లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్‌ కనెక్షన్’ ఏంటి?

లెస్టర్

ఫొటో సోర్స్, Leicester Media

    • రచయిత, రేహా కన్సారా, అబ్దిరహీం సయీద్
    • హోదా, బీబీసీ ట్రెండింగ్, బీబీసీ మానిటరింగ్

లెస్టర్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింస చాలా మందిని విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించి డజన్ల మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ హింసకు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తప్పుడు వార్తలు ఆజ్యం పోస్తున్నాయా?

లెస్టర్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజానిజాలు కనుక్కొనేందుకు గత వారం రోజులుగా మేం ప్రయత్నిస్తున్నాం. హింసకు ముందు, ఆ తర్వాత వీటి ప్రభావాన్ని మేం అంచనా వేశాం.

కొందరు సోషల్ మీడియాను కావాలనే హింసకు ఆజ్యం పోసేందుకు ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు నగర తాత్కాలిక పోలీస్ చీఫ్ రాబ్ నిక్సన్ బీబీసీతో చెప్పారు.

మరోవైపు మేయర్ సర్ పీటర్ సోల్సబీ కూడా తప్పుడు వార్తల ప్రమేయముందని అన్నారు. మరోవైపు నిందితుల్లో ఒకరు సోషల్ మీడియా వల్ల ప్రభావితమైనట్లు కూడా స్పష్టంచేశారు.

మేం లెస్టర్‌లోని రెండు వర్గాల నాయకులతోనూ మాట్లాడాం. వారు కూడా ఉద్రిక్తతలకు కారణమైన కొన్ని వార్తల గురించి స్పందించారు. సెప్టెంబరు 17-18 తేదీల్లో తాము ఇక్కడ చూసిన ఉద్రిక్త పరిస్థితులను ముందెన్నడూ చూడలేదని వారు వివరించారు.

లెస్టర్

ఫొటో సోర్స్, Leicester Media

ఒక ఫేక్ స్టోరీ గురించి మాతో చాలా మంది మాట్లాడారు.

‘‘నేడు మా 15ఏళ్ల కుమార్తెను దాదాపుగా కిడ్నాప్ చేయబోయారు’’అని ఫేస్‌బుక్‌లో ఓ తండ్రి చేసిన అప్‌డేట్ పోస్టు గురించి ప్రజలు చెప్పారు. ‘‘నువ్వు ముస్లిమా? అని ముగ్గురు భారతీయ యువకులు ఆమెను అడిగారు. ఆమె అవునని చెప్పిన వెంటనే, వారిలో ఒకరు ఆమెను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు’’అని ఆ పోస్టులో ఉంది.

ఈ పోస్టును వందల మంది లైక్ చేశారు. ఇది ఫేస్‌బుక్‌తోపాటు ట్విటర్‌లోనూ వైరల్ అయ్యింది. ట్విటర్‌లో కమ్యూనిటీ యాక్టివిస్టు మాజిద్ ఫ్రీమ్యాన్ సెప్టెంబరు 13న దీన్ని షేర్ చేశారు. మరోవైపు ఈ ఘటన సెప్టెంబరు 12 రాత్రి జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించే మరో మెసేజ్‌ను కూడా ఆయన షేర్ చేశారు.

అయితే, అసలు అక్కడ కిడ్నాప్ చేసే ప్రయత్నమే జరగలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఒక రోజు తర్వాత, లెస్టర్ పోలీసులు దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘అసలు ఆ ఘటనే చోటుచేసుకోలేదు’’అని పోలీసులు స్పష్టం చేశారు. ఆ తర్వాత మాజిద్ ఫ్రీమ్యాన్ ఆ పోస్టును డిలీట్ చేశారు. మరోవైపు కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని ఆయన వివరించారు. అయితే, మొదట ఆ కుటుంబంతో మాట్లాడినప్పుడు అలా జరిగిందని భావించి, ఆ పోస్టు చేశానని ఆయన అన్నారు.

అయితే, అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఈ తప్పుడు కిడ్నాప్ వార్తా చాలా మందికి చేరిపోయింది.

వాట్సాప్‌లో ఈ మెసేజ్ చాలాసార్లు ఫార్వర్డ్ అయింది. ఇది నిజమేనని చాలా మంది భావించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లున్న కొందరు ఈ పోస్టు స్క్రీన్‌షాట్లను షేర్ చేశారు. ఆ కిడ్నాప్ వెనకున్న ఓ హిందూ యువకుడు ఉన్నాడంటూ వారు ఆరోపించారు.

అయితే, ప్రైవేటు నెట్‌వర్క్‌లపై ఈ పోస్టులు ఎంత మందికి చేరాయో అంచనా వేయడం కొంచెం కష్టం. ఇక పబ్లిక్ పోస్టుల విషయాన్ని అంచనా వేసేందుకు క్రౌడ్‌టాంగిల్ టూల్‌ను ఉపయోగించాం. అయితే, కిడ్నాప్ ఆరోపణలు షేర్‌ అవుతున్నట్లు మాకు కనిపించలేదు. బహుశా ఆ పోస్టులను వారు డిలీట్ చేసుంటారు. లేదా ప్రైవేటు గ్రూపుల్లో మాత్రమే వాటిని సర్క్యులేట్ చేసుకుంటున్నారు.

