ఫ్లయింగ్ కార్:ఆకాశంలో ఎగిరే టాక్సీలు రాబోతున్నాయా, ఈ టెక్నాలజీని కొన్న చైనా ఏం చేయబోతోంది?

క్లీన్ విజన్

ఫొటో సోర్స్, Klein Vision

    • రచయిత, జోయ్ క్లైన్‌మన్
    • హోదా, టెక్నాలజీ ఎడిటర్, బీబీసీ న్యూస్

యూరప్‌లో డెవలప్ చేసి, విజయవంతంగా పరీక్షించిన ఎగిరే కారు(ఫ్లయింగ్ కారు) టెక్నాలజీని చైనీస్ సంస్థ కొనుగోలు చేసింది.

బీఎండబ్ల్యూ ఇంజిన్, సాధారణ ఇంధనంతో ‘ఎయిర్‌కారు’ 2021లో స్లోవేకియాలోని రెండు విమానాశ్రయాల మధ్యలో 35 నిమిషాల పాటు ప్రయాణించింది. దీని టేకాఫ్, ల్యాండింగ్ మామూలు రన్‌వేలపై జరిగాయి.

కేవలం రెండు నిమిషాల్లో ఇది కారు నుంచి విమానంగా మారిపోయింది.

చైనాలో నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రయాణించేందుకు ప్రస్తుతం వాహనాలను ఈ డిజైన్‌పైనే అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ఎయిర్‌కారు విమానం తయారీకి, వాడకానికి అవసరమైన ఎక్స్‌క్లూజివ్ రైట్స్‌ను కాంగ్జౌ ప్రధాన కార్యాలయంగా పనిచేసే హెబే జియాన్‌క్సిన్ కొనుగోలు చేసింది.

మరో స్లోవాక్ విమాన తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేపట్టిన తర్వాత సంస్థ సొంతంగా విమానాశ్రయాన్ని, ఫ్లయిట్ స్కూల్‌ను నిర్మించిందని ఎయిర్‌కారును తయారు చేసిన కంపెనీ క్లీన్‌విజన్ కోఫౌండర్ ఆంటోన్ జకాక్ తెలిపారు.

ఎలక్ట్రిక్ వెహికిల్ రివల్యూషన్‌‌కు దారి చూపిన చైనా, ప్రస్తుతం ఎగిరే వాహనాలను రూపొందించే పనిలో పడింది.

గత నెల ప్రయాణికులను తీసుకెళ్లే డ్రోన్ టెస్ట్ ఫ్లయిట్‌ను, ఆటోఫ్లయిట్ అనే సంస్థ షెంజెన్‌ నుంచి జుహాయ్ నగరాల మధ్యలో పరీక్షించింది.

కారులో మూడు గంటలు సాగే ప్రయాణాన్ని 20 నిమిషాల్లో ఇది పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

చైనాకు చెందిన ఈహాంగ్ అనే సంస్థకు 2023లో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ నడిపేందుకు చైనా అధికారుల నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ లభించింది. 2028 నాటికి ఫ్లయింగ్ ట్యాక్సీలు ఆకాశంలో రెగ్యులర్‌గా మారతాయని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది.

అయితే, డ్రోన్ లాంటి ప్రయాణికుల విమానాల మాదిరివలె కాకుండా ఈ ఎయిర్‌కారు నేరుగా దిగేందుకు, ఎగిరేందుకు సాధ్యం కాదు. దీనికి విమానం మాదిరి రన్‌వే కావాలి.

అయితే, ఎంత మొత్తానికి ఈ టెక్నాలజీని చైనాకు అమ్మిందో తెలిపేందుకు క్లీన్‌విజన్ నిరాకరించింది. ఎయిర్‌కారుకు స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నుంచి 2022లో ఎయిర్‌ వర్తీనెస్ అంటే సురక్షితంగా ఆకాశంలో ఎగరగలిగే విమానానికి ఇచ్చే సర్టిఫికేట్ వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ సైతం ఎయిర్‌కారుపై ఒక వీడియోను పోస్ట్ చేశారు.

క్లీన్ విజన్

ఫొటో సోర్స్, Klein Vision

అయితే, మౌలిక సదుపాయాలు, నియంత్రణ, టెక్నాలజీ విషయంలో ప్రజల అంగీకారం వంటి విషయాల్లో ఈ రకమైన రవాణాకు ఇంకా అడ్డంకులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని నియంత్రించే పనిలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ సరికొత్త ప్రశ్నలతో ముందుకు రావాల్సి ఉందని ఏవియేషన్ నిపుణులు అన్నారు.

ముందుకు వెళ్లేందుకు దీన్ని ఒక అవగాశంగా చైనా చూసినట్లు ఏవియేషన్ కన్సల్టెంట్ స్టీవ్ రైట్ చెప్పారు.

ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ కార్ల మార్కెట్లో ప్రపంచ మార్కెట్ లీడర్‌గా చైనా ఎదిగింది.

ఎగిరే కార్ల విషయంలో కూడా చైనా ఇదే చేస్తుందా అని స్లోవేకియా ఎయిర్‌కారు అమ్మకం విషయంలో కూడా సందేహాలు వస్తున్నాయి.

ఎయిర్‌కారు లాంటి ప్రోటోటైప్‌లు సరదాగా అనిపించినప్పటికీ, క్యూలు, బ్యాగేజీ చెక్‌లు వంటివి లేకుండా రియాల్టీలో ఇవి హాయిగా సాగిపోయే ప్రయాణం లాంటివని రైట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)