మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి?

నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి దగ్గరపడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, బడ్జెట్‌పై ఫోకస్ పెరిగింది.

అలాగే, ఎన్నికల ఏడాది వచ్చినప్పుడు మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ వంటి పదాలు మీడియాలో కనిపిస్తుంటాయి.

మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇంతకీ మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? పూర్తిస్థాయి బడ్జెట్ అంటే ఏమిటి? ఆ ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటి?

ఇంటెరిమ్ - ఓట్ ఆన్ అకౌంట్

ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అంతకుముందు రోజు ఆడిట్ నివేదికను సమర్పిస్తారు.

ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వీలుపడదు. అందువల్ల కొద్దికాలానికి మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దానినే మధ్యంతర బడ్జెట్‌గా వ్యవహరిస్తారు.

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని సవివరంగా ఇందులో పొందుపరుస్తారు.

పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు, ఇలా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో, వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలకు కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది.

ఒకవేళ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే, పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరమవుతుంది.

కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకూ ఈ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకూ అయ్యే వ్యయాలకు అవసరమయ్యే బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం అవసరమవుతుంది.

దీనిని ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌గానూ వ్యవహరిస్తారు.

మొత్తం బడ్జెట్ ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఆ సంవత్సరానికి సంబంధించిన వ్యయ బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్‌లో సమర్పించాలి.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్‌లో మార్పులు ఉండొచ్చు.

పూర్తి బడ్జెట్‌లో గత ఏడాది మొత్తం ఆదాయ, వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్‌లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికల వరకూ మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్‌లో పెట్టేందుకు వీలులేదు.

బడ్జెట్

ఫొటో సోర్స్, ANAND PUROHIT

ఎలాంటి చర్చ అవసరం లేదు..

మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులకు ఆమోదం లభిస్తుంది కాబట్టి, ఎన్నికల వరకూ అయ్యే వ్యయాలను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు. అదే పూర్తి బడ్జెట్‌పై అయితే చర్చ జరగాల్సి ఉంటుంది.

ఇంటెరిమ్ బడ్జెట్ ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటు.

అయితే ఓట్ ఆన్ అకౌంట్‌లో ప్రధాన పన్నులలో మార్పులు, విధాన సంస్కరణలు చేపట్టర

నిజానికి, భారత రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరిచిలేదు. కాబట్టి, రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది.

1962-63లో మొరార్జీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

1997-98లో రాజ్యాంగ సందిగ్ధత ఏర్పడింది. ఆ సమయంలో ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)