అంటార్కిటికాలో 20.75 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రతలు

అంటార్కిటికాలో పెంగ్విన్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు దగ్గరగా ఉన్నాయి. అదే సమయంలో సాధారణంగా మైనస్ డిగ్రీలు ఉండే మంచు ఖండంలో ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అంటార్కిటికా ఉష్ణోగ్రతలు మొట్టమొదటిసారి 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటాయి.

ఇక్కడ తీరానికి దూరంగా 20.75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పరిశోధకులు చెప్పారు.

"అంటార్కిటికాలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదు" అని బ్రెజిల్ శాస్త్రవేత్త కార్లోస్ షేఫర్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

Presentational grey line
News image
Presentational grey line

ఇది రీడింగ్ మాత్రమే

ఫిబ్రవరి 9న నమోదైన ఈ ఉష్ణోగ్రతల గురించి ఆయన హెచ్చరించారు. కానీ, ఇది ఒక రీడింగ్ మాత్రమే అంటార్కిటికా దీర్ఘకాలిక డేటాలో భాగం కాదు.

అంటార్కిటికా ద్వీపకల్పంలో గత వారం కూడా 18.3 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అంటార్కిటికా

తాజాగా నమోదైన 20.75 రీడింగ్‌ను కూడా ఇదే ఖండానికి చెందిన దీవుల సమూహంలో ఒకటైన సీమోర్ దీవి మానిటరింగ్ స్టేషన్ నుంచి తీసుకున్నారు.

రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ, ఆ రీడింగ్ తమ విస్తృత అధ్యయనంలో భాగం కాదని, దానిని భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేయడానికి ఉపయోగించలేమని శాస్త్రవేత్త షేఫర్ అన్నారు.

"భవిష్యత్తులో వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మేం దీనిని ఉపయోగించలేం. ఇది ఒక డేటా పాయింట్. ఈ ప్రాంతంలో ఏదో భిన్నంగా జరుగుతోంది అనడానికి ఇది ఒక సంకేతం మాత్రమే" అని ఆయన అన్నారు.

అంటార్కిటికా

ఫొటో సోర్స్, WEDDELL SEA EXPEDITION 2019

అంటార్కిటికా ఎంత వేగంగా వేడెక్కుతోంది?

ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎంఓ) వివరాల ప్రకారం అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు గత 50 ఏళ్లలో దాదాపు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. ఆ సమయంలో పశ్చిమ తీరం అంతటా ఉన్న దాదాపు 87 శాతం హిమానీనదాలు తరిగిపోయాయి.

గ్లోబల్ వార్మింగ్ వల్ల గత 12 ఏళ్లుగా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయని అందులో చెప్పారు.

అత్యంత వెచ్చగా ఉన్న జనవరిగా గత నెల అంటార్కిటికాలో కొత్త రికార్డు సృష్టించింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)