చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ప్రకటన

చంద్రుడు

ఫొటో సోర్స్, ISRO

చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన అన్వేషణ కొనసాగిస్తోంది.

రోవర్‌కు ఉన్న ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్’(ఎల్ఐబీఎస్) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో తాజాగా వెల్లడించింది.

దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌లను ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో ప్రకటించింది.

హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషణ కొనసాగుతోందని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఏమిటీ ఎల్ఐబీఎస్?

పదార్థాల సమ్మేళనాన్ని తీవ్రమైన లేజర్ పల్సెస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేసి వాటిని విశ్లేషించే శాస్త్రీయ విధానాన్ని ఎల్ఐబీఎస్ అంటారు.

అలాంటి సామర్థ్యం ఉన్న ఎల్ఐబీఎస్ పరికరం, ప్రజ్ఞాన్ రోవర్‌కు ఉంది.

అధిక శక్తి గల లేజర్ పల్స్‌ను రాయి లేదా మట్టి వంటి పదార్థ ఉపరితలంపై కేంద్రీకరించినప్పుడు, ఆ లేజర్ పల్స్ తీవ్రమైన వేడితో స్థానికమైన ప్లాస్మాను ఏర్పరుస్తుంది. దాన్ని విశ్లేషించి మూలకాలను గుర్తిస్తారు.

LIBS

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఎల్ఐబీఎస్

ఈ విధానంలోనే విశ్లేషించి చంద్రుడి దక్షిణ ధ్రువంలో సల్ఫర్, ఆక్సిజన్ సహా మరికొన్ని మూలకాలున్నట్లు ఇస్రో పరిశోధకులు గుర్తించారు.

ప్రాథమిక విశ్లేషణలలో అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం ఉన్నట్లు గుర్తించగా, మరింత సునిశిత విశ్లేషణలు మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ కూడా ఉన్నట్లు నిర్ధరించాయి.

ఇంతటి కీలకమైన అన్వేషణకు సాయపడిన ఎల్ఐబీఎస్ పరికరాన్ని బెంగళూరులోని ‘లేబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్’ శాస్త్రవేత్తలు తయారుచేసినట్లు ఇస్రో వెల్లడించింది.

LIBS Qualification Model

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఎల్ఐబీఎస్ క్వాలిఫికేషన్ మోడల్

చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగిన తొలి దేశంగా రికార్డ్ సృష్టించిన భారత్, ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాల అన్వేషణలో ముందడుగు వేస్తోంది.

ఈ ఏడాది ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగగా, అనంతరం విక్రమ్ నుంచి వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై నడక ప్రారంభించింది.

రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్‌‌లలో పదికి పైగా యాంటెన్నాలను అమర్చింది ఇస్రో.

ప్రొపల్షన్ మాడ్యూల్, ఐడీఎస్‌ఎన్(ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్)తో కమ్యూనికేట్ చేస్తుంది.

ల్యాండర్ మాడ్యూల్ ఐడీఎస్ఎన్‌తో, రోవర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో కూడా ఇది అనుసంధానమై ఉంది.

రోవర్ కేవలం ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)