'కరోనావైరస్ చైనాలోనే పుట్టింది' - ట్రంప్ నోట ఇప్పటికీ అదే మాట

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్ చైనాలోని ప్రయోగశాలలోనే పుట్టిందనడానికి తగిన ఆధారాలను తను చూశానంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత నిఘా సంస్థలనే తక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇంతకు ముందు అమెరికా జాతీయ నిఘా ఏజెన్సీ డైరెక్టర్ కార్యాలయం "ఈ వైరస్ ఎలా పుట్టిందో తెలుసుకోవడం గురించి ఇంకా పరిశోధన చేస్తున్నాం" అని చెప్పింది.
కానీ కోవిడ్-19 మానవ నిర్మితం గానీ, జన్యుపరంగా పరివర్తనం చెందిన వైరస్ గానీ కాదని అది నిర్ధారించింది.
కోవిడ్-19 ప్రయోగశాల నుంచే పుట్టింది అనే సిద్ధాంతాలను చైనా కొట్టిపారేసింది. అమెరికా స్పందనను విమర్శించింది.
గత ఏడాది చైనాలో ఈ వైరస్ ఆవిర్భవించినప్పటి నుంచి అది ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మందికి పైగా పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్ వల్ల ఒక్క అమెరికాలోనే 63 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
వుహాన్‌లో వైరస్ బయటపడినప్పటి నుంచి ఈ మహమ్మారి 32 లక్షల మందికి వ్యాపించింది. వారిలో పది లక్షలమందికి పైగా అమెరికన్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, alamy
ట్రంప్ ఏం చెప్పారు?
గురువారం వైట్‌హౌస్‌లో ఒక రిపోర్టర్ ట్రంప్‌ను “వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనే ఈ వైరస్ పుట్టింది అనడానికి అత్యంత విశ్వసనీయమైన సమాచారం ఏదైనా ఈ సమయంలో మీరు చూశారా” అని అడిగారు.
దానికి అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యేకంగా దేని గురించీ చెప్పకుండా “అవును, నేను చూశాను” అన్నారు. ఆయన “చైనాకు ప్రజా సంబంధాల సంస్థలా మారినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగ్గుపడాలి” అని చెప్పారు.
మీ వ్యాఖ్యపై స్పష్టత ఇస్తారా అని కోరినప్పుడు ట్రంప్ “నేను మీకది చెప్పలేను. మీకు చెప్పడానికి నాకు అనుమతి లేదు” అన్నారు.
“వాళ్లు(చైనా) పొరపాటు చేశారామో? లేక అది ఒక పొరపాటుమ మొదలైతే, ఆ తర్వాత వాళ్లు ఇంకొకటి చేశారామో. లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేశారామో? అని ఆయన రిపోర్టర్లతో అన్నారు.
“మిగతా చైనా అంతటా ప్రజలను, ట్రాఫిక్‌ను ఎలా అనుమతించారో నాకు అర్థం కావడం లేదు. కానీ వాళ్లు అది మిగతా ప్రపంచమంతా వ్యాపించేలా చేశారు. అది మంచిది కాదు. ఈ ప్రశ్నకు వారు సమాధానం చెప్పడం చాలా కష్టం” అన్నారు.
“చైనా, డబ్ల్యుహెచ్ఓ వైరస్ గురించి ముందే సమాచారం అందించాయా, లేదా అనేది నిర్ధారించే పనిలో నిఘా సంస్థలు ఉన్నాయి” అని పేరు వెల్లడించని అధికారులు ఎన్బీసీ న్యూస్‌కు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
నిఘా సంస్థలు ఏం చెబుతున్నాయి?
అమెరికా నిఘా ఏజెన్సీలను పర్యవేక్షించే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెజిలెన్స్ కార్యాలయం గురువారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అందులో “కోవిడ్-19 సహజ మూలాలకు సంబంధించి విస్తృతమైన శాస్త్రీయ ఏకాభిప్రాయంతో తాము కూడా ఏకీభవిస్తున్నామని” తెలిపింది.
కరోనా వచ్చిన జంతువులతో కాంటాక్ట్స్ వల్ల ఈ మహమ్మారి వ్యాపించిందా, లేక ఇది వుహాన్‌లోని ప్రయోగశాలలో జరిగిన ప్రమాదమేనా అనేది నిర్ధారించడానికి తమకు అందే సమాచారాన్ని (ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ) నిశితంగా పరిశీలించడం కొనసాగిస్తామని అది చెప్పింది.
వైరస్ ఒక జీవ ఆయుధం. అమెరికా నిఘా సంస్థల కుట్ర సిద్ధాంతాలు, అమెరికా చైనాలు పరస్పరం ఆరోపణల్లో వచ్చిన మొదటి స్పందన ఇదే.

