లారా బెనాంటి: రెండు వేల మంది ప్రేక్షకుల ముందు స్టేజ్‌పైనే గర్భస్రావం.. ‘ఆ నొప్పి నాకు కొత్త కాదు’

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్ నటి లారా బెనాంటికి ఇటీవల స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంలో గర్భస్రావం అయ్యింది.
‘అలా జరుగుతుందని నాకు తెలుసు. ముందు రోజు రాత్రే అది నెమ్మదిగా మొదలైంది’ అని టోనీ అవార్గు గెలుచుకున్న ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.
‘ఇలా జరగడం అదే తొలిసారి అయినా.. లేదంటే రెండోసారి అయినా అయితే నేను అప్పుడు స్టేజ్‌పై ఉండలేకపోయేదాన్ని. కానీ, ఇలా గర్భం కోల్పోవడం, ఆ నొప్పి, గర్భం పోవడం వల్ల ఏర్పడే శూన్యత నాకు కొత్త కాదు’ అని రాశారామె.
‘గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను నా భర్తతో కలిసి ఎదుర్కొన్నాను.’
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
‘కానీ ఈసారి మేం దయాళురైన మరికొందరితో కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాం’ అన్నారామె.
నాష్‌విల్లే, సూపర్‌గర్ల్ టీవీ షోలలో నటించిన 43 ఏళ్ల బెనాంటీ తనకు గర్భస్రావం అవుతున్న సమయంలో 2000 మంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శన ఇస్తున్నారు. ఈ నాటక ప్రదర్శనలో అలన్ కమింగ్, జెరెమీ జోర్డాన్ కూడా ఉన్నారు.
‘అలాంటి పవిత్ర సమయంలో నన్ను దుఃఖం నుంచి బయటపడేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అప్పటికి నేనున్న పరిస్థితిని చూసి నా చుట్టూ చేరి సాయం చేసినందుకు నా స్నేహితులు, ప్రదర్శనలో ఉన్న తోటి కళాకారులకు ధన్యవాదాలు’ అన్నారామె.
ఆ సమయంలో తనకు అండగా ఉన్న తన బ్యాండ్, సిబ్బంది, నిర్మాతలకు ఆమె థాంక్స్ చెప్పారు. అంతేకాదు... కొద్దికాలం కోసమే అయినా తన గర్భంలో ఉన్న ఆ చిన్నారి ఆత్మకూ ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
లారా, ఆమె భర్త పాట్రిక్‌కు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు గత ఏడాది సరోగసీ ద్వారా జన్మించారు.
‘నేను, నా భర్త హృదయ విదారక స్థితిలో ఉన్నాం’ అన్నారామె.
‘సానుభూతి కోసమో, అందరి దృష్టిని ఆకర్షించేందుకో ఇదంతా నేను షేర్ చేసుకోవడం లేదు. నాలా ఇలాంటి కష్టం అనుభవించిన అనేక మంది ఇతరులకు ఇలాంటి నష్టంలో అవమానమేమీ లేదని, వారు ఒంటరిగా లేరని చెప్పడానికే ఇదంతా షేర్ చేస్తున్నాను’ అని ఆమె తన పోస్ట్‌లో రాశారు.
ఆ ప్రదర్శనలో లారాతో పాటు ఉన్న రాండీ రెయిన్‌బో వంటివారి నుంచి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమెకు మద్దతు లభించింది. ‘మీరు అన్నిరకాలుగా గొప్పవారు. మీ పట్ల, పాట్రిక్ పట్ల నా ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఉంటాయి’ అని రాశారు.
లారా తన కెరీర్‌లో అయిదు సార్లు టోనీ అవార్డులకు నామినేట్ అయ్యారు. 2008లో జిప్సీకిగాను ఆమెకు టోనీ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ఈస్టర్: శిలువ వేయడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ...
- రంజాన్: పెరుగు, యాలకులు, పుదీనా తింటే రోజంతా దాహం వేయదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














