నటుడి ఇంట్లో 72 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మరీటా మలోనీ
- హోదా, బీబీసీ న్యూస్
సినీ నటుడు అలెన్ డెలాన్ ఇంట్లో 72 తుపాకులు, 3000 కంటే ఎక్కువ రౌండ్ల బుల్లెట్లను ఫ్రెంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పారిస్‌కు దక్షిణంగా 135 కిలోమీటర్ల దూరంలోని డూషీ-మాంట్‌కార్బన్‌లోని నటుడి ఇంటి వద్ద షూటింగ్ రేంజ్‌ను కూడా పోలీసులు గుర్తించారు.
డెలాన్‌కు తుపాకీ అనుమతి లేదని ప్రాసిక్యూటర్స్ చెప్పారు.
88 ఏళ్ల డెలాన్ ఫ్రెంచ్ సినిమాకి స్వర్ణయుగంగా చెప్పే కాలంలో ప్రముఖ నటుడిగా ఎదిగారు. ది సమురాయ్, బోర్సలినో వంటి హిట్ సినిమాల్లో తెరపై కఠిన వ్యక్తిత్వానికి సింబల్‌గా పేరుగాంచారు.
కోర్టు నియమించిన అధికారి నటుడు డెలాన్ ఇంట్లో ఆయుధాన్ని గుర్తించి జడ్జిని అప్రమత్తం చేయడంతో, మంగళవారం సోదాలకు ఆదేశించారు.
2019లో స్ట్రోక్‌కి గురైన తర్వాత ఇటీవల కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం అంత బాగులేదు. మరో తీవ్రమైన సమస్యతో ఆయన బాధపడుతున్నారు, కానీ ఫ్రెంచ్ మీడియా ఆయన వ్యాధి ఏమిటో వెల్లడించలేదు.
విభేదాల కారణంగా ఆయన కుటుంబం విచ్ఛిన్నం కావడం కూడా ఫ్రాన్స్‌లో వార్తల్లో నిలిచింది.
అవమానాలు, ఆరోపణలు, కోర్టు కేసులు, రహస్య రికార్డింగ్‌లతో ఆయన ముగ్గురు పిల్లలు మీడియా ముందు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డెలాన్‌కు అందిస్తున్న వైద్యంపై ఇటీవల చట్టపరంగా కొన్ని మార్పులు జరిగాయి.
గత నెలలో కోర్టు ఆదేశాల మేరకు వైద్యుడు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.
అయితే, ఆయన ఇచ్చిన వాంగ్మూలాలపై ఆయన పిల్లలు స్పందించడంతో వివాదాస్పదమయ్యాయి.
నటుడి మాజీ లివ్ ఇన్ అసిస్టెంట్ హిరోమి రోలిన్‌పై ఆయన పిల్లలు గత ఏడాది ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో డెలాన్ గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అయిన ఆమె తమ తండ్రిపై 'మోరల్ హెరాస్‌మెంట్'కు పాల్పడ్డారని వారు ఆరోపణలు చేశారు. అయితే, ఆమె తరఫు న్యాయవాది వారు చేసిన అన్ని ఆరోపణలను తోసిపుచ్చారు.
2019లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవ పామ్ డిఓర్ (గోల్డెన్ పామ్) అవార్డును డెలాన్ అందుకున్నారు. అదే ఆయన చివరిసారిగా కనిపించిన అతిపెద్ద ఈవెంట్.
పారిస్‌లో జరిగిన తన స్నేహితుడు, సహ నటుడు జీన్ పాల్ బెల్మోండో అంత్యక్రియలకు 2019 సెప్టెంబర్‌లో ఆయన హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
- ఐశ్వర్యా రాయ్ పేరును రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- విజయ్: ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ ఎందుకు పెట్టారు? అప్పట్లో ఆయన సినిమాలు చిక్కుల్లో ఎందుకు పడ్డాయి?
- మునావర్ ఫారూకీ: ఈ బిగ్‌బాస్ విజేత చుట్టూ ఎందుకింత చర్చ?
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
- కాన్సర్బెరో: ఈ 26 ఏళ్ళ 'ర్యాప్ స్టార్' ఆత్మహత్య చేసుకోలేదు, లేడీ మేనేజరే ఆయనను చంపేసింది...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














