గంజాయి మొక్కల పెంపకానికి జర్మనీ ఎందుకు అనుమతి ఇచ్చింది?

గంజాయి

జర్మనీ ఏప్రిల్ 1 నుంచి గంజాయి వాడకాన్ని పాక్షికంగా చట్టబద్ధం చేసింది.

అంటే ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు లోబడి గంజాయి ఉన్నంత వరకు దేశంలో దాని వినియోగం చట్టవిరుద్ధం కాదు.

జర్మనీలో గంజాయి బ్లాక్ మార్కెటింగ్‌ను అంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు జర్మనీలో 18 ఏళ్లు పైబడిన ఎవరైనా 25 గ్రాముల కంటే ఎక్కువ గంజాయిని ఉంచుకోవచ్చు.

కొత్త నిబంధన ప్రకారం ఇంటింటికీ మూడు గంజాయి మొక్కలు నాటేందుకు అనుమతి లభించింది.

అయితే పాఠశాలలు, క్రీడా మైదానాలు, నడక మార్గాల సమీపంలో ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల మధ్య గంజాయి వాడకంపై నిషేధం విధించింది.

గంజాయి

కనీస వయసు ఎంత?

జర్మనీలో గంజాయి పెంచుకోవడానికి జులై 1 నుంచి గరిష్ఠంగా 500 మందితో ప్రొడ్యూసర్ యూనియన్ లేదా సోషల్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ సంఘం లేదా క్లబ్ లక్ష్యం లాభం ఆశించకుండా గంజాయిని ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడం.

అయితే, దాని సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాలుండాలి.

గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, 2022లో థాయిలాండ్ కూడా గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేసింది.

పరిమితులతో అనుమతించిన థాయిలాండ్

2022లో థాయిలాండ్ కూడా గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేసింది. అయితే, దీనికి పరిమితులు విధించింది. గంజాయిని కేవలం సాగు చేస్తూ ఆహారంగా వినియోగించొచ్చు.

అక్కడి కెఫేలు, దుకాణాల్లో చాలా రకాల గంజాయి ఉత్పత్తులు అమ్ముతుంటారు. గంజాయి పువ్వులను కూడా సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తారు.

ఐస్ క్రీములతోపాటు ఇతర పానీయాలపైనా దీన్ని చల్లుతున్నారు. గంజాయి తినిపించిన కోళ్ల మాంసం అంటూ ప్రత్యేకంగా అమ్ముతారు. గంజాయితో కూరలు కూడా వండుతున్నారు.

అయితే, మార్కెట్‌లో వీటిని అమ్మే విషయంలో కొన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి.

గంజాయిని కేవలం వైద్యపరమైన అవసరాలకే ఉపయోగించాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

లైసెన్సులు పొందిన వారి నుంచే రసీదుపై గంజాయిని విక్రయించాలని నిబంధన పెట్టారు. 18 ఏళ్ల లోపు వయసున్న వారికి దీన్ని విక్రయించకూడదు.

థాయిలాండ్ ప్రభుత్వ నిర్ణయానికి మరో కోణం కూడా ఉంది. ఇక్కడి జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. మూడో వంతు ఖైదీలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారే. వీరిలో చాలా మంది మైనర్లు కూడా ఉన్నారు. ఈ జైళ్ల నిర్వహణకు ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)