'గ్రహాంతర వాసుల అన్వేషణను మరింత సీరియస్‌గా తీసుకోవాలి.. ప్రభుత్వాలు భారీగా నిధులివ్వాలి'

ఫొటో సోర్స్, BWFolsom
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, సైన్స్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్
విశ్వంలోని ఇతర ప్రాంతాల్లో మేధస్సు గల జీవాన్వేషణ పరిశోధనను మరింత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని వర్జీనియాలోని అమెరికా జాతీయ నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, చార్లట్స్‌విల్ డైరెక్టర్ డాక్టర్ ఆంథొనీ బీస్లీ పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ పరిశోధన నిధులు విస్మరించిన ఈ రంగానికి ప్రభుత్వ మద్దతు మరింత ఎక్కువగా ఉండాలని ఆయన బీబీసీతో చెప్పారు.
ఇటీవలి కాలం వరకూ పెద్దగా పట్టించుకోని సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (సెటి)కి మద్దతుగా ఆయన మాట్లాడటం.. ఈ రంగంలో భారీ మార్పుకు నాందిగా భావించవచ్చు.


సియాటిల్‌లో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ సమావేశంలో డాక్టర్ బీస్లీ మాట్లాడుతూ.. ''సెటీని అటక మీద నుంచి దించి.. అంతరిక్ష పరిశోధనలోని అన్ని రంగాల్లోనూ మమేకం చేయాల్సిన సమయం వచ్చింది'' అని పేర్కొన్నారు.
ఇతర గ్రహాల్లో మేధో జీవం సంకేతాలను అన్వేషించే కృషిలో న్యూ మెక్సికోలోని వెరీ లార్జ్ అరే (వీఎల్‌ఏ) అబ్జర్వేటరీ చేరుతున్నట్లు సెటి ప్రైవేటు రంగ పెట్టుబడిదారులు ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ బిస్లీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచంలో అత్యుత్తమ టెలిస్కోపుల్లో ఒకటిగా పరిగణించే టెలిస్కోప్ వీఎల్ఏ అబ్జర్వేటరీలో ఉంది.

ఫొటో సోర్స్, ALLEN OBSERVATORY
వీఎల్ఏ స్థాపనతో విశ్వంలో మేధో జీవాన్ని కనుగొనే అవకాశాలు ''పది రెట్ల నుంచి 100 రెట్ల వరకూ పెరుగుతాయ''ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలోని సెటి రీసెర్చ్ సెంటర్‌లో బ్రేక్‌త్రూ లిజన్ సైన్స్ టీమ్ సారథి డాక్టర్ ఆండ్రూ సీమన్ చెప్పారు.
''సెటి కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఓ చిన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి పరిమితం కావటం నుంచి.. ఖగోళశాస్త్రం, ఖగోళభౌతికశాస్త్రం తదితర అన్ని రంగాలలో అంతర్భాగంగా మారాలన్నది మా ఆకాంక్ష'' అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
విశ్వమంతటా మేధస్సుతో కూడిన గ్రహాంతరజీవి సమాచార సంబంధాలను వెదకటానికి ప్రైవేటు నిధులతో చేపట్టిన ప్రాజెక్ట్ 'బ్రేక్‌త్రూ లిజన్'. ఈ పదేళ్ల ప్రాజెక్టు 2016లో మొదలైంది. దీనికి బిలియనీర్ యూరీ మిల్నర్ 10 కోట్ల డాలర్ల నిధులు (సుమారు రూ. 700 కోట్లు) సమకూర్చారు.
ఈ సంస్థ అంతర్జాతీయ సలహా బృందానికి.. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రానమర్ రాయల్ ప్రొఫెసర్ లార్డ్ రీస్ చైర్మన్‌గా ఉన్నారు.
లక్షల కోట్ల పౌండ్ల వ్యయంతో చేపట్టిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్టు.. ప్రస్తుత భౌతికశాస్త్ర సిద్ధాంతానికి మించి ఉప-అణు కణాలను గుర్తించాలన్న లక్ష్యాన్ని ఇప్పటికీ సాధించలేదని.. ఈ పరిస్థితిలో సెటి కోసం కొన్ని లక్షల పౌండ్లు మాత్రమే నిధులు సమకూర్చే విషయాన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన బీబీసీతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
సఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సెటి అన్వేషణలు అవసరమైనవనటంలో సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, stocksnapper
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒకప్పుడు గ్రహాంతర జీవుల కోసం ఏడాదికి 10 మిలియన్ డాలర్ల చొప్పున నిధులు కేటాయించింది. అయితే.. అది వృధా ఖర్చు అని భావించిన సెనెటర్ రిచర్డ్ బ్రియాన్ 1993లో ఒక చట్టం ప్రవేశపెట్టటంతో ఆ నిధులు రద్దు చేశారు.
''ప్రజా ధనంతో అంగారకగ్రహ వాసిని వేటాడే క్రీడకు ఇది ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నా'' అని ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు.
అప్పటి నుంచీ.. ఇతర గ్రహాల వాతావరణాల్లోని రసాయన నమూనాల్లో సరళ జీవాలకు సంబంధించిన ఆధారాల కోసం ఖగోళజీవశాస్త్ర అన్వేషణలకు మద్దతు పెరుగుతోంది. కానీ.. అమెరికాలో కానీ, ప్రపంచంలో మరెక్కడైనా కానీ సెటి కోసం ప్రభుత్వాలు గణనీయంగా నిధులు కేటాయించలేదు.
ఆ సమయంలో సుదూర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న కొన్ని గ్రహాలను తొలుత కనిపెట్టారు. ఇప్పుడు అలాంటి గ్రహాలు దాదాపు 4,000 వరకూ ఉన్నాయన్న విషయం మనకు తెలుసు.
ఈ పరిణామం వల్ల.. ఇతర గ్రహాల్లో మేధో జీవాన్వేషణను శాస్త్రవేత్తలు మరింత సీరియస్‌గా పట్టించుకునేలా చేసిందని డాక్టర్ సీమన్ పేర్కొన్నారు.
''మానవులు రాత్రివేళ ఆకాశంలోకి చూసి 'అక్కడెవరైనా ఉన్నారా?' అని ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగల సామర్థ్యం మనకు ఉంది. ఇది బహుశా మానవాళి చరిత్రలో అత్యంత అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణల్లో అతిపెద్ద ఆవిష్కరణగా నిలవవచ్చునేమో'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
- ఐర్లండ్ తీరంలో యూఎఫ్ఓలు: విమానాలపైకి ‘చాలా ప్రకాశవంతమైన వెలుగు’
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమరావతి అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది
- భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
- అంటార్కిటికాలో 20.75 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రతలు
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









