లాటరీలో ఈయన 10 వేల కోట్ల రూపాయలు గెల్చుకున్నారు

అమెరికాలో ఒక వ్యక్తి 10 వేల కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు.
ఆయన పేరు చెంగ్ సైఫాన్. లావోస్‌లో పుట్టిన ఆయన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌కు వలస వెళ్లారు.
తన భార్య, స్నేహితుడితో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి సైఫాన్ 20కి పైగా లాటరీ టికెట్లు కొన్నారు. అవే వారి జీవితాలను మార్చేశాయి.
ఏప్రిల్ 7న తీసిన డ్రాలో సైఫాన్1.3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 10,930 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెలిచారని 'పవర్ బాల్' లాటరీ నిర్వాహకులు వెల్లడించారు.
చెంగ్ సైఫాన్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు.
లాటరీ గెల్చుకోవడంతో తన జీవితం మారిపోయిందని ఆయన చెప్పారు.
''ఇపుడు నా కుటుంబానికి నేను మద్దతుగా ఉంటాను. నా కోసం మంచి వైద్యుడిని నియమించుకుంటాను'' అని సైఫాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డబ్బులు ఏం చేస్తారు?
రూ. 10,930 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీలో పన్నులు తీసేయగా సైఫాన్‌కు సుమారు 3,519 కోట్ల రూపాయలు వస్తాయి.
ఈ డబ్బులను తన భార్య, స్నేహితుడితో సమానంగా పంచుకుంటానని చెంగ్ సైఫాన్ చెప్పారు.
కుటుంబం కోసం ఇల్లు కొంటానని సీబీఎస్ అనుబంధ వార్తాసంస్థ కొయిన్‌తో ఆయన చెప్పారు. సీబీఎస్ అమెరికాలో బీబీసీ మీడియా భాగస్వామి.
'ఇది నాలుగో అతిపెద్ద జాక్‌పాట్...'
అమెరికా పవర్‌బాల్ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద జాక్‌పాట్.
2022లో ఒకరికి రూ. 20 వేల కోట్ల లాటరీ వచ్చింది.
పవర్‌బాల్ టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.166 (2 డాలర్లు).
45 అమెరికా సంయుక్త రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో పవర్‌బాల్ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తారు.
టిక్కెట్ ధరలు పెంచడంతో ఇలా వేల కోట్ల రూపాయల జాక్ పాట్ సాధారణమైపోయింది.
గేమ్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. పోటీదారులు గతంలో ఒకటి నుంచి 59కి మధ్య 5 నంబర్స్ ఎంచుకొనేవారు. కానీ, ఇపుడు ఒకటి నుంచి 69 వరకు 5 సంఖ్యలను ఎంచుకొనే వెసులుబాటు ఉంది.
అంతేకాదు పవర్‌బాల్‌ను కూడా ఎంచుకుంటారు, ఇది ఆరో నంబర్. ఒకటి నుంచి 26 మధ్య దీనిని ఎంచుకోవాలి. గతంలో ఇది ఒకటి నుంచి 35 వరకు ఉండేది.
ఇవి కూడా చదవండి:
- మే డే ఎలా మొదలైంది? కార్మిక దినోత్సవం చరిత్ర ఏమిటి?
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














