నాకు పెళ్లి వద్దు.. అంటార్కిటికా వెళ్తున్నా..
మీనా రాజ్‌పుత్ అనే ఈ మహిళ సంప్రదాయ బ్రిటిష్-ఇండియా కుటుంబానికి చెందినవారు. చాలా మంది భారత అమ్మాయిల్లాగే ఆమె కుటుంబ సభ్యులు.. వంట చేయడం, ఇళ్లు శుభ్రం చేయడం, పెళ్లి చేసుకుని, కుటుంబాన్ని చూసుకోవడం ముఖ్యమనే విధంగానే ఆమెను పెంచారు.
జీవితంలో స్థిరపడటం, పెళ్లి చేసుకోవడం కంటే పర్యావరణ కార్యకర్తగా ఉండటానికే ఆమె మొగ్గు చూపారు. అంటార్కిటికా అన్వేషణకు పర్యటన చేపట్టారు. ఆమె ఒక బృందంతో కలిసి అక్కడ అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో గడపనున్నారు.
మీనాతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె తల్లి, అంటార్కిటికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా జీవిత భాగస్వామిని వెంటబెట్టుకుని రావాలని, ఆ భాగస్వామి పెంగ్విన్ అయినా పర్వాలేదని సరదాగా సూచించారు.

ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: శాంతి పునరుద్ధరణపై ఆశలు ఆవిరి
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- పశ్చిమ బెంగాల్ మతఘర్షణలకు ఆ పాటలే కారణమా?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