ఫొటో సోర్స్, AFP
వుహాన్ ల్యాబ్ అంటే ఏంటి?
వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. దీనిని 1950లో స్థాపించారు. చైనా మొట్ట మొదటి బయోసేఫ్టీ లెవల్ 4 ప్రయోగశాల ఇదే.
ఇలాంటి ప్రయోగశాలల్లో చికిత్స, వాక్సిన్లు అతి తక్కువగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధికారకాలపై ప్రయోగాలు జరుగుతాయి. ఈ ప్రయోగశాల్లోని ఒక భాగంలో గబ్బిలాల నుంచి వచ్చిన కరోనా వైరస్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఫ్రాన్స్ ఆర్థిక సాయంతో 44 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రయోగశాలను 2015లో ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిలో చాలామందికి ఫ్రాన్స్ లోని లియాన్ నగరంలో ఉన్న ఇలాంటి ప్రయోగశాలలోనే శిక్షణ ఇచ్చారు అని నేచర్ జర్నల్ చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రయోగశాలలతో లింకులున్న బయోసేఫ్టీ లెవల్ 4 ప్రయోగశాల ఉండడం చైనాకు గర్వకారణమే.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

చైనాపై ట్రంప్ ఆరోపణలు ఏమిటి?
అధ్యక్షుడి పాలనను బీజింగ్‌తో సంధి ప్రయత్నంగా అధికారులు వర్ణిస్తుంటే, మహమ్మారి తర్వాత ట్రంప్ ఇటీవల చైనాపై మాటల యుద్ధాన్ని పెంచారు.
“నవంబర్లో జరిగే ఎన్నికల్లో నేను ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది”అని ఆయన బుధవారం అన్నారు.
“చైనా అధికారులు వైరస్‌ను ముందే ఆపి ఉండవచ్చని, వ్యాధి వ్యాపించకుండా అడ్డుకుని ఉండవచ్చని” ఆయన ఇంతకు ముందు ఆరోపించారు.
ట్రంప్ డబ్ల్యుహెచ్ఓను కూడా అలాగే విమర్శించారు. దానికి అందే అమెరికా నిధులను ఉపసంహరించారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తమకు ఎదురవుతున్న సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది.
ఎలాంటి ఆధారాలూ లేకపోయినా “కోవిడ్-19 బహుశా అమెరికాలోనే ఆవిర్భవించి ఉండచ్చని” చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి పదే పదే అన్నారు.
ట్రంప్ ప్రభుత్వం చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు దారులు వెతుకుతోందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో చెప్పింది. చైనాపై పరువునష్టం దావా వేయడం లేదంటే రుణాలు రద్దు చేయడం లాంటివి కూడా చర్చల్లో ఉన్నాయని తెలిపింది..
గతంలో ట్రంప్, అమెరికా నిఘా సంస్థ మధ్య గొడవ
అమెరికా నిఘా ఏజెన్సీలు ఇరాన్‌తో మెత్తగా వ్యవహరిస్తున్నాయని ఆయన జనవరిలో అన్నారు. ఉత్తర కొరియాతో ముప్పుందన్న వారి అంచనాలను తోసిపుచ్చారు.
2016లో తన ఎన్నికల సమయంలో కూడా నిఘా వర్గాలను ఆయన తప్పు పట్టారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యం ఉందన్న వారి అంచనాలను ప్రశ్నించారు.
ఓటింగ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉండేలా, సైబర్ దాడులు చేస్తారని, నకిలీ వార్తల ప్రచారం చేస్తారని ఆరోపించినా, రష్యా పౌరులపై అమెరికా ఆరోపణలు నమోదు చేసినా, ఆయన రష్యాను వెనకేసుకుంటూ వచ్చారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?
- ఇండియా లాక్డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