అయితే లెస్టర్‌లో హింసకు ఆ ఘటన కంటే చాలా ముందే బీజాలు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఆగస్టు 28న దుబాయిలోని ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం అనంతరం చోటుచేసుకున్న ఓ ఘటన గురించి మీడియాలో వార్తలు వచ్చాయి.

అసలు ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో తెలియడం లేదు. ఎవరిని అడిగా తమను నచ్చిన కథలను చెబుతున్నారు.

అయితే, ఆ రోజు ఏదో జరిగింది. ఆరోజు రాత్రి కొందరు యువకులు ఇండియా కిట్లు వేసుకొని లెస్టర్‌లోని మెల్టన్ రోడ్‌లో ‘‘డెత్ టు పాకిస్తాన్’’అని నినాదాలు చేస్తున్న ఒక వీడియో కనిపిపించింది. ఆ తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొంది, పోలీసులు కూడా వచ్చారు.

జనాల మధ్యలోకి వెళ్లిన ఒక ముస్లిం యువకుడిపై దాడిచేసినట్లు చెబుతూ ఒక వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. అయితే, ఆయన ముస్లిం యువకుడు కాదు. ఆయన ఒక సిక్కు.

లెస్టర్

మరికొందరు లెస్టర్‌లో హింసకు అంతకంటే ముందే బీజాలు పడ్డాయని చెబుతున్నారు. వారు మే 22న జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తున్నారు. 19ఏళ్ల ముస్లిం యువకుడిపై కొందరు యువకులు ఒత్తిడి చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో ఆ రోజు సోషల్ మీడియాలో పెట్టారు. ఒత్తిడి చేసేవారిని హిందూ అతివాదులుగా పేర్కొన్నారు. మరికొంతమంది హిందూత్వ అని కూడా పోస్టుల్లో రాసుకొచ్చారు.

అయితే, ఆ వీడియోలో పెద్దగా ఏమీ కనిపించలేదు. అది బ్లాక్ అండ్ వైట్‌లో అంత క్లారిటీతో లేదు. కొంతమంది యువకులు పరిగెత్తడం, చివరగా వాగ్వాదం జరగడం మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు వారు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? అని గుర్తించడం చాలా కష్టం.

ఈ ఘటనకు సంబంధించి శాంతి, భద్రతలను ఉల్లంఘించినట్లు కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు 28ఏళ్ల యువకుడిని విచారించారు. ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, బాధితుడి మతం గురించి కూడా సమాచారం అందుబాటులో లేదు.

ఈ కేసులో వాస్తవాల గురించి దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇది మతపరమైన ఘటన అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఎంత మందికి ఈ తప్పుడు వార్త చేరువైంది? ఎంతమందికి దీనికి ప్రభావితం అయ్యారు? లాంటి అంశాలు తెలుసుకోవడం కూడా చాలా కష్టం.

సెప్టెంబరు 17-18నాటి ఉద్రిక్త పరిస్థితులకు ఈ మూడు ఘటనలు మాత్రమే కారణం కాదు. సోషల్ మీడియాలో నాటి పరిస్థితికి ఆజ్యంపోసే ఘటనలు చాలా ఉన్నాయి.

లెస్టర్

ఫొటో సోర్స్, Twitter

లెస్టర్‌లోని ఈ ఘటనలు, ఉద్రిక్తతలు, శాంతి భద్రతల సమస్యలపై జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. వీటిపై చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ట్విటర్ అనాలిసిస్ టూల్ బ్రాండ్‌వాచ్‌తో ఈ కంటెంట్‌ను బీబీసీ మానిటరింగ్ విశ్లేషించింది. తాజా ఉద్రిక్తతలకు సంబంధించి లెస్టర్ పేరుతో దాదాపు 5 లక్షల ట్వీట్లు ఇంగ్లిష్‌లో మాకు కనిపించాయి.

2,00,000 టీట్ల శాంపిల్‌పై బీబీసీ మానిటరింగ్ దృష్టిసారించింది. వీటిలో దాదాపు సగం ట్వీట్లను భారత్‌లోని ప్రాంతాల నుంచి ట్వీట్ చేసినట్లు అనాలసిస్ టూల్ వెల్లడించింది. గత వారం రోజుల్లో భారత్ నుంచి చేసిన ట్వీట్లలో ఉపయోగించిన ప్రధాన హ్యాష్‌ట్యాగ్‌లు ఇవీ.. #Leicester #HindusUnderAttack and #HindusUnderattackinUK

ఈ అకౌంట్లలో కొన్ని కావాలనే తమ వాదనకు బలం చేకూర్చే ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టేందుకు ప్రత్యేకంగా క్రియేట్ చేసినట్లు బీబీసీ పరిశీలినలో తేలింది.

ఉదాహరణకు ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించిన కొన్ని ప్రొఫైల్స్‌కు ఎలాంటి ఫోటోలు లేవు. పైగా ఆ అకౌంట్లను కూడా తాజాగానే మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. అంటే కొందరు వ్యక్తులు ఇలాంటి భిన్న అకౌంట్లను నడిపిస్తున్నారని చెప్పడానికి ఇది సంకేతం కావొచ్చు.

