H-1B వీసా: అమెరికన్ కంపెనీల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నాయి, ఎంత తక్కువంటే.. - బీబీసీ అధ్యయనం

భారతీయులు, అమెరికా, హెచ్1బీ వీసా, టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్

ఫొటో సోర్స్, Chetan Singh

ఫొటో క్యాప్షన్, హెచ్‌-1బీ వీసా వల్ల ఎక్కువగా భారతీయులే లాభపడ్డారు
    • రచయిత, జాస్మిన్ నిహలానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గతేడాది అమెరికాలో ఆమోదించిన ప్రతి పది హెచ్-1బీ వీసా దరఖాస్తులలో 8 దరఖాస్తులు లెవెల్ 1, లెెవెల్2 కేటగిరీ వర్కర్లవి.

లెవెల్ 1 అనేది ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల కోసం.

వారి జీతాలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.

లెవెల్ 2 నిపుణులైన ఉద్యోగులవి. అంటే వీరు చేసే పని కాస్త కష్టంగా ఉంటుంది.

ఎక్కువ భాగం భారతీయ టెక్ కంపెనీలు లెవెల్ 2 ఉద్యోగుల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే జీతాలు మాత్రం హెచ్-1బీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సగటు జీతం కంటే తక్కువ చెల్లిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శాస్త్ర పరిశోధనలు, ఇంజనీరింగ్, బోధన రంగాల్లో నిపుణులైన విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు హెచ్-1బీ తాత్కాలిక వీసా ఇస్తారు.

దీని వల్ల సంస్థల యజమానులకు అమెరికాలో లభించని వ్యాపార నైపుణ్యం, సామర్థ్యాన్ని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెచ్చుకునే అవకాశం కలుగుతుంది.

భారతీయులు, అమెరికా, హెచ్1బీ వీసా, టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty Images

ఫొటో క్యాప్షన్, హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు

హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంచిన ట్రంప్

హెచ్-1బీ వీసా వల్ల భారతీయులు ఎక్కువ లబ్ధి పొందారు. గత పదేళ్లలో 70% కంటే ఎక్కువగా భారతీయుల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు ఆమోదం పొందాయి.

అమెరికాలో 7లక్షల 30వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు, వారిపై ఆధారపడిన వారు ఐదున్నర లక్షల మంది ఉన్నారనని ఎఫ్‌డబ్యూడీ యూఎస్ అంచనా వేసింది.

హెచ్-1బీ వీసాదారులు, వారి జీవిత భాగస్వాములు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ఏటా ఏటా86 బిలియన్ డాలర్లు సమకూరుస్తున్నారు. పన్నుల రూపంలో 24 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారు.

సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. ఈ ఆర్డర్ కింద హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏడాదికి లక్ష డాలర్లకు పెంచారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు 88 లక్షల రూపాయలకు సమానం.

అమెరికన్ల ఉద్యోగాలను, విదేశీయులు కొల్లగొడుతున్నారని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు.

2024లో నిర్వహించిన లాటరీలో లెవెల్1 కోసం 28 శాతం, లెవెల్ 2 కోసం 48 శాతం హెచ్-1బీ వీసా అప్లికేషన్లు ఆమోదించారు.

లెవెల్ 3 కోసం 14శాతం లెవెల్ 4 కోసం శాతం అప్లికేషన్లు ఆమోదం పొందాయి. లెవెల్ 3 అంటే అనుభవం ఉన్న ఉద్యోగులు. లెవెల్ 4 అంటే అనుభవంతో పాటు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేవారు.

భారతీయులు, అమెరికా, హెచ్1బీ వీసా, టెక్ నిపుణులు, సాఫ్ట్‌వేర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికన్ సంస్థలు విదేశాల్లో నిపుణులను తమ కంపెనీల్లో నియమించుకునే వారి కోసం తాత్కాలిక హెచ్-1బీ వీసా జారీ చేస్తారు

ఎలా విశ్లేషించారు?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నుంచి బ్లూమ్‌బర్గ్ సేకరించిన హెచ్-1బీ వీసాల లాటరీ డేటా ఆధారంగా బీబీసీ ఈ గణాంకాలను విశ్లేషించింది.

ఈ డేటాను తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ విడుదల చేసిన లేబర్ కండిషన్ అప్లికేషన్ రికార్డులతో సరిపోల్చారు.

ఈ డేటాను కార్మిక శాఖ విడుదల చేసిన త్రైమాసిక కార్మిక స్థితి దరఖాస్తు రికార్డులకు అనుసంధానించారు. ఇది ఆమోదం పొందిన దరఖాస్తుల అదనపు సమాచారాన్ని అందించింది.

