నేపాల్: ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు కూలిన విమానం, 68కి పెరిగిన మృతుల సంఖ్య
నేపాల్‌లోని పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయంలో యెతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 68కి పెరిగినట్లు బీబీసీకి సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి జగన్నాత్ నిరులా చెప్పారు.
ఆ 68 మృతదేహాలను వెలికి తీశారు.
విమానంలోని 68 మంది ప్రయాణికుల్లో 53 మంది నేపాల్‌కు చెందినవారు కాగా, అయిదుగురు భారతీయులు ఉన్నారని ఆయన వెల్లడించారు.
రష్యాకు చెందిన నలుగురు, కొరియా ప్రయాణికులు ఇద్దరు, ఐర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ఆయన తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు.
విమానం కాఠ్‌మాండూ నుంచి పోఖరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఫొటో సోర్స్, KRISHNAMANI BARAL
విమానం మరో 10 లేదా 20 సెకన్లలో ల్యాండ్ అవ్వబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.
‘‘ప్రమాదం తర్వాత కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పాత దేశీయ విమానాశ్రయాన్ని మూసేశారు. మళ్లీ వీటిలో ఎప్పుడు కార్యకలాపాలు సాగుతాయో ఇప్పుడే చెప్పలేం’’ అని బీబీసీతో ఆయన అన్నారు.
రెస్క్యూ ఆపరేషన్
"పోఖరా విమానాశ్రయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సేతీ నది సమీపంలో విమానం కూలిపోయింది. 120 మంది రేంజర్లు, దాదాపు 180 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విమానంలో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు" అని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి రతి కృష్ణా ప్రసాద్ భండారి ఆయన వివరించారు.
ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుందని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి జగన్నాథ్ నీరులా తెలిపారు.

ఫొటో సోర్స్, Krishnamani Baral
"ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. ముమ్మర సహాయక చర్యలు జరుగుతున్నాయి" అని జగన్నాథ్ నీరులా తెలిపారు.
కాఠ్‌మండూ నుంచి 10:32 గంటలకు విమానం బయలు దేరింది.
ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఫొటో సోర్స్, FACEBOOK/NEPAL PRESS
పోఖరా విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం కూలిపోయినట్లు తొలుత ఏఎన్‌ఐ తెలిపింది.
అందులో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, ప్రస్తుతానికి విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
నేపాల్‌లోని పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఓల్డ్ విమానాశ్రయానికి మధ్యలో యెతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయిందని యెతి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్టౌలా చెప్పినట్లు ‘ద ఖాట్మండు పోస్ట్’ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ఉన్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కూడా వెల్లడించింది.
యెతి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్టౌలా, ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, ‘‘విమానంలో 68 మంది ప్రయాణీకులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారో ఇంకా తెలియదు’’ అని అన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Krishnamani Baral
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"యెతి ఎయిర్‌లైన్స్ ఏఎన్‌సీ ఏటీఆర్ విమానం 72 మందితో కాఠ్‌మండూ నుంచి పోఖారాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి కావాల్సిన సహాయం అందించాలని భద్రతా సిబ్బందిని ప్రభుత్వానికి చెందిన ఇతర ఏజెన్సీలను కోరుతున్నా" అని ఆయన ట్వీట్ చేశారు.
కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?
- దిల్లీ: గర్భంతో ఉన్న భార్యను తగులబెట్టాలని ప్రయత్నించాడు... ఇలాంటి నేరాలకు శిక్షలేంటి?
- రాజమౌళి: ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ దేవుడు అన్న స్టీవెన్ స్పీల్బర్గ్ ఎవరు
- సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















