హైకింగ్: ‘బూటులో నీళ్లు పట్టుకుని తాగుతూ 10 రోజులు ప్రాణాలు కాపాడుకున్నా’ అంటున్న పర్వతారోహకుడి మిస్సింగ్ కథ...

ఫొటో సోర్స్, SVL Steve
- రచయిత, నడిన్ యూసిఫ్
- హోదా, బీబీసీ న్యూస్
అలా నడుస్తూ వెళ్లి పర్వతాల్లో తప్పిపోయిన ఒక వ్యక్తిని పది రోజుల తర్వాత రక్షించారు. ఈ పది రోజుల పాటు రోజుకు కొన్ని రేగు పళ్లు, ఒక గ్యాలన్ (3.8 లీటర్లు) నీళ్లు తాగి ఆయన ప్రాణాలను కాపాడుకున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన లుకాస్ మెక్లిష్ అనే హైకర్, జూన్ 11న శాంటాక్రూజ్ పర్వతాల్లో హైకింక్ కోసం వెళ్లిన కొద్దిసేపటి తర్వాత తప్పిపోయారు.
ఇటీవల చెలరేగిన కార్చిచ్చుల కారణంగా ఆ ఏరియాలోని ఆనవాళ్లు (ల్యాండ్‌మార్క్స్) చెరిగిపోవడంతో ఆయన దారి తప్పారు.
ఫాదర్స్ డే వేడుకలకు ఆయన రాకపోవడంతో, ఆయన కనిపించడం లేదంటూ జూన్ 16న కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. తర్వాత రోజుల పాటు ఆయన కోసం వెదికారు.
శాంటాక్రూజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక డ్రోన్ ఆయనను గుర్తించడంతో గత గురువారం నాడు ఆయనను తీసుకురాగలిగారు.
సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న కాల్ ఫైర్ సాన్ మటియో ఒక ట్వీట్ చేశారు. ‘‘సహాయం కోసం ఎవరో అరుస్తున్నట్లు చాలా రిపోర్టులు వచ్చాయి. కానీ, ఆ వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం చాలా కష్టమైంది.’’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శాంటా క్రూజ్ కౌంటీలోని ఎంపైర్ గ్రేడ్ రోడ్, బిగ్ బాసిన్ హైవే మధ్య గల అడవిలో మెక్లిష్‌ను గుర్తించినట్లు చెప్పారు.
ఆయన ఒంటి మీద గాయాలేవీ లేవని, కుటుంబాన్ని కలిశారని శాంటాక్రూజ్ కౌంటీ ఆఫీస్ వెల్లడించింది.
స్థానిక వార్తా సంస్థ ఏబీసీతో మాట్లాడిన మెక్లిష్, తాను కేవలం ఒక జత హైకింగ్ బూట్లు, టోపీతో హైకింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు.
‘‘నా దగ్గర ఫ్లాష్‌లైట్, లెదర్‌మ్యాన్ టూల్ వంటి ఒక మడత కత్తెర ఉంది’’ అని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎక్కువగా నీళ్లు తాగుతూ ప్రాణాలతో బయటపడ్డానని, జలపాతం నుంచి బూట్లను ఉపయోగించి నీళ్లను సేకరించానని చెప్పారు.
‘‘రోజూ గ్యాలన్ నీళ్లు తాగేలా చూసుకున్నాను. కానీ, అహారం లేకపోవడంతో ఇబ్బంది పడ్డాను. తిండి లేక నీరసం వచ్చింది. నన్ను వెదుక్కుంటూ వచ్చిన సహాయక బృందాలను చూడగానే సంతోషంగా అనిపించింది. ఇక ఈ ఏడాదికి సరిపడా హైకింగ్ చేసినట్లు అనిపిస్తోంది. ఇప్పుడప్పుడే ఇక బయటకు వెళ్లను.’’ అని మెక్లిష్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ స్పీకర్ పదవి ఎందుకంత కీలకం, ఎలా ఎన్నుకుంటారు?
- నీట్, నెట్ వివాదం: పేపర్ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు, కోటి రూపాయల దాకా జరిమానా, ఇంకా ఈ కొత్త చట్టంలో ఏముందంటే...
- అల్కా యాజ్ఞిక్: ఈ సింగర్‌కు హఠాత్తుగా వినికిడి లోపం ఎందుకు వచ్చింది, అసలు ఈ సమస్య ఎలా వస్తుంది?
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరిగిందా? నిజమో కాదో తెలిసేది ఆ నిర్ణయంతోనే
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














