నేడే ఆస్కార్ అవార్డుల ప్రకటన, ఈ ఏడాది వేడుక ప్రత్యేకతలివే...

ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎమ్మా సాండర్స్
    • హోదా, ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్, లాస్ ఏంజిల్స్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఆస్కార్ వేడుక మళ్లీ వచ్చింది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో మార్చి 10 సాయంత్రం (భారత కాలమానం ప్రకారం 11వ తేదీ తెల్లవారు జామున 4:30 గంటలకు) నుంచి ఆస్కార్ 2024 అవార్డులను ప్రకటించనున్నారు.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, నటులతో పాటు 20కి పైగా విభాగాలలో అకాడమీ అవార్డులు ఇవ్వనుంది.

బిల్లీ ఎల్లీష్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిల్లీ ఎల్లీష్ తన బార్బీ ట్రాక్‌ పాడబోతున్నారు.

ప్రత్యేక ఆకర్షణలివే..

నామినేషన్ దక్కించుకున్న ప్రముఖుల్లో చాలామంది వేడుకకు హాజరవబోతున్నారు.

ఆస్కార్ వేడుక ప్రెజెంటర్లలో నటి జెండాయా, అల్ పాసినో, లుపిటా న్యోంగో, బాడ్ బన్నీ, డ్వేన్ జాహ్సన్, రెజీనా కింగ్, మాథ్యూ మెక్‌కోనాఘే, మహర్షలా అలీ, కే హుయ్ క్వాన్, బ్రెండన్ ఫ్రేజర్, మిచెల్ ఫైఫర్‌లు ఉన్నారు. 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్‌' చిత్రంలో కనిపించిన కుక్క 'మెస్సీ' వస్తే అందరి దృష్టిని ఆకర్షించొచ్చు.

కార్యక్రమంలో బిల్లీ ఎల్లీష్ తన బార్బీ ట్రాక్‌ పాడబోతున్నారు.

అమెరికా 'లేట్ నైట్' ప్రెజెంటర్ జిమ్మీ కిమ్మెల్ ఈ సంవత్సరం హోస్టింగ్ చేయనున్నారు.

పాస్ట్ లైవ్స్

ఫొటో సోర్స్, STUDIO CANAL

ఫొటో క్యాప్షన్, పాస్ట్ లైవ్స్ చిత్రం రెండు నామినేషన్స్ దక్కించుకుంది.

పోటీలో ఉన్న చిత్రాలేంటి?

2023లో విడుదలైన క్రిస్టోఫ‌ర్ నోల‌న్ చిత్రం 'ఒపెన్‌హైమ‌ర్' 13 నామినేష‌న్స్ దక్కించుకుంది. అంతేకాదు బార్బీ సినిమా కూడా ఎనిమిది విభాగాల్లో పోటీలో నిలిచింది.

ఇక యార్గోస్ లాంతిమోస్ తీసిన "పూర్ థింగ్స్" చిత్రం కూడా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా 11 నామినేషన్స్ దక్కించుకుంది.

ఈ 96వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఓపెన్‌హైమర్, బార్బీ, పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పాస్ట్ లైవ్స్, అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, ది హోల్డోవర్స్, మాస్ట్రో, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బరిలో నిలిచాయి.

ఓపెన్ హైమర్ చిత్ర బృందం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రిస్టోఫ‌ర్ నోల‌న్ చిత్రం 'ఒపెన్‌హైమ‌ర్' 13 నామినేష‌న్స్ దక్కించుకుంది.

రేసులో ఉన్న దర్శకులు, నటులు

నోలన్ తీసిన సినిమాలు గతంలో ఐదుసార్లు నామినేషన్లలో చోటు దక్కించుకున్నా, ఆస్కార్ రాలేదు.

81 ఏళ్ల స్కోర్సెస్ పదోసారి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఆయన రెండో సారి నామినేషన్ దక్కించుకున్నారు. 2018లో డంక్రిక్ సినిమాకు గానూ నోలన్‌కు నామినేషన్ దక్కింది.

ఉత్తమ దర్శకులుగా క్రిస్టోఫర్ నోలన్ (ఒపెన్‌హైమర్), జస్టిన్ ట్రైట్ ( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యార్గోస్ లాంతిమోస్ (పూర్ థింగ్స్) జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లు నిలిచారు.

ఉత్తమ నటి విభాగంలో అనెట్టే బెనింగ్ (న్యాడ్), లిలీ గ్లాడ్ స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), శాండ్రా హల్లర్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), కేరీ ముల్లిగాన్ (మాయెస్ట్రో), ఎమ్మా స్టోన్- (పూర్ థింగ్స్)లకు చోటు దక్కింది.

ఎమ్మా స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎమ్మా స్టోన్ ఇటీవలే ఉత్తమ నటిగా బాఫ్తాను గెలుచుకున్నారు.

పూర్ థింగ్స్‌లో ఎమ్మా స్టోన్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఆమెకు పోటీగా 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' చిత్ర నటి లిల్లీ గ్లాడ్‌స్టోన్ ఉన్నారు. ఆమె నటన కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. ఒకవేళ లిల్లీ ఆస్కార్ గెలిస్తే ఉత్తమ నటి విభాగంలో గెలుపొందిన మొదటి స్థానిక అమెరికన్‌గా రికార్డు సృష్టిస్తారు.

ఉత్తమ నటుల విభాగంలో సిలియాన్ మర్ఫీ (ఒపెన్‌హైమర్), బ్రాడ్లే కూపర్ (మాయెస్ట్రో), కోల్మన్ డొమింగో (రస్టిన్), పాల్ గియామాటి (ది హోల్డోవర్స్), జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్)లకు నామినేషన్లలో చోటు దక్కింది.

రస్టిన్ చిత్రంలో గే పౌర హక్కుల కార్యకర్తగా కోల్‌మన్ డొమింగో నటించారు. ఆయన ఉత్తమ నటుడి రేసులో ఉన్నారు. ఒకవేళ ఆయన ఆస్కార్‌ను గెలిస్తే, ఆ బహుమతిని గెలుచుకున్న మొదటి ఆఫ్రో-లాటినో నటుడు అవుతారు.

బార్బీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?

1953 నుంచి అకాడమీ అవార్డుల వేడుకను టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. 1966లో తొలిసారిగా కలర్ టీవీలో అకాడమీ అవార్డుల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

1969 నుంచి అకాడమీ అవార్డులను అంతర్జాతీయంగా ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం 200లకు పైగా దేశాల్లో అకాడమీ అవార్డుల ప్రసారం జరుగుతోంది.

2024 వేడుకలు హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ నుంచి ఆదివారం నాడు (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు) ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

భారత్‌లో డిస్నీ‌హాట్ స్టార్, స్టార్ మూవీస్‌ చానల్స్‌లో లైవ్ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)