ఆమోదం పొందిన దరఖాస్తుల్లో సగానికి పైగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లతో పాటు ఇతర కంప్యూటర్ సంబంధిత ఉద్యోగులవి.

భారతీయ కంపెనీల్లో ఎక్కువ భాగం లెవెల్2 ఉద్యోగస్తుల మీదనే ఆధారపడ్డాయి.

విప్రోలో పని చేసే వారి కోసం 874 అప్లికేషన్లు ఆమోదం పొందితే అందులో 822 మంది లెవెల్ 2 కేటగిరీకి చెందిన ఉద్యోగులు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 674 అప్లికేషన్లు ఆమోదం పొందితే అందులో 639 మంది లెవెల్ 2 కేటగిరీకి చెందిన వారు.

అదే విధంగా ఎల్టీఐ మైండ్ ట్రీవి 559, టెక్ మహీంద్రావి 343 అప్లికేషన్లు లెవెల్ 2 ఉద్యోగుల కోసమే ఆమోదం పొందాయి.

అమెజాన్, గూగుల్, క్వాల్‌కామ్‌లోనూ లెవెల్ 2 ఉద్యోగులు భారీ స్థాయిలో ఉన్నారు.

బీబీసీ విశ్లేషణ ప్రకారం భారతీయ అవుట్ సోర్సింగ్ కంపెనీలు చెల్లించే జీతాలు అమెరికాలోని మేజర్ టెక్ సంస్థలు చెల్లించే జీతాల కంటే తక్కువగా ఉన్నాయి. అంతే కాదు 2024లో ఆమోదం పొందిన హెచ్-1బీ వీసా ఉద్యోగుల సాధారణ జీతాల కంటే తక్కువగా ఉన్నాయి.

తమ కంపెనీలో ప్రత్యేక అవసరాల కోసం ఉద్యోగులను నేరుగా నియమించుకోవడానికి బదులు అవుట్ సోర్సింగ్ కంపెనీలు థర్డ్ పార్టీ క్లైంట్లకు ఉద్యోగులను సరఫరా చేస్తున్నట్లు వాషింగ్టన్‌లోని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో , టెక్ మహీంద్రా లాంటి ప్రముఖ భారతీయ కంపెనీలతో పాటు అమెరికాలో ప్రధాన కేంద్రం ఉన్న కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా అవుట్ సోర్సింగ్ తరహాలోనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈపీఐ అంచనా వేసింది.

ఫలితాల్లో ఆశ్చర్యకరమైనా తేడా

లెవెల్ 2 కేటగిరీలో అనేక దరఖాస్తులను ఆమోదించారు.

ఈ కేటగిరీలో 'కంప్యూటర్ ఆపరేషన్స్‌'లో పని చేసే ఉద్యోగుల జీతాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశ్లేషణ చేశారు.

ఫలితాల్లో ఆశ్చర్యకరమైన తేడా ఉంది.

భారత్‌లో భారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేజర్ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ ఉద్యోగుల వార్షిక వేతనం 77వేల డాలర్ల నుంచి 87,400 డాలర్ల మధ్య ఉంది.

2024లో అమెరికాలో కంప్యూటర్ ఆపరేషన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల వార్షిక సగటు వేతనం లక్ష ఆరువేల డాలర్లని అమెరికన్ కార్మిక గణాంకాల విభాగం చెబుతోంది.

2024లో అన్ని కంపెనీలు కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలలో హెచ్1బీ కార్మికులకు చెల్లించే సగటు జీతం 98,904 డాలర్లు.

ఇది ఇప్పటికీ భారతీయ ఐటీ కంపెనీలు చెల్లించే జీతాల కంటే ఎక్కువ.

అమెరికన్ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లెవెల్ 2 ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.

వారి సగటు వార్షిక వేతనం లక్షా 45వేల డాలర్ల నుంచి లక్షా 65వేల డాలర్ల మధ్య ఉంది.

""వీసా స్పాన్సర్ చేసే యజమాని హెచ్1బీ కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని చెల్లిస్తుంది. కానీ అదే కంపెనీ తన ఉద్యోగిని క్లైంట్‌ సేవలకు అందించినప్పుడు అధికంగా వసూలు చేస్తుంది" అని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ సాఫ్ట్‌వేర్ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ దభాద్కర్ అన్నారు.

విదేశీ ఉద్యోగులకు స్థిర జీతం చెల్లించి లాభాలను స్పాన్సర్ సంస్థలు జేబులో వేసుకుంటాయని ఆయన చెప్పారు.

ఈ కంపెనీల నిర్వహణలోని గెస్ట్ ‌హౌస్‌లు ఎప్పుడూ నిండుగా ఉంటాయని, నిపుణులైన ఉద్యోగులు అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)