నార్తర్న్ కార్డినల్: ఆడ, మగ రెండు లక్షణాలూ ఉన్న పక్షి

ఫొటో సోర్స్, JAMIE HILL
పెన్సిల్వేనియాకు చెందిన ఒక పక్షుల ఫోటోగ్రాఫర్ ఆడ, మగ లక్షణాలు రెండూ ఉన్న ఒక పక్షిని గుర్తించారు. ఆ పక్షిపేరు నార్తర్న్ కార్డినల్. ఇలాంటి పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయి.
"వీటిలో మగ కార్డినల్ పక్షులు ముదురు ఎరుపు రంగులో ఉండగా ఆడ పక్షులు లేత గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇలా ఆడామగా రెండు లక్షణాలున్న పక్షులు కనిపించడం జీవితంలో అరుదుగా కలిగే అనుభవం" అని రిటైర్డ్ పక్షి శాస్త్రవేత్త జేమీ హిల్ చెప్పారు.
మొదట్లో ఆయన పక్షి ఈకల్లో ఏర్పడిన పిగ్మెంటేషన్ వలన అలా అయిందేమోనని భావించారు. కానీ. మొబైల్ ఫోనులో తీసిన ఫోటోలను చూసిన తర్వాత ఇది గ్యాన్డ్రోమోర్ఫిజం అనే లక్షణం అని నిర్ధరించారు. అలాంటప్పుడే పక్షికి అండాశయాలు, వృషణాలు కూడా ఉంటాయి. ఈ భాగాలు పని చేస్తాయి కూడా.

ఫొటో సోర్స్, jamie hill
ఆ కార్డినల్ పక్షి కనిపించిన ఇంటికి ఆయన వెళ్లారు. ఆ విచిత్రమైన పక్షిని ఆయన వెళ్లిన ఒక గంటలోనే చిత్రీకరించగలిగారు.
"నేను ఆ చిత్రాలను తీసిన తర్వాత నా గుండె మరో అయిదు గంటల పాటు వేగంగా కొట్టుకుంటూనే ఉంది. నేను ఇంటికి తిరిగి వచ్చి ఆ ఫోటోలన్నిటినీ చూసేవరకు అదే స్థితి కొనసాగింది" అని హిల్ వివరించారు.
నేను రెండు దశాబ్దాల నుంచి అంతరించిపోయిన ఐవరీ బిల్డ్ ఉడ్‌పెకర్ కోసం వెతుకుతున్నాను. చాలా సాధారణంగా ఇంటి వెనకాల కనిపించే ఈ పక్షిని చిత్రీకరించడం నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. అది చూస్తున్నప్పుడు నాకు ఉడ్‌పెకర్ దొరికినట్లు అనిపించింది" అని చెప్పారు.
ఆడ, మగ లక్షణాలతో ఉండే పక్షులు ఉండటం చాలా అరుదైన విషయం అని వెస్ట్రన్ ఇల్లినోయి యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రెయిన్ పీర్ చెప్పారు. ఆయన అమెరికాలో నార్తర్న్ కార్డినల్స్‌లో ఉండే ఉభయ లింగత్వం గురించి సర్వే చేశారు. అయితే, ఈ విషయం చాలా పక్షుల్లో గుర్తించడం కూడా జరగదు" అని ఆయన అన్నారు.
కణాల విభజన జరిగినప్పుడు చోటు చేసుకునే పొరపాటు వలన ఈ పరిణామం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, jamie hill
"ఒక అండం దానితో కలిసి ఉండే పోలార్ శరీరం వేరే వీర్యంతో ఫలదీకరణం చెందుతాయి. అలా పుట్టినప్పుడు స్త్రీ పురుష లక్షణాలతో జన్మిస్తారు" అని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఇలా కనిపించిన పక్షి ఇది మొదటిది కాదని ఆయన అన్నారు.
ఇలాంటి పక్షిని 2019లో ఒక జంట కనిపెట్టారు అని నేషనల్ జియోగ్రఫిక్ చానల్ తెలిపింది. అదే కార్డినల్ పక్షి తిరిగి కనిపించిందేమో అని హిల్ అన్నారు.
ఉత్తర అమెరికాలో నార్తర్న్ కార్డినల్స్ చాలా సాధారణ ఫీడర్ పక్షులని ప్రొఫెసర్ పీర్ చెప్పారు. ఆడ, మగ పక్షులు చూడడానికి భిన్నంగా ఉండటం వలన గ్యాన్డ్రోమోర్ఫ్ రకాన్ని కనిపెట్టడం చాలా సులభమైన పని అని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: ఉద్యమం నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








