రూ. 190 కోట్ల లాటరీ గెలిచానంటున్న మహిళ... టికెట్‌ను పొరపాటున దుస్తులతో కలిపి ఉతికేశారట

ఫొటో సోర్స్, Smith Collection/Getty Images
2.6 కోట్ల డాలర్లు అంటే దాదాపు 190 కోట్ల రూపాయల కాలిఫోర్నియా లాటరీని గెల్చుకున్నానని చెబుతున్న ఓ మహిళ తాను ఆ టికెట్‌ను దుస్తుల్లో పెట్టి ఉతికేశానని, అది చిరిగిపోయిందని అంటున్నారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.
ఆమె గెలిచిన సూపర్ లాటో ప్లస్ టికెట్ ను లాస్ ఏంజెల్స్ సబర్బ్ లోని నార్వాక్ లో ఉన్న ఒక కన్వీనియెన్స్ స్టోర్లో నవంబరులో కొన్నారు.
ఆమె పేరును వెల్లడించలేదు. అయితే, ఆమె ఆ టిక్కెట్టును కొనడం స్టోర్ సీసీటీవీలో రికార్డు అయింది.
కానీ, లాటరీ బహుమతిని పొందడానికి ఉన్న గడువు గురువారంతో ముగిసింది.
డ్రా తీసిన 180 రోజులలోగా బహుమతిని తీసుకోవాలని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు.
బుధవారం ఒక మహిళ స్టోర్కు వచ్చి లాటరీ బహుమతిని అందుకున్న విజేతనని చెప్పినట్లు స్టోర్ సిబ్బంది ఎస్పెరాంజా హెర్నాండెజ్ కాలిఫోర్నియా విట్టియర్ డైలీ న్యూస్కు చెప్పారు.
కానీ, ఆమె ప్రమాదవశాత్తు దుస్తులతో పాటు ఆ టికెట్టును కూడా లాండ్రీలో వేయడంతో టిక్కెట్టును పోగొట్టుకున్నట్లు చెప్పారు.
అయితే, ఆమే విజేత అనడానికి స్టోర్ లో లభించిన సీసీటీవీ ఫుటేజీ సరిపోదని కాలిఫోర్నియా లాటరీ ప్రతినిధి కేథీ జాన్‌స్టన్ చెప్పారు.
ఆ టిక్కెట్టు హక్కుదారు బహుమతిని తీసుకోవడానికి బలమైన ఆధారాలు చూపించాలని చెప్పారు.
ఆమె స్టోర్లో టికెట్ కొంటున్న వీడియోను లాటరీ నిర్వాహకులకు షేర్ చేశారు. ఆమె వాదనను విచారిస్తున్నట్లు జాన్‌స్టన్ తెలిపారు.
ఈ జాక్ పాట్ లో విజేతలెవరినీ గుర్తించలేకపోతే ఆ బహుమతి సొమ్మును కాలిఫోర్నియా ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చేస్తామని లాటరీ నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు.
లాటరీ సంస్థ విధానాలను అనుసరించి ఆ టిక్కెట్టును అమ్మిన స్టోర్‌కు 1,30,000 డాలర్లను ఇచ్చినట్లు ప్రకటనలో రాశారు.
నవంబరులో జరిగిన ఈ డ్రా లో 23,36, 12, 31, 13, 10 సంఖ్యలు ఉన్న టిక్కెట్ల వారికి లాటరీ బహుమతి లభించింది.
లాటరీ గెలిచిన తర్వాత ఆ బహుమతిని తీసుకోవడానికి రాకపోవడం కాలిఫోర్నియాలో చాలా అరుదుగా జరిగే విషయం అని లాటరీ నిర్వాహకులు చెప్పినట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ పేర్కొంది.
లాటరీలో గెలిచామని చెప్పి టిక్కెట్లను తేలేకపోవడం బహుశా ఇది మొదటిసారి కావచ్చని నిర్వాహకులు అంటున్నారు.
2016లో బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ గెలిచిన లాటరీ టిక్కెట్టును మురికిగా ఉన్న జీన్స్ ప్యాంటుతో పాటు వాషింగ్ మెషీన్లో వదిలేసినట్లు చెప్పడంతో బీబీసీ న్యూస్ బీట్ ఆ టిక్కెట్టును పరిశీలించింది.
అయితే, ఆ టిక్కెట్టు బాగా చిరిగిపోయి ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








