మడగాస్కర్: సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి

సోమవారం జరిగిన ప్రమాదం నుంచి గెలె సహా మరో ఇద్దరు భద్రతా అధికారులు బయటపడ్డారు

ఫొటో సోర్స్, PRESIDENT ANDRY RAJOELINA/ TWITTER

ఫొటో క్యాప్షన్, సోమవారం జరిగిన ప్రమాదం నుంచి గెలె సహా మరో ఇద్దరు భద్రతా అధికారులు బయటపడ్డారు

సముద్రంలో హెలీకాప్టర్ కూలిపోవడంతో తాను 12 గంటల పాటు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డానని మడగాస్కర్‌కు చెందిన ఒక మంత్రి వెల్లడించారు. రెస్క్యూ మిషన్ సందర్భంగా తమకు ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.

''ఇది నేను చనిపోయే సమయం కాదు'' అని పోలీస్ మినిస్టర్ సెర్జె గెలె అన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

హెలీకాప్టర్‌లో ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈశాన్య ప్రాంతంలో ప్రయాణీకుల పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి ఈ బృందం వెళ్లింది.

పడవ మునక ప్రమాదంలో కనీసం 39 మంది మరణించారని మంగళవారం అధికారులు తెలిపారు.

ఈ ఘటన పట్ల ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలీనా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారితో పాటు గెలె, మిగతా ఇద్దరు అధికారులకు కూడా ఆయన నివాళులర్పించారు.

కానీ ఈ ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హెలీకాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి 7:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు ఈదుకుంటూ వచ్చినట్లు గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.

తనకు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే తనకు చలిగా ఉందని అన్నారు.

''నా కుటుంబ సభ్యులు, నా సహోద్యోగులు, ప్రభుత్వ అధికారులు చూసే విధంగా ఈ వీడియోను ప్రసారం చేయాలని నేను కోరుకుంటున్నా. నేను బతికే ఉన్నాను. క్షేమంగా ఉన్నాను'' అని మహాంబో గ్రామస్థులను గెలె కోరారు.

గెలె, హెలీకాప్టర్‌లోని ఒక సీటును నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ తెలిపారు.

''ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారు. మంత్రిగా కూడా ఆయన అదే లయను కొనసాగించారు. 30 ఏళ్ల వ్యక్తిలా ఆయన పోరాడారు. ఆయనవి ఉక్కు నరాలు'' అని రావోవీ ప్రశంసించారు.

మూడు దశాబ్ధాల పాటు పోలీసు శాఖలో పనిచేసిన గెలె, ఈ ఆగస్టులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

వీడియో క్యాప్షన్, సముద్రం తరుముకొస్తోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)