అమెరికా: జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి 100 రోజులు... ఇవే ఆయన ప్రకటించిన భారీ ప్రణాళికలు

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ స్వీకారం చేసిన 100 రోజుల తర్వాత బుధవారం రాత్రి కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు.
ఈ ప్రసంగంలో బైడెన్ అమెరికాలో ఉద్యోగాల కల్పన, విద్య, సాంఘిక భద్రత కోసం తమ ప్రభుత్వం సంకల్పించిన పెట్టుబడుల ప్రణాళికలను ముందుంచారు. ఈ పెట్టుబడుల ప్రణాళిక భారీ స్థాయిలో ఉంది.
డెమొక్రాట్ ప్రభుత్వం ఈ రంగాలలో పెట్టుబడుల కోసం సుమారు 4 ట్రిలియన్ డాలర్లను కేటాయించనున్నట్లు చెప్పారు. 1960 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇది భారీగా రచించిన ప్రణాళిక అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ప్రణాళికలను ఉద్దేశిస్తూ "ఇది అమెరికాలో ఈ తరానికి ఒకేసారి పెట్టే పెట్టుబడి" అని బైడెన్ అభివర్ణించారు.
అయితే, ఈ ప్రణాళికలు చట్ట రూపం దాల్చడానికి ఉభయసభల్లో పోరును ఎదుర్కోవలసి ఉంటుంది.
బైడెన్ చేసిన ప్రతిపాదనలకు రిపబ్లికన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి.
ఈ పెట్టుబడుల కోసం బైడెన్ ప్రతిపాదించిన పన్నుల పెంపకం, ప్రభుత్వ ఖర్చులను రిపబ్లికన్లు సమర్ధించకపోవచ్చు.
అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ డెమొక్రాట్లకు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది.
సొంత పార్టీలో కూడా ఈ ప్రతిపాదనలతో ముందుకు వెళ్లే విషయం పై అభిప్రాయబేధాలు ఉన్నాయి.
అమెరికా కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారి అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ , ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ వెనకనే కూర్చున్నారు.
ఆయన ప్రసంగం ప్రారంభంలో మేడం వైస్ ప్రెసిడెంట్ అని సంబోధిస్తూ " ఈ పోడియం మీద నుంచి ఏ అమెరికా అధ్యక్షుడూ ఇలా సంబోధించలేదు. ఇప్పుడు పిలవాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ ప్రతిపాదనలేమిటి?
అమెరికాలో ఉద్యోగాల కల్పనకు, కుటుంబ సంక్షేమం కోసం ప్రణాళికలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు పెట్టుబడులు కార్పొరేషన్లు, సంపన్నుల ఆదాయం పై పెంచిన పన్నుల ద్వారా లభిస్తాయని వైట్ హౌస్ పేర్కొంది.
"అమెరికాలో కార్పొరేట్లు, 1 శాతం ఉన్న సంపన్నులు తమ వాటాను చెల్లించాల్సిన సమయం వచ్చింది" అని బైడెన్ అన్నారు.
అమెరికాలో ఉద్యోగ కల్పన ప్రణాళిక గురించి మాట్లాడుతూ "ఇది అమెరికాను నిర్మించడానికి బ్లూ కాలర్ బ్లూ ప్రింట్" అని అన్నారు.
దీని ద్వారా ప్రజా రవాణా రంగంలో, హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్, రోడ్లు ,బ్రిడ్జిల నిర్మాణానికి పెట్టుబడులను పెంచవచ్చని అన్నారు.
పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి అనుగుణంగానే ఈ ప్రణాళిక ఉంటుందని ఆయన అన్నారు.
"నేను పర్యావరణ మార్పుల గురించి ఆలోచించేటప్పుడు ఉద్యోగాల గురించి కూడా ఆలోచిస్తాను" అని అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ఉత్పత్తిలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని ఆయన అన్నారు.
కుటుంబ సంక్షేమం కోసం ప్రతిపాదించిన 1. 8 ట్రిలియన్ డాలర్ల ప్రణాళిక పిల్లల సంక్షేమం పై దృష్టి పెడుతుంది అని చెప్పారు.
ఈ ప్రణాళిక ద్వారా పిల్లలకు
3 - 4 సంవత్సరాల పిల్లలకు ఉచిత ప్రీ స్కూల్ విద్య
ఫ్యామిలీ, మెడికల్ లీవ్ తో పాటు ఆరోగ్య బీమా పథకాలు
ట్యూషన్ ఫీ లేకుండా అందరికీ కమ్యూనిటీ కాలేజీలు
మహమ్మారిలో ప్రకటించిన పన్ను మినహాయింపుల పొడిగింపు
గత నెలలో బైడెన్ కరోనావైరస్ ప్యాకేజి కోసం కేటాయించిన 1.9 ట్రిలియన్ డాలర్ల అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పై సంతకం చేశారు. ఇందులో భాగంగా చాలా మంది అమెరికా పౌరులకు చెక్కుల ద్వారా నిధులు ఇస్తారు.
21వ శతాబ్ధాన్ని గెలవడానికి అమెరికా చైనాతోనూ మరి కొన్ని ఇతర దేశాలతోనూ పోటీ పడుతోందని అంటూ అమెరికా విదేశాంగ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇరు పార్టీల రాజకీయ నాయకులనూ ఆయన చేసిన ప్రతిపాదనలకు మద్దతిమ్మని కోరారు.