లెస్టర్

మరోవైపు ఈ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించిన మొదటి 30 యూఆర్‌ఎల్‌లను బీబీసీ పరిశీలించింది. వీటిలో 11 లింక్‌లు న్యూస్ వెబ్‌సైట్ OpIndia.com రాసిన కథనాలకు తీసుకెళ్లాయి. ‘‘సరైన భారత్‌ను మీకు చూపిస్తాం’’అనేది ఈ వెబ్‌సైట్‌ ట్యాగ్‌లైన్. అయితే, కొన్ని నిజమైన ట్విటర్ ప్రొఫైల్స్ కూడా ఈ ఆర్టికల్స్‌ను షేర్ చేశాయి. వీటికి వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఓపీ ఇండియా రాసిన ఒక ఆర్టికల్‌లో బ్రిటిష్ రీసెర్చర్ షార్లెట్ లిట్‌ల్‌వూడ్ వ్యాఖ్యలను ఉటంకించాయి. ముస్లింల హింస వల్లే కొందరు హిందువులు లెస్టర్ వదిలివెళ్లిపోయారని ఆయన చెప్పినట్లు ఆ కథనంలో రాశారు. ఈ ఆర్టికల్‌ను దాదాపు 2,500 సార్లు రీట్వీట్ చేశారు. అయితే, కుటుంబాలు లెస్టర్‌ను వదిలివెళ్లిపోతున్న వార్తలను పోలీసులు ఖండించారు.

ఉద్రిక్తతల తర్వాత, సోషల్ మీడియా యాక్టివిటీ పెరగడంతో చాలా మంది హిందూ యాక్టివిస్టులు లెస్టర్‌కు తరలి రావడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.

అయితే, మొత్తంగా పోలీసులు సెప్టెంబరు 23నాటికి 47 మంది అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిది మందిపై అభియోగాలు మోపారు. అరెస్టైన వారిలో 36 మంది లెస్టర్‌కు చెందినవారే. మిగతావారిలో ఒకరు మార్కెట్ హార్‌బరో, ఎనిమిది మంది బర్మింగ్హమ్, ఇద్దరు లండన్‌లకు చెందినవారున్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అందరూ లెస్టర్ వారే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు సెప్టెంబరు 19న బర్మింగ్హమ్‌లో అగ్ని ప్రమాదం వెనుక కారణాల విషయంలోనూ అసత్య వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు అతివాదులే ఈ మంటలకు కారణమని కొందరు ఆరోపించారు. అయితే, దీనికి వారు ఎలాంటి ఆధారాలూ చూపించలేదు.

అయితే, ప్రమాదవశాత్తు అక్కడ మంటలు చెలరేగాయని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఫైర్ సర్వీస్ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

అయితే, ఉద్రిక్తతల తర్వాత చేసిన పోస్టులన్నీ తప్పుదోవ పట్టించేవని అనుకోవడానికి వీల్లేదు.

బాగా వైరల్ అయిన వీడియోల్లో కొందరు హిందువులు ముసుగులు వేసుకుని గ్రీన్‌ లేన్ రోడ్‌కు ప్రదర్శనగా వెళ్తున్న వీడియో ఒకటి. అక్కడ ముస్లింలు ఎక్కువగా జీవిస్తారు. ఆ ప్రాంతాల్లో జైశ్రీరామ్ నినాదాలు చేశారు.

మరోవైపు ఒక దేవాలయం వెలుపల కాషాయ జెండాను ఒక ముస్లిం వ్యక్తి లాగుతున్నట్లుగా ఒక పోస్టర్ కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అయితే, బెల్‌గ్రేవ్ రోడ్‌లోని ఓ దేవాలయం దగ్గర జెండాను నిజంగానే తొలగించారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, నిందితుడు ఎవరో ఇంకా తెలియరాలేదు. తప్పుడు వార్తలు, భావోద్వేగాలను పెంచే పోస్టులు ఇక్కడి హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేస్తున్నాయి.

దశాబ్దాల నుంచి ఇక్కడ దక్షిణాసియా వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. భారత్‌తోపాటు తూర్పు ఆఫ్రికా ప్రజలు కూడా ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?

హిందూత్వ సిద్ధాంతాల వల్లే ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లోని రాజకీయాలు ఇక్కడ కూడా ప్రతిబింబిస్తున్నాయని వారు అంటున్నారు. అయితే, అక్కడి సంస్థల ప్రమేయం ఇక్కడ ఉన్నట్లు బీబీసీకి ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

హింసాత్మక ఉద్రిక్తతలకు ఏది కారణమో కచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. అయితే, వర్గాల మధ్య విభేదాలను సోషల్ మీడియా మరింత తీవ్రం చేస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

(యస్మినారా ఖాన్, అహ్మద్ నూర్, ఖుస్ సమేజా, శ్రుతి మేనన్, నెడ్ డేవీస్, జాషువా చీతమ్, డేనియేల్ పాలంబో అదనపు సాయం అందించారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)