా నిలవనప్పటికీ 2009, 2010లలో ఫైనల్స్‌కు చేరుకుంది.

ఇండియా

భారత మహిళల క్రికెట్ జట్టు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 టీ20 మ్యాచ్‌లు ఆడింది.

ఇందులో 17 మ్యాచ్‌లు గెలిచింది. ఈ ప్రపంచకప్ ఇండియాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇప్పటివరకు భారత జట్టు ఛాంపియన్‌గా నిలవలేదు.

టీ20 మహిళల ప్రపంచకప్‌ 2020లో టీమిండియా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.

మహిళా క్రికెటర్లు

ఫొటో సోర్స్, Getty Images

మహిళల ఐపీఎల్

పురుషుల ఐపీఎల్ మాదిరిగానే మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ఈ ఏడాది మార్చిలో భారత్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మీడియా హక్కులు కూడా అమ్ముడుపోయాయి.

డబ్ల్యూపీఎల్‌లో 5 జట్లకు బిడ్‌లు జరిగాయి. అత్యంత ఖరీదైన జట్టుగా అహ్మదాబాద్‌ నిలిచింది. ఈ ఫ్రాంచైజీని రూ.1,289 కోట్లకు అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.

ఇది కాకుండా ముంబై ఫ్రాంచైజీని ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు, బెంగళూరును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు దక్కించుకుంది.

దిల్లీ ఫ్రాంచైజీని జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు కొనుగోలు చేయగా లక్నోను రూ.757 కోట్లకి కొనుగోలు చేశారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.