సాహర్ తాబార్: జైలులో నిర్బంధించిన ఇరానీ ఇన్‌స్ట్రాగ్రామ్ స్టార్‌కు ‘కరోనావైరస్’

ఫొటో సోర్స్, IRTV2
ఇరాన్‌లో జైలులో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌కు కరోనావైరస్ సోకిందని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.
ఫతేమే ఖీష్వాంద్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సాహర్ తాబార్‌గా ప్రసిద్ధి చెందారు. ఆమె ఏంజెలినా జోలీ జోంబీగా మారితే ఎలా ఉంటారనే వేషధారణతో ఫొటోలు పోస్ట్ చేయటం వల్ల పాపులర్ అయ్యారు.
ఆమెను దైవదూషణ, హింసను ప్రేరేపించటం ఆరోపణల మీద 2019 చివర్లో అరెస్ట్ చేశారు.
ఆమెకు జైలులో కరోనావైరస్ సోకిందన్న వాదనను షాహ్రే రే మహిళా జైలు అధికారి మెహిదీ మొహమ్మదీ తిరస్కరించారు.
మధ్య ఆసియాలో కరోనావైరస్ మరణాలు అత్యధికంగా ఇరాన్‌లోనే సంభవించాయి.
తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉంది. ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 6,200 దాటింది. అయితే.. వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, INSTAGRAM
ఖీష్వాంద్ తరఫు న్యాయవాది పాయమ్ డేరాఫ్షాన్.. ఇరాన్ న్యాయవ్యవస్థకు బహిరంగ లేఖ రాశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
తన కక్షిదారుకు కరోనావైరస్ లక్షణాలు కనిపించటంతో జైలులో క్వారంటైన్ విభాగానికి తరలించినట్లు ఆమె తల్లి తనకు తెలియజేశారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆరోపిత నేరాలు చేసినపుడు ఖీష్వాంద్ మైనర్ అని.. ఆమె కేసు ప్రాథమిక ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఆమె తాత్కాలిక విడుదలకు అర్హత లభించలేదని కూడా ఆయన వివరించారు.
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ గత మార్చి నెలలో 85,000 మంది ఖైదీలను విడుదల చేసింది. వారిలో బ్రిటిష్-ఇరానియన్ స్వచ్ఛంద కార్యకర్త నజానిన్ జాఘారీ రాట్‌క్లిఫ్ కూడా ఉన్నారు.
2017లో ఖీష్వానంద్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఫొటోలు వైరల్‌గా మారినపుడు ఆమె అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌ను తొలగించారు.
ఖీష్వానంద్ దాదాపు 50 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారన్న వార్తలతో సోషల్ మీడియా యూజర్లు చాలా మంది ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే.. ఆ ఫొటోలను మేకప్ ద్వారా, ఫొటోషాప్ ద్వారా తయారు చేశామని ఆమె రష్యాకు చెందిన స్పుత్నిక్ న్యూస్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
ఇరాన్‌లో చట్టాలను అతిక్రమించారన్న ఆరోపణలతో అరెస్టయిన సోషల్ మీడియా ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో ఆమె కూడా చేరారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

2018లో ఒక టీనేజ్ యువతి తను డాన్స్ చేస్తున్న వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు.
అదే సంవత్సరం.. మషాద్ నగరంలోని ఒక మాల్‌లో పురుషులు, మహిళల సమూహం డ్యాన్స్ చేస్తున్న వీడియో దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించటంతో నగర అధికారి ఒకరిని అరెస్ట్ చేశారు.
2017లో జుంబా డ్యాన్స్ చేసినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








