ఎయిర్ షిప్: 320 అడుగుల పొడవైన ఈ హైబ్రిడ్ విమానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందంటే

ఫొటో సోర్స్, HAV
- రచయిత, హేలీ కోయిల్
- హోదా, బీబీసీ న్యూస్
డాన్‌కాస్టర్‌లో భారీ వాహనాలను నిర్మిస్తామని, 1,200 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తామని ఎయిర్‌షిప్ తయారీదారు హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) ప్రకటించింది.
కార్‌క్రాఫ్ట్ కామన్ సైట్‌లో ఎయిర్‌ల్యాండర్-10 హైబ్రిడ్ షిప్ నిర్మిస్తామని హెచ్ఏవీ తెలిపింది.
దీని మొదటి ప్రోడక్ట్ 2028 నుంచి అందుబాటులోకి రానుందని చెప్పింది.
సంప్రదాయ విమానాలతో పోల్చుకుంటే ఎయిర్‌ల్యాండర్ దాదాపు 75 శాతం పర్యావరణ హితమైనదని ఆ సంస్థ అటోంది.
ఈ ఎయిర్‌ల్యాండర్ 98 మీటర్ల (సుమారు 320 అడుగులు) పొడవుంటుందని హెచ్ఏవీ తెలిపింది. ఇది 100 మంది ప్రయాణికులు లేదా 10 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగల కొత్త రకం "అల్ట్రా- లో ఎమిషన్ ఎయిర్‌క్రాఫ్ట్" అని సంస్థ తెలిపింది. దీని ద్వారా తమ కంపెనీ సుస్థిరమైన విమాన ప్రయాణం అందుబాటులోకి తెస్తుందని హెచ్ఏవీ చెప్పింది.
'సిటీ ఆఫ్ డాన్‌కాస్టర్ కౌన్సిల్' ఫైనాన్సియల్ డెవలప్‌మెంట్ కోసం కార్‌క్రాఫ్ట్ కామన్ పేరుతో 50-హెక్టార్ల స్థలం కేటాయించింది.
"విమానాలు పనిచేసే విధానాన్ని పునఃపరిశీలించాలనుకొనే (క్లీన్ ఫ్లైట్) మాకు సిటీ ఆఫ్ డాన్‌కాస్టర్ కౌన్సిల్, సౌత్ యార్క్‌షైర్ నుంచి కీలక మద్దతు లభించింది'' అని హెచ్ఏవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ గ్రాండీ అన్నారు.

ఫొటో సోర్స్, HAV
అందుబాటులోకి 24 ఎయిర్‌షిప్‌లు..
"మేం మా పని ప్రారంభించి, ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో కమ్యూనిటీతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తెలిపారు.
తమ సంస్థ యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ సెంటర్, డాన్‌కాస్టర్ యూనివర్శిటీ టెక్నికల్ కాలేజ్ వంటి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని హెచ్ఏవీ తెలిపింది.
‘వృద్ధిని పెంచడానికి కొత్త సాంకేతికతను స్వీకరించడంలో డాన్‌కాస్టర్ నగరం ముందంజలో ఉంది. ఈ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సైట్ మా డెవలప్‌మెంట్ వ్యూహమే కాకుండా, మా మార్గదర్శక వాతావరణ మార్పు ఆశయాల ప్రణాళిక కూడా" అని డాన్‌కాస్టర్ మేయర్ రోస్ జోన్స్ అన్నారు.

ఫొటో సోర్స్, sbna
ఈ ప్రాజెక్టులో భాగంగా సంవత్సరానికి 24 ఎయిర్‌షిప్‌లను తయారు చేయగలరని రోస్ జోన్స్ భావిస్తున్నారు.
మొదటి ప్రోడక్ట్ 2028లో స్పానిష్ ఎయిర్‌లైన్ ఎయిర్ నాస్ట్రమ్‌తో అందుబాటులోకి రానుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
"సౌత్ యార్క్‌షైర్‌కు ఇది గుర్తుండిపోయే క్షణం, గర్వించదగినది" అని షెఫీల్డ్ యూనివర్శిటీకి చెందిన స్టీవ్ ఫాక్స్లీ అన్నారు.
"ఈ పెట్టుబడి కేవలం అధిక-విలువగల ఉద్యోగాలు, కొత్త అవకాశాలను తీసుకురావడమే కాకుండా అధునాతన తయారీ, కొత్త సౌత్ యార్క్‌షైర్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌పై బలమైన విశ్వాసాన్నిస్తుంది" అని అన్నారు.
ఎయిర్‌ల్యాండర్ 10 ప్రోటోటైప్ 2016, 2017 మధ్య ఆరుసార్లు విజయవంతంగా ప్రయాణించింది. కానీ, 2017లో అది పగిలిపోవడంతో దాన్ని పక్కనపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణ మహిళలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఎలా ఉంది? మహిళా ఎంపీల సంఖ్య పెరిగిందా?
- ఈడీ ఎవరినైనా అరెస్టు చేయొచ్చా? అన్ని అధికారాలు ఎలా వచ్చాయి?
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














