వకార్ యూనిస్: ‘హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ నచ్చింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన పాక్ మాజీ క్రికెటర్

వకార్ యూనిస్

ఫొటో సోర్స్, Getty Images

'హిందువుల ముందు మొహమ్మద్ రిజ్వాన్ నమాజ్‌ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది' అన్న తన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యూనిస్ క్షమాపణలు చెప్పారు.

ఈ క్షమాపణకు సంబంధించిన వీడియోను వకార్ యూనిస్ ట్వీట్ చేశారు.

ఆ వీడియోలో, వకార్ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ మతపరమైన విషయాలపై మాట్లాడలేదు. నాకు అలాంటి ఉద్దేశం అస్సలు లేదు. నేను హద్దు దాటాను. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఆ సమయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను రిజ్వాన్‌ని చూడటంతో అలాంటి కొన్ని పదాలు ఉపయోగించాను. అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, అందుకు క్షమాపణలు కోరుతున్నాను"

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మ్యాచ్‌లో పాక్ గెలిచింది కాబట్టి ఆ ఉత్సాహంలో ఉండటంతో అలాంటి వ్యాఖ్యలు చేశాను కానీ నిజానికి తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని.. తప్పు చేశానని వకార్ యూనిస్ అంగీకరించారు.

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ భారీ విజయం సాధించడం ఇస్లాం విజయంతో ముడిపడి ఉందని ఆ దేశ హోం మంత్రి షేక్ రషీద్ గతంలో పేర్కొన్నారు. అక్టోబరు 24న దుబయిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రింక్స్‌ సమయంలో మహ్మద్ రిజ్వాన్‌ నమాజ్‌ చేయడం తననెంతో ఆకట్టుకుందని వకార్ యూనిస్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారత్‌పై పాకిస్తాన్ భారీ విజయం అనంతరం ఏఆర్‌వై న్యూస్ యాంకర్ కాషిఫ్ అబ్బాసీ 'ఆఫ్ ది రికార్డ్' షోలో జరిగిన చర్చలో వకార్‌ యూనిస్‌ మాట్లాడుతూ.. "పాకిస్తాన్ ఆటగాళ్లలో కూడా దూకుడు ఉంది. వికెట్ల మధ్య పరుగులు రాబడుతున్నారు. గెలుస్తారనే ఆత్మవిశ్వాసం వారి ముఖంలో కనిపించింది. హిందువుల మధ్యలో నిలబడి ప్రార్థనలు చేయడం రిజ్వాన్ చేసిన గొప్ప పని. అది నాకు చాలా ప్రత్యేకమైనది" అన్నారు.

వకార్ యూనిస్ ఇదంతా చెబుతుంటే హోస్ట్ కాషీఫ్ అబ్బాసీ నవ్వారు. ఈ చర్చలో షోయబ్ అక్తర్ కూడా పాల్గొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''అల్లా ముందు నమస్కరిస్తే, ఎవరి ముందు తల వంచడానికి అనుమతించడు, సుభాన్ అల్లా'' అని రిజ్వాన్ ప్రార్థనలు చేస్తున్న వీడియో క్లిప్‌ను షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు.

వకార్ యూనిస్ పాకిస్తాన్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. ఆయన ఫాస్ట్ బౌలర్‌, పాక్ జట్టుకు కెప్టెన్, కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో 'క్రికెట్ జెంటిల్‌మెన్‌ గేమ్‌' అనే మాటలు మరింత హాస్యాస్పదంగా మారాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

వకార్ యూనిస్ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్ విశ్లేషకులు హర్షా భోగ్లే ట్వీట్ చేస్తూ.. ''వకార్ యూనిస్ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించింది'' అన్నారు.

భారత మాజీ క్రికెటర్‌ వెంకటేశ్ ప్రసాద్‌ వకార్‌ వ్యాఖ్యలకు స్పందనగా ట్వీట్‌ చేశారు. వెంకటేశ్ ప్రసాద్ తన ట్వీట్‌లో.. ‘హిందువుల మధ్య నిలబడి నమాజ్ చదవడం నాకు చాలా ప్రత్యేకమైనది’ అంటూ వకార్ చేసిన వ్యాఖ్యలను పోస్ట్‌ చేసి, ''ఆటలో ఈ జిహాదీ మనస్తత్వం మరోస్థాయికి చేరింది. ఎంత అవమానకరమైన మనిషి" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. ''ప్రేమ, క్రీడలు, కళలకు హద్దులు లేవని మేం ప్రతిరోజూ ప్రబోధిస్తాం. షేక్ రషీద్, వకార్ యూనిస్ మాటలతో ఆ ఆశ కాస్త అడియాశయ్యింది. తప్పుదోవ పట్టించే వారి పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ రజా అహ్మద్ రూమీ ట్వీట్ చేస్తూ వకార్ యూనిస్ వ్యాఖ్యలను సిగ్గుచేటుగా అభివర్ణించారు.

రూమీ తన ట్వీట్‌లో "ఇది వకార్ యూనిస్ చేసిన అవమానకరమైన వ్యాఖ్య. భారతదేశంలో ముస్లిం జనాభా ఎక్కువ. పాకిస్తాన్‌లో లక్షలాది మంది హిందువులు ఉన్నారు. ఆట ఒక ఆటలానే ఉండాలి తప్ప, ఇది రెండు మతాల మధ్య పోరు కాకూడదు'' అన్నారు.

క్రికెట్‌ను, మతాన్ని కలపడంపై చర్చ కొత్తది కాదు. 2006లో డాక్టర్ నసీమ్ అష్రఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వారి మత విశ్వాసాలకు సంబంధించిన కార్యకలాపాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని ఆయన తన ఆటగాళ్లను కోరారు. అయితే, డాక్టర్ నసీమ్ ప్రకటన పాకిస్తాన్ ఆటగాళ్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది.

డాక్టర్ నసీమ్ అష్రఫ్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, "ఆటగాళ్ల మత విశ్వాసాలు వారికి స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు. ఇవి రెండు మిళితమై ఉంటాయి. అయితే క్రికెట్, మతం మధ్య బ్యాలన్స్ ఉండాలి''

"నేను దీని గురించి జట్టు కెప్టెన్ ఇంజమామ్-ఉల్ హక్ (అప్పటి కెప్టెన్)తో మాట్లాడాను. వ్యక్తిగత విశ్వాసాలపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇస్లాం తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడాన్ని అనుమతించదని ఇంజమామ్‌తో చెప్పాను"

ఆట సమయంలో మతపరమైన విషయాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని అనుమతించవచ్చా అని భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్‌ను బీబీసీ అడిగినప్పుడు ఆయన బదులిస్తూ.. "మత ఆచారాల వల్ల ఎవరికీ హాని జరగదు. కానీ క్రీడలు ఏ మతానికీ వ్యతిరేకంగా ఉండకూడదు. క్రికెట్‌లో పోటీ అనేది క్రీడల స్థాయిని బట్టి ఉండాలి తప్ప మతం ఆధారంగా కాదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)