రీజెంట్ హనీఈటర్: అంతరించిపోయే దశలో ఉన్న ఈ పిట్ట.. ‘తన పాట మరచిపోయింది’

ఫొటో సోర్స్, David Stowe
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి పక్షులు ప్రస్తుతం కేవలం 300 మాత్రమే ఉన్నట్లు అంచనా.
"ఇవి తమ తోటి హనీఈటర్లతో కలిసి తిరిగే అవకాశం లేకుండో పోతోంది. అందువల్ల అవి తమ జాతి లాగా ఎలా పాడాలో నేర్చుకునే అవకాశం దొరకటం లేదు" అని డాక్టర్ రాస్ క్రేట్స్ వివరించారు.
ఆయన పేర్కొన్న వివరాలను యూకే రాయల్ సొసైటీ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు. ఆయన కాన్‌బెర్రా లోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో డిఫికల్ట్ బర్డ్ రీసెర్చ్ గ్రూపులో సభ్యుడు.
ఈ పాడే పక్షి గీతాన్ని సంరక్షించేందుకు డాక్టర్ రాస్ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పక్షులను బంధించి పట్టుకుని వాటి బంధువులు పాడిన పాటలను వాటికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, LACHLAN L. HALL
గడ్డివాములో సూదిని వెదికినట్టు...
ఈ పరిశోధకులు ఇప్పుడు కొత్తగా ఆ పక్షి పాటను అన్వేషించాలని బయలుదేరలేదు. ఆ పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలని వారు చూస్తున్నారు.
"ఇవి చాలా అరుదైన పక్షులు. యూకే విస్తీర్ణంలో సుమారు 10 రెట్లకు పైగా ఉండే స్థలంలో ఇవి విస్తరించి ఉంటాయి. దీనినిబట్టి వాటి కోసం వెదకటం.. గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే" అంటారు డాక్టర్ రాస్.
అయితే, వీటిని వెతికే క్రమంలో ఆయన కొన్ని విచిత్రమైన పాటలు పాడుతున్న మరి కొన్ని పక్షులను కనుగొన్నారు.
"అవేమి రీజెంట్ హనీఈటర్‌లా పాడటం లేదు. అవి వేరే జాతికి చెందినవని అర్ధమవుతోంది. మనుషులు ఒకరి నుంచి ఒకరు మాట్లాడటం నేర్చుకున్నట్లే పాటలు పాడే పక్షులు కూడా పాట పాడే విధానాన్ని నేర్చుకుంటాయి" అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, MICK RODERICK
"పక్షులు పెరిగి పెద్దయ్యాక వాటి గూడును వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పుడు అవి వయసులో ఉన్న మగ పక్షులతో కలవడం అవసరం. అలా జరగడం వలన అవి ఎలా పాడుతున్నాయో విని ఆ పాటను తిరిగి పాడటం మొదలు పెడతాయి" అని వివరించారు.
"రీజెంట్ హనీఈటర్ 90 శాతం జీవావరణాన్ని కోల్పోయింది. దీనివల్ల చిన్న మగ పక్షులు మిగిలిన పక్షులకు తారసపడి అవి పాడే పాటలు వినే అవకాశం ఉండటం లేదు. దీంతో, అవి వేరే పక్షుల పాటలు వినాల్సి వస్తోంది" అని డాక్టర్ రాస్ తెలిపారు.
రీజెంట్ హనీఈటర్ల జనాభాలో 12 శాతం సహజమైన పాట మాయమైపోయిందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పాటను సంరక్షించాలనే ఆశతో శాస్త్రవేత్తలు ఆ పక్షుల పాటలను రికార్డు చేసి హనీఈటర్లకు వినిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Murray Chambers
వీటి జనాభాను పెంచేందుకు ఇలా బంధించిన రీజెంట్ హనీఈటర్‌లలో కొన్నిటిని ప్రతి ఏటా తిరిగి అడవిలో వదిలిపెట్టే ప్రాజెక్టు నడుస్తోంది.
"కానీ, ఆ మగ పక్షులు మరో రకమైన విచిత్రమైన పాటను పాడితే మాత్రం ఆడ పక్షులు వాటితో కలవడానికి రావు" అని డాక్టర్ రాస్ చెప్పారు.
"అవి పాడాల్సిన పాటను వింటే, వాటంతట అవే వాటి పాటను పాడటం నేర్చుకుంటాయని ఆశిస్తున్నాం" అన్నారాయన.
"ఏవైనా జీవ జాతులను సంరక్షించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి అడవిలో బ్రతికి మనుగడ సాగించేందుకు కొన్ని పక్షులకు సహజంగా ఉండే పాట పాడటం లాంటి సాంస్కృతిక లక్షణాలు, జంతువులకుండే కొన్ని సహజ ప్రవర్తనల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వూహాన్లో కోవిడ్-19 విజృంభణకు ఏడాది: కరోనావైరస్పై చైనా విజయం సాధించిందా? లేక నిజాలను దాచిపెడుతోందా?
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









