విండోస్-11; మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ప్రత్యేకతలేంటి...

ఫొటో సోర్స్, Microsoft
- రచయిత, జో క్లీన్‌మన్
- హోదా, టెక్నాలజీ ప్రతినిధి
మైక్రోసాఫ్ట్ సంస్థ 'నవతరం' ఆపరేటింగ్ సిస్టమ్ 'విండోస్-11' విడుదల చేసింది. వర్చ్యువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది.
ఈ కొత్త సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా విండోస్ డెస్క్‌టాప్‌పై అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు పని చేస్తాయి.
విండోస్ యూజర్లు సాధారణంగా ఫిర్యాదు చేసే సెక్యూరిటీ అప్‌డేట్‌లతో కూడిన సమస్యలు విండోస్ -11లో ఉండవని ప్రాడక్ట్ మేనేజర్ పానోస్ పనయ్ హామీ ఇచ్చారు. ఇందులో అప్‌డేట్‌లు సంక్షిప్తంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ లో వేగంగా జరుగుతాయని చెప్పారు.
యూజర్లు విండోస్-11ను ఇంట్లో, పని స్థలాల్లో ఉండే పలు డెస్క్‌టాప్‌లకు, గేమింగ్ కోసం కూడా కన్ఫిగర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రస్తుతం 130 కోట్ల కంప్యూటర్లు విండోస్-10 ఓఎస్ ఉపయోగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.
యాప్ డెవలపర్ల కోసం విండోస్ కొత్త ప్రివ్యూ వెర్షన్ ను వచ్చే వారం విడుదల చేస్తారు.
ప్రస్తుతం విండోస్-10 ఒరిజినల్ వాడుతున్న వారికి ఈ అప్‌గ్రేడ్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే 64 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి.
ఈ కొత్త విధానంలో స్టార్ట్ బటన్ కంప్యూటర్ ఎడమ వైపు కాకుండా స్క్రీన్ కింద మధ్య భాగంలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Microsoft

ఫొటో సోర్స్, Microsoft

ఫొటో సోర్స్, Microsoft
దీంతో పాటు, మైక్రో సాఫ్ట్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ టీమ్స్‌తో కూడా విండోస్-11 చాలా సమన్వయంతో పని చేస్తుంది.
కొన్ని వందల గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించే ఎక్స్ బాక్స్ గేమ్స్ పాస్ కూడా ఈ వెర్షన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేస్తారు. యాప్ స్టోర్ ద్వారా వచ్చే లాభాలను యాప్ సృష్టికర్తలు, డెవలపర్లతో పంచుకుంటామని టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ చెప్పింది.
అయితే, పోటీ సంస్థ అయిన ఆపిల్ ఇప్పటికీ యాప్ తయారీదారులతో లావాదేవీల విషయంలో సవాళ్లు ఎదుర్కొంటోంది.
2015లో మైక్రోసాఫ్ట్ విండోస్-10 విడుదల చేసినప్పుడు, తమ సంస్థ విడుదల చేసే తుది వెర్షన్ ఇదే అని ప్రకటించింది. 2025లో విండోస్-10 రిటైర్ అవుతుందని కూడా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Microsoft
ఈ ఆవిష్కరణ "విండోస్ చరిత్రలోనే పెద్ద మైలు రాయి" అని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అభివర్ణించారు.
అయితే, దీనినొక విప్లవాత్మకమైన ముందడుగుగా పరిగణించటం లేదని, సిసిఎస్ విశ్లేషకుడు జోఫ్ బ్లేబర్ అన్నారు.
"విండోస్ 10 నుంచి 11 శ్రేణికి పెంచడం ద్వారా విండోస్ 10లో ఎదురైన సమస్యలను నివారించి యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందివ్వాలని మైక్రోసాఫ్ట్ హామీ ఇవ్వాలని చూస్తోంది.
ఈ కొత్త ఆపరేటింగ్ విధానం విండోస్ 10 కోడ్ ఆధారంగానే పని చేయడం వల్ల అప్‌గ్రేడ్ చేయడం వల్ల వచ్చే సమస్యలేమీ ఉండవని ఫారెస్టర్స్ ప్రిన్సిపల్ అనలిస్ట్ జేపీ గౌండర్ అన్నారు. గతంలో విండోస్ విస్టాతో సమస్యలు ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు.
"కానీ, యూజర్లకు స్నేహపూర్వకంగా ఉన్న ఈ ఫీచర్లు రెండు వైపులా పదనైన కత్తిలాంటివే " అని అన్నారు.
"గత అనుభవానికి గొప్ప కొనసాగింపుగా అవి ఉపకరిస్తాయి. కానీ, విండోస్-11 ప్రత్యేకత ఏంటనే ప్రశ్నను కూడా ముందుకు తెస్తాయి. విండోస్-10ను కొత్త ఫీచర్లతో ముస్తాబు చేశారా? లేక మైక్రోసాఫ్ట్ పూర్తిగా కొత్త అనుభవాన్ని అందించిందా?" అన్నది స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న మియన్మార్ ఆర్మీ జనరల్స్
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- మియన్మార్‌లో ‘సరోంగ్ విప్లవం’: మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- కరోనావైరస్ మృతుల విషయంలో ఇరాన్ ఎందుకు వాస్తవాలను దాచి పెడుతోంది...
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








