పాకిస్తాన్: 'ఈ మనిషితో నేను ఎందుకు ఉండలేకపోయానంటే...' - ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పాకిస్తాన్ ప్రజలతో పాటు ప్రతిపక్షాలను ఆశ్చర్యపోయేలా చేశారు. పార్లమెంట్‌ను రద్దు చేయడం, మళ్లీ ఎన్నికలకు వెళతామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన తర్వాత రాజకీయ నాయకుల నుంచి సాధారణ పౌరుల వరకు ఈ అంశంపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యర్థులు రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరిస్తుందని ఆశగా చూస్తున్నారు.
వీటన్నింటి కంటే ముందు పాకిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చు.
పాకిస్తాన్‌లోని రాజకీయ పరిణామాల గురించి సాధారణ పౌరులు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో ఎలాంటి స్పందనలు వస్తున్నాయో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, FB/IMRANKHAN
సోషల్ మీడియాలో పాకిస్తానీయులు ఏం అన్నారు?
ఇమ్రాన్ ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను సమర్థించేవారు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ఆయనను వ్యతిరేకించేవారు విమర్శలు చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం జాతినుద్దేశించి మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్, చివరి బంతి వరకు ఆడతానని అన్నారు.
కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే ట్విట్టర్‌లో నైలా ఇనాయత్ అనే యూజర్ వ్యంగ్యంగా స్పందించారు. ''నేను ఆఖరి బంతి ఆడే సమయం రాగానే ఆ బంతిని తీసుకొని పారిపోతాను'' అని ఆమె ఇమ్రాన్ ఖాన్‌ను ఎద్దేవా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. ''కొత్తగా ఎన్నికలకు వెళతామని చెప్పి, ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్యను మీరు సమర్థించుకోలేరు. ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ నిర్ణయాన్ని తీసుకునే రాజ్యాంగ హక్కు ఆయనకు లేదు. నియమాలను ఉల్లంఘించినప్పుడు తప్పకుండా శిక్షించాలి'' అని ఆమె ట్వీట్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రెహామ్ ఖాన్, గతంలో చాలా సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్‌పై విరుచుకుపడ్డారు. ''రాజ్యాంగం అంటే గౌరవం లేదు. వ్యక్తిగత, బాహ్య ప్రమాదాల గురించి కూడా ఎలాంటి చింత ఉండదు. నేను ఈ మనిషితో ఎందుకు ఉండలేకపోయానో ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది'' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
''ఈరోజు వేడుకలు చేసుకునేవారు, తమ తెలివితక్కువతనాన్ని రుజువు చేసుకుంటున్నారు. వారు మూర్ఖులని గుర్తించండి'' అని ఆమె రాశారు.

ఫొటో సోర్స్, FB/IMRANKHAN
పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్... ''పాకిస్తాన్ జిందాబాద్. ఇమ్రాన్ ఖాన్, మీరు ఎప్పటికీ ఒక దిగ్గజం'' అని ట్వీట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ నవ్వుతోన్న చిత్రాన్ని ట్వీట్ చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్, 'ద గేమ్ చేంజర్' అనే వ్యాఖ్యను జోడించారు.
''ఇమ్రాన్ ఖాన్ లేదా అధ్యక్షుడు ఇచ్చే ఆదేశాలు ఏవైనా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని ఆదివారం సుప్రీం కోర్టు తెలిపింది. అయినప్పటికీ తాత్కాలిక ప్రధానిని ఎన్నుకునే వరకు ఇమ్రాన్ ఖాన్‌ను ఆ పదవిలో కొనసాగాలని స్వయంగా అధ్యక్షుడు కోరుతున్నారు. ఇది కోర్టు ధిక్కారం అవుతుందా?'' అని ప్రముఖ జర్నలిస్టు హామిద్ మీర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ మొత్తం వ్యవహారంలో బాలాకోట్‌తో పాటు 2019 నాటి భారత్-పాక్ పరిస్థితుల గురించి చర్చిస్తున్నారు.
కొంతమంది 2019లో ఆసిఫ్ గఫ్ఫూర్ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆసిఫ్... ''మేం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం, మా సర్‌ప్రైజ్ కోసం వేచి చూడండి'' అని అన్నారు.
తాజాగా అర్షద్ షరీఫ్ ఈ ఫొటోను షేర్ చేస్తూ, 'నిజమైన పాకిస్తానీ ఎప్పుడూ తమ ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే పనులే చేస్తారు'' అని వ్యాఖ్యను రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ రుణపడి ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. దొంగలను ఇలాగే తరిమి కొట్టండి'' అంటూ సారా అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఇంకా చాలామంది పాకిస్తానీలు షాబాజ్ షరీఫ్ నిరాశగా ఉన్న ఫొటోను, ఇమ్రాన్ ఖాన్ నవ్వుతోన్న ఫొటోను జోడించి షేర్ చేస్తున్నారు. దీనికి 'ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు కథలు' అనే వ్యాఖ్యను జోడిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు పక్కన దొరికిన రూ.38 లక్షలు తిరిగిచ్చేశాడు.. ఆ తర్వాత ఈ కుర్రాడి జీవితమే మారిపోయింది
- యుక్రెయిన్‌లోని బుచా వీధుల్లో ఎటు చూసినా శవాలే.. ‘చేతులు వెనక్కి విరిచికట్టి, తల వెనుక కాల్చారు’
- ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- పాకిస్తాన్: ఒకే అంశంపై ఇమ్రాన్ ఖాన్‌ది ఒక మాట.. సైన్యానిది మరో మాట
- ‘ఇక్కడ కోర్సు చేస్తే ఏదో ఒక ఉపాధి దొరకడం ఖాయం.. పెద్దగా చదువుకోని గ్రామీణ యువతకు ఇది మంచి అవకాశం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)