కరోనావైరస్‌: కోవిడ్‌తో యుద్ధానికి సిద్ధమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)

టెస్ట్ ట్యూబ్ డేటా గ్రాఫిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కృత్రిమ మేధ కరోనావైరస్‌ను నయం చేస్తుందా?
    • రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని పొట్టన పెట్టుకుంటున్న విశ్వ మహమ్మారిని ఎదుర్కోడానికి ఏదైనా అద్భుత శక్తి సాయం చేస్తే బావుణ్ణు అని అందరికీ అనిపిస్తోