వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు.. 14 ఫోటోల్లో..

 స్వామి వారు
ఫొటో క్యాప్షన్, మొదటిరోజు పెద్ద శేష వాహనంపై ఊరేగుతున్న స్వామి వారు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తిరుమలలో నవరాత్రుల సందర్భంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. కానీ మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరులో వెంకటేశ్వరస్వామికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించిన టీటీడీ, ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది.

శ్రీవారి ఆలయం
ఫొటో క్యాప్షన్,

జీఎంసీ టోల్‌గేట్ నుంచి వైభవ మండపం వరకు ముఖ్యమైన కూడళ్లలో రంగురంగుల పువ్వుల మొక్కలను టీటీడీ ఏర్పాటు చేసింది.

దేవతా మూర్తుల ఆకారాలలో లైట్ సెట్టింగ్స్ జిగేల్ మనిపిస్తున్నాయి.

ప్రధాన ఆలయం చుట్టూ విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన లైటింగ్స్ అక్కడికి వచ్చే భక్తులను మైమరిపింపచేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలను ఈ ఫోటోల్లో చూడండి.

శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అలంకరణలో మహిళలు
ఫొటో క్యాప్షన్, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అలంకరణలో మహిళలు
ఆలయం
ఫొటో క్యాప్షన్, శ్రీవారి ఊరేగింపులో మహిళల నృత్యాలు
తిరుమల ఆలయం
ఫొటో క్యాప్షన్, తిరుమలలో వివిధ పూల మొక్కలు, విద్యుత్ దీపాలంకరణతో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన
శ్రీవారి ఆలయం
ఫొటో క్యాప్షన్, పుష్ప ప్రదర్శన శాలలో ఏర్పాటుచేసిన బకాసురుడి ఆకారం
శ్రీకృష్ణ ఆకారం
ఫొటో క్యాప్షన్, 12 రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహం
వీణ
ఫొటో క్యాప్షన్, వివిధ పుష్పాలతో అలంకరించిన వీణ
భీముడి ఆకారం
ఫొటో క్యాప్షన్, బకాసురుడి వధ కోసం భీముడు వెళ్తున్న దృశ్యం
గజేంద్ర మోక్ష సైకత శిల్పం
ఫొటో క్యాప్షన్, క్వారీ డస్టుతో ఏర్పాటుచేసిన గజేంద్ర మోక్ష సైకత శిల్పం
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం
ఫొటో క్యాప్షన్, గరుడాద్రి నగర్ ప్రాంతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న దృశ్యం
 విద్యుత్ దీపాలంకరణ
ఫొటో క్యాప్షన్, తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ
మహిళల నృత్యాలు
ఫొటో క్యాప్షన్, స్వామి వారి వాహనం ముందు నృత్యం చేస్తున్న మహిళలు
శ్రీవారి ఆలయం
ఫొటో క్యాప్షన్, వివిధ పుష్పాలతో అలంకరించిన శ్రీనివాసుడి ఆలయం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)