శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?

ఫొటో సోర్స్, ANNU PAI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ భవన నిర్మాణ కార్మికుడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో ఇప్పుడు ఆయన్ను అందరూ పోల్చుతున్నారు.
దక్షిణ కర్నాటకలో ఏటా కంబళ అనే పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తారు. దున్నలతో పాటు వాటిని తోలుతూ మనుషులు కూడా పరుగెత్తుతారు.
ఇటీవల ఓ కంబళ పోటీలో 142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తినట్లు కొన్ని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
100 మీటర్ల పరుగును పూర్తి చేసేందుకు బోల్ట్‌కు పట్టిన సమయం 9.58 సెకన్లు. ప్రస్తుతం ఇదే ప్రపంచ రికార్డు.


దీంతో, శ్రీనివాస గౌడ ప్రదర్శనను బోల్ట్ రికార్డుతో పోల్చుతూ చాలా దినపత్రికలు కథనాలు రాశాయి. చాలా మంది సోషల్ మీడియాలోనూ ఈ తరహా పోస్ట్‌లు పెట్టారు.
కంబళను నిర్వహించే సంస్థ మాత్రం ఈ పోలిక పెట్టొద్దని అంటోంది.
''మేం ఎలాంటి పోలికలకూ పోదల్చుకోలేదు. ఒలింపిక్స్‌లో వేగం కొలిచేందుకు మెరుగైన సాంకేతికత, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతారు'' అని కంబళ అకాడమీ ప్రొఫెసర్ కే.గుణపాల కాదంబ బీబీసీతో చెప్పారు.
ఒక చేత్తో దున్నపోతుల్ని కట్టేసిన తాడును పట్టుకుని, మరొక చేత్తో దున్నల్ని మలేసే కర్ర పట్టుకుని.. దున్నల్ని తోలేవాళ్లు ఈ పోటీలో పాల్గొంటారు. కొందరు దున్నపోతులతో పాటు పరుగెత్తితే, మరికొందరు వాటికి కట్టిన కర్ర పీటపై నిలబడతారు.
శ్రీనివాస గౌడ మాత్రం తాడు, కర్ర పట్టుకుని దున్నలతో పరుగెత్తాడు.
దున్నల వేగం వాటి తాడును పట్టుకుని పరుగెత్తే మనిషికి అదనపు వేగాన్ని ఇస్తుందని కొందరు అంటున్నారు.
అయితే, ఉసేన్ బోల్ట్ లాంటి అథ్లెట్‌లు ఒలింపిక్ స్టేడియంల్లో మన్నికైన ట్రాక్‌లపైన పరుగెత్తితే.. శ్రీనివాస గౌడ బురద, నీళ్లలో పరుగెత్తాడని ఇంకొందరు సమర్థిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
శ్రీనివాస గౌడది దక్షిణ కర్నాటకలోని మూడబిద్రి జిల్లా.
కంబళలో ఆయన టైమింగ్ కొత్త రికార్డే. తన ప్రదర్శన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తన జట్టులోని దున్నపోతులు చాలా మెరుగైన ప్రదర్శన చేశాయంటూ వాటిని ప్రశంసించారు.
తాను ఏడేళ్లుగా కంబళలో పాల్గొంటున్నట్లు శ్రీనివాస గౌడ బీబీసీతో చెప్పారు.
''స్కూల్లో ఉన్నప్పటి నుంచి కంబళ పోటీలు చూస్తేండేవాడ్ని. అలా నాకు దీని మీద ఆసక్తి పెరిగింది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
కంబళ అంటే..
కంబళ అంటే తుళు బాషలో 'వరి మడి' అని అర్థం వస్తుంది.
ఈ క్రీడ కర్నాటక కోస్తా ప్రాంతంలో పుట్టింది.
జోడు దున్నపోతులను పోటీదారులు 132 మీటర్లు లేదా 142 మీటర్ల దూరం బురదతో ఉండే మడిలో పరుగెత్తించాల్సి ఉంటుంది.
ఇది వివాదాస్పదమైన క్రీడే. గతంలో దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. జంతు హక్కుల పరిరక్షణ సంస్థలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాయి.
తమిళనాడులో జరిగే జల్లికట్టు క్రీడకు వ్యతిరేకత రావడంతో 2014లో భారత సుప్రీం కోర్టు ఎడ్ల పందేలపై నిషేధం విధించింది.
రెండేళ్ల తర్వాత కంబళ పోటీలను నిలుపుదల చేయాలంటూ కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కంబళ క్రీడ పశువుల పట్ల క్రూరంగా లేకుండా తాము మార్పులు చేశామని ప్రొఫెసర్ కాదంబ చెప్పారు.
''జంతువును అనవసరంగా హింసించకుండా ఎలా వ్యవహరించాలో శ్రీనివాస గౌడ లాంటి విద్యార్థులందరూ నేర్చుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.
2018లో కంబళ పోటీల నిర్వహణకు కర్నాటక మళ్లీ అనుమతులు ఇచ్చింది. అయితే, కొరడాల వాడకంపై నిషేధం విధించడంతో పాటు కొన్ని షరతులను కూడా పెట్టింది.
కంబళను తిరిగి అనుమతించడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ జీవ కారుణ్య సంస్థ పెటా వేసిన ఓ పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.
అయితే, దశాబ్దాల కిందటి సంప్రదాయ కంబళ పోటీలకు, ఇప్పుడు జరుగుతున్న పోటీలకు చాలా తేడా ఉందని ప్రొఫెసర్ కాదంబ అంటున్నారు.

ఇవి కూడా చదవండి.
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమరావతి అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









