అండర్‌టేకర్.. ‘ద డెడ్ మ్యాన్’ మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టరా

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకోవట్లేదు. అని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ ద అండర్‌టేకర్ ప్రకటించిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.
"ఇక సాధించాల్సింది అంటూ ఏమీలేదు"అని ఓ డాక్యుమెంటరీలో ఇటీవల ఆయన చెప్పారు. 52ఏళ్ల అండర్‌టేకర్ అసలు పేరు మార్క్ క్యాలవే.
మూడు దశాబ్దాలనాటి ప్రస్థానాన్ని ఆయన ముగించబోతున్నట్లు ఆయన మాటలు సంకేతాలు ఇస్తున్నాయి.
అయితే, ఇటు క్యాలవే.. అటు డబ్ల్యూడబ్ల్యూఈ దీనిపై అధికారిక ప్రకటనేమీ చేయలేదు.
డబ్ల్యూడబ్ల్యూఈ విడుదల చేసిన అండర్‌టేకర్ బయోపిక్ "ద లాస్ట్ రైడ్"లో ఆయన ఇటీవల మాట్లాడారు. "ద డెడ్ మ్యాన్" పేరుతో ఆయన అందరికీ సుపరిచితుడు.
రెజ్లర్ ఏజే స్టైల్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్ గురించీ ఆయన మాట్లాడారు. ఈ మ్యాచ్ చివర్లో స్టైల్స్‌ను పాతిపెట్టి, మోటర్ సైకిల్‌పై అండర్‌టేకర్ వెళ్లిపోయారు.
"ఇది చాలా మంచి సమయం. ఇలాంటిది మళ్లీ రాదు. నా కెరియర్‌కు ముగింపు పలకడానికి ఏదైనా మంచి సమయం ఉందంటే.. అది ఇదే" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కౌబాయ్ వెళ్లిపోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన వివరించారు. రింగ్‌లో కంటే బయటే మంచి పనులు చేయగలను అనిపిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి నేడు వచ్చాను.
మరోవైపు ఒక చివరి మ్యాచ్ ఆడే విషయాన్ని పరిశీలిస్తున్నానని ఆయన అన్నారు. అయితే అది ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుందని వివరించారు.
ఆయన చాలాసార్లు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ గెలిచారు. ఆరుసార్లు ట్యాగ్‌టీం టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఒకసారి రాయల్ రంబుల్ కూడా గెలిచారు.
1987లో వరల్డ్ క్లాస్ ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్‌తో ఆయన ప్రస్థానం మొదలైంది. 1990ల్లో టెడ్ డిబియాస్ మిలియన్ డాలర్ టీంలో చివరి సభ్యుడిగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆయన అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
డబ్ల్యూడబ్ల్యూఈ మార్గనిర్దేశకుల్లో ఆయన ఒకరు. 1992లో సర్వైవర్ సిరీస్‌లోని తొలి కాస్కెట్ మ్యాచ్ ఆయనతోనే మొదలైంది. 1996లో తొలి బరీడ్ అలైవ్ మ్యాచ్ ఆడిందీ ఆయనే. 1997లో తొలి హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌నూ ఆయనే ఆడారు.
విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటికీ.. జాన్ సీనా, ద రాక్ తరహాలో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టలేదు.
సినిమాల్లోకి వెళ్లేందుకు తనకు అవకాశాలు వచ్చాయని.. కానీ తనే వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన బీబీసీతో చెప్పారు.
"అది నాకు సరిపడదు." అని క్యాలవే అన్నారు. "రెజ్లింగ్, డబ్ల్యూడబ్ల్యూఈ అంటే నాకు ప్రాణం. నా పూర్తి సామర్థ్యాన్ని దీనికే కేటాయించాను. నా మనసు కూడా ఇక్కడే ఉంది."
"నువ్వు చివరి వరకు చేరుకున్న తర్వాతే రోడ్డు ఎంత పొడవుందో తెలుస్తుంది." అంటూ ఆదివారంనాడు ద లాస్ట్ రైడ్‌లోని ఓ దృశ్యాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
ఆయన ట్వీట్ అనంతరం సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా మెసేజ్‌లు వెల్లువెత్తాయి. థ్యాంక్యూటేకర్ హ్యాష్‌ట్యాగ్ వైరల్ అయ్యింది. తనతో జరిగిన మ్యాచ్చే అండర్‌టేకర్‌కు చివరిదైతే తనకెంతో గర్వంగా ఉంటుందని ఏజే స్టైల్స్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"మా బాల్యాన్ని సంతోషంగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు" అంటూ రింగ్ అనౌన్సర్ మైక్ రోమ్ కూడా వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆయన పదవీ విరమణ గురించి ఇదివరకు కూడా ఊహాగానాలు వినిపించాయి. 2017లో రోమన్ రైన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం తన గ్లోవ్స్, టోపీ, కోట్‌లను రింగ్ మధ్యలో వదిలేసి అండర్‌టేకర్ నడుచుకుంటూ వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగం ఇతనికి ఎలా సాధ్యమైంది?
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- 'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








