ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తరువాత ఈ-వెరిఫై చేయడం ఎలా? చేయకపోతే ఏమవుతుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్నుల దాఖలకు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల చివరితో ఈ గడువు ముగుస్తుంది.
ఈ గడువు లోపల పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. అయితే, రిటర్నులు మాత్రమే దాఖలు చేస్తే సరిపోదు. పన్ను రిటర్నులు దాఖలు చేసిన తర్వాత నిర్దిష్ట సమయంలోగా వాటిని ఈ-వెరిఫై చేయాలి. అప్పుడే రిటర్న్స్ ఫైల్ చేయడం పూర్తయినట్లు.
రిటర్న్స్ దాఖలు చేసిన వారికి, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈవెరిఫికేషన్ కోసం గడువు ఇస్తుంది. ఈ గడువు 30 రోజులు ఉంటుంది.
అంతకుముందు ఈ గడువు 120 రోజులు ఉండేది. ఈ కాల వ్యవధిని 120 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.
ఒకవేళ పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసి, గడువు లోపల ఈవెరిఫికేషన్ చేయకపోతే ఆ రిటర్న్స్ ఇన్‌వాలిడ్ అయిపోతాయి.
ఈ-వెరిఫికేషన్ చేయడానికి వివిధ మార్గాలను ఆదాయపు పన్ను విభాగం నిర్దేశిస్తోంది.
ప్రస్తుతం మనం ఏయే మార్గాల ద్వారా రిటర్నులను ఈవెరిఫికేషన్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్, నాన్-రిజిస్టర్డ్ యూజర్లకు ఈ-వెరిఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
అందులో సూచించినవాటిలో ఏదైనా పద్ధతిలో ఈవెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈవెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉన్న పద్ధతులు..
- డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్
- ఆధార్ ఓటీపీ
- బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ వాడుతూ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్‌తో వెరిఫై చేసుకోవడం
- ఆఫ్‌లైన్ విధానంలో బ్యాంకు ఏటీఎం ద్వారా వెరిఫై చేయడం
- నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈవెరిఫై చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, incometax.gov.in
ఆధార్ ఓటీపీతో ఈ-వెరిఫై చేయడం ఇలా..
- ఈవెరిఫై పేజీలో, ‘ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ ఓటీపీ ఆన్ మొబైల్ నంబర్ రిజిష్టర్డ్ విత్ ఆధార్’(ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేయాలనుకుంటున్నా) అనే దానిపై క్లిక్ చేసి, కంటిన్యూ నొక్కాలి.
- ఆధార్ ఓటీపీ పేజీపై వచ్చే ‘ఐ అగ్రీ టు వేలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్’ (నా ఆధార్ వివరాలను వేలిడేట్ చేసేందుకు అంగీకరిస్తున్నా) అనే చెక్ బాక్స్‌పై నొక్కి, జనరేట్ ఆధార్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే 6 అంకెల ఓటీపీని నమోదు చేసి, వేలిడేట్ అని నొక్కాలి.
ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని మీరు నోట్ చేసి పెట్టుకోవాలి.
ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్న్స్ ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, incometax.gov.in
నెట్ బ్యాంకింగ్‌లో ఈ-వెరిఫై చేసుకోవడం ఎలా?
- ఈ-వెరిఫై పేజీలో ‘త్రూ నెట్ బ్యాంకింగ్’ (నెట్ బ్యాంకింగ్ ద్వారా) అనే లింక్‌పై క్లిక్ చేసి, కంటిన్యూ నొక్కాలి.
- ఏ బ్యాంకు ద్వారా మీరు ఈ-వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారో, దాన్ని ఎంపిక చేసుకుని, కంటిన్యూ క్లిక్ చేయాలి.
- డిస్‌క్లెయిమర్‌ను చదివి, అర్థం చేసుకుని కంటిన్యూ అనే దాన్ని నొక్కాలి.
- ఆ తర్వాత, మీ బ్యాంకు అకౌంట్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి వెళ్తుంది.
- యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి.
- బ్యాంకు వెబ్‌సైట్‌పై ఈఫైలింగ్‌లోకి లాగిన్ అయ్యే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగౌట్ అయి, ఈఫైలింగ్ పోర్టల్ తెరుచుకుంటుంది.
- విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, ఈఫైలింగ్ డ్యాష్‌బోర్డు కనిపిస్తుంది. సంబంధిత ఐటీఆర్/ఫామ్/సర్వీసులోకి వెళ్లి, ఈ-వెరిఫై అని నొక్కాలి. మీ ఐటీఆర్/ఫామ్/సర్వీసు విజయవంతంగా ఈ-వెరిఫై అవుతుంది.
ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసి పెట్టుకోవాలి.
ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్న్స్ ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
బ్యాంక్ ఏటీఎం(ఆఫ్‌లైన్ విధానం) నుంచి..
- మీ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి, ఏటీఎం కార్డును స్వైప్ చేయాలి.
(నోట్: కొన్ని బ్యాంకుల ఏటీఎం ద్వారా మాత్రమే ఈవీసీని జనరేట్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి)
- పిన్‌ను ఎంటర్ చేయాలి.
- ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కోసం ఈవీసీ జనరేట్ అనే దానిపై నొక్కాలి.
- ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి ఈవీసీ వస్తుంది.
(నోట్: అయితే, సంబంధిత బ్యాంకు అకౌంట్‌తో పాన్ లింక్ అయి ఉండాలి. అదే పాన్ నెంబర్ ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి)
- యాక్సిస్ బ్యాంక్, కెనరా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఐడీబీఐ , కోటక్ మహింద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల ఏటీఎం నుంచి ఈవీసీని జనరేట్ చేసుకోవచ్చు.