ఆంథోని జర్కర్
నార్త్ అమెరికా ప్రతినిధి విశ్లేషణ
బైడెన్ బుధవారం చేసిన ప్రసంగం ఆయన సాధించిన విజయం గురించి మాట్లాడటంతో మొదలయి, ఒక హెచ్చరికతో ముగిసింది.
అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించగల్గుతున్నామని చెబుతూ మరి కొన్ని నెలల్లోనే సాధారణ స్థితి నెలకొంటుందని చెప్పారు.
ఆయన పదవిని చేపట్టిన తొలి 100 రోజుల్లోనే కొన్ని వేల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు, ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు స్వీయ ప్రశంస చేసుకున్నారు.
ఇటీవల విడుదల చేసిన నిధులు వల్ల అమెరికాలో పిల్లల్లో కరువును సగానికి తగ్గిస్తుందని కూడా అన్నారు
ఆయన ఈ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ మరింత ఖర్చును ఆమోదించడానికి, మరిన్ని చర్యలు తీసుకునేందుకు పిచ్ చేస్తున్నారు.
ఆయన సార్వత్రిక ప్రీ కిండర్ గార్డెన్ విద్యకు, రెండు సంవత్సరాల ఉచిత కాలేజీ విద్యకు, కుటుంబ లీవ్, పిల్లల సంరక్షణ కోసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. తుపాకీల వాడకాన్ని చట్టబద్ధం చేసేందుకు, ఇమ్మిగ్రేషన్, క్రిమినల్ జస్టిస్ సంస్కరణలు, వోటింగ్ హక్కుల కోసం చట్టాలు తేవాలని పిలుపునిచ్చారు.
ఆయన ప్రపంచంలో నియంతృత్వ దేశాల నుంచి ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పు గురించి చెబుతూ జనవరి 06న అమెరికా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడిని గుర్తు చేశారు.
ఆయన ప్రతిపాదనలకు సత్వరమే ఆమోదం సంపాదించాలనే తొందర ఆయన ప్రసంగం ముగింపులో ధ్వనించింది.

ఫొటో సోర్స్, EPA
రిపబ్లికన్లు ఎలా స్పందించారు?
"బైడెన్ తొలి 100 రోజుల పాలన వైఫల్యాలతో కూడుకుని , ఆయన పార్టీలో పక్షపాత ధోరణి విపరీతంగా ఉంది" అని రిపబ్లికన్ నేషనల్ కమిటీ చెయిర్ వుమన్ రోనా మెక్ డానియెల్ అన్నారు.
"ఆయన ప్రసంగంలో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ అదొక అబద్ధం. దేశం కూడా బైడెన్ పాలనతో బాగా విభజితమైపోయి ఉంది" అని ఆమె ప్రకటన చేశారు.
ఈ ప్రసంగం అంతా ఒక ఈ మెయిల్ లో కూడా చెప్పవచ్చు" అని రిపబ్లిక్ పార్టీ సభ్యురాలు కెవిన్ మెక్ కార్థి ట్వీట్ చేసారు.
బైడెన్ చేసిన ప్రతిపాదనలు సగటు అమెరికా కార్మికుని వేతనాలను తగ్గించేస్తాయని, ఇవన్నీ ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులని సెనేటర్ టిమ్ స్కాట్ అన్నారు.
"అమెరికా జాత్యహంకార దేశం కాదు. వివక్షను వివిధ రకాల వివక్షలతో కలిసి పోరాడటం వెనుకబాటుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఉన్న వాదనలను అణిచివేయడానికి గాయాలతో కూడిన గత చరిత్రను వాడటం సరైన పద్ధతి కాదు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