- అలా జనరేట్ చేసుకున్న ఈవీసీని ‘ఐ ఆల్రెడీ హ్యావ్ యాన్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్(ఈవీసీ)’ అనేది ఎంపిక చేసుకోవడం ద్వారా రిటర్నులు ఈ-వెరిఫై చేయొచ్చు.
అప్పటికే ఉన్న ఈవీసీతో ఈ-వెరిఫై చేయడం ఇలా..
- ఈ-వెరిఫై పేజీలో ‘ఐ ఆల్రెడీ హ్యావ్ యాన్ ఈవీసీ’ అనే దానిపై క్లిక్ చేయాలి.
- ఈవీసీని నమోదు చేసి, కంటిన్యూ నొక్కాలి.
ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ కనిపిస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసి పెట్టుకోవాలి.
ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్న్స్ ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఫొటో సోర్స్, incometax.gov.in
బ్యాంకు అకౌంట్ నుంచి ఈవీసీ జనరేట్ చేయడం
- ఈవెరిఫై పేజీలో ‘బ్యాంకు అకౌంట్ ద్వారా’ అనే దానిపై క్లిక్ చేసి, కంటిన్యూ నొక్కాలి.
(నోట్: ఈవీసీ జనరేట్ అయి, ప్రీవాలిడేట్, ఈవీసీ ఎనాబుల్ బ్యాంకు అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి వస్తుంది’
- బ్యాంకు అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఈవీసీని Enter EVC బాక్స్‌లో నమోదు చేసిన, ఈవెరిఫై అని నొక్కాలి.
ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసి పెట్టుకోవాలి. ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్నులు ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఫొటో సోర్స్, incometax.gov.in
డీమాట్ అకౌంట్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(EVC) జనరేట్ చేసుకుని ఈవెరిఫై చేసుకోవడం ఎలా?
- ఈవెరిఫై పేజీలో ‘డీమాట్ అకౌంట్ ద్వారా’ అనే దానిపై క్లిక్ చేసి, కంటిన్యూ నొక్కాలి.
నోట్: ఈవీసీ జనరేట్ అయి, ప్రీవాలిడేట్, ఈవీసీ ఎనేబుల్ డీమాట్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి వస్తుంది.
- డీమాట్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఈవీసీని Enter EVC బాక్స్‌లో నమోదు చేసిన, ఈవెరిఫై అని నొక్కాలి.
ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసి పెట్టుకోవాలి.
ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్నులు ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఫొటో సోర్స్, incometax.gov.in
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్(డీఎస్‌సీ) వాడుతూ..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈవెరిఫై లేటర్ ఆప్షన్( e-Verify Later option)ను ఎంపిక చేసుకుంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్(DSC) వాడుతూ మీ ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయలేరు.
అలా కాకుండా రిటర్న్స్ దాఖలు చేసిన వెంటనే ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేసుకోవాలనుకునే వారు ఈవెరిఫికేషన్ కోసం డీఎస్‌సీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
- ఈ-వెరిఫై పేజీలో ఉన్న ‘ఐ వుడ్ లైక్ టు ఈవెరిఫై యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్’ అనేది క్లిక్ చేసి కంటిన్యూ నొక్కాలి.
- మీ గుర్తింపు ధ్రువీకరణ(వెరిఫై యువర్ ఐడెంటిటీ) పేజీలో, ‘డౌన్‌లోడ్ ఎంసైనర్ యుటిలిటీ’ని క్లిక్ చేయాలి.
- ఎంసైనర్ యుటిలిటీ డౌన్‌లోడ్ అయి, ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత, వెరిఫై యువర్ ఐడెంటిటీ పేజీలో ‘ఐ హ్యావ్ డౌన్‌లోడెడ్ అండ్ ఇన్‌స్టాల్డ్ ఎంసైనర్ యుటిలిటీ’ అనేది ఎంపిక చేసుకుని, కంటిన్యూ నొక్కాలి.
- డేటా సైన్ పేజీలో ప్రొవైడర్, సర్టిఫికేట్‌ను ఎంపిక చేసుకుని, ప్రొవైడర్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత సైన్ అనే దాన్ని నొక్కాలి.
ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన సక్సెస్ మెసేజ్ పేజీ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసి పెట్టుకోవాలి.
ఈఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి రిటర్నులు ఈవెరిఫికేషన్ అయినట్లు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఈ-వెరిఫికేషన్ ఆలస్యమైతే జరిమానా ఉంటుందా?
గడువు లోపల వెరిఫై చేసుకోకపోతే, మీ రిటర్నులను దాఖలు అయినట్లుగా పరిగణించరు. ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద ఐటీఆర్ దాఖలు చేయనందుకు వర్తించే అన్ని పర్యవసానాలను ఎదుర్కోవాలి.
అయితే, గడువు లోపల ఎందుకు ఈవెరిఫికేషన్ చేయలేకపోయారో తెలుపుతూ అభ్యర్థనను పెట్టుకోవచ్చు. ఈ అభ్యర్థనలో పేర్కొన్న కారణం సరైనదే అయితే ఈవెరిఫై చేయడానికి మరో అవకాశం ఇస్తుంది ఆదాయ పన్ను శాఖ.
ఈవీసీ(EVC) అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(ఈవీసీ) అనేది 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్.
దీన్ని ఈవెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఈఫైలింగ్ పోర్టల్, బ్యాంకు అకౌంట్, డీమ్యాట్ అకౌంట్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీకి పంపుతారు.
ఈవీసీ జనరేట్ చేసుకున్న సమయం నుంచి 72 గంటల పాటు వేలిడ్‌గా ఉంటుంది.
(ఆధారం: ఆదాయ పన్ను శాఖ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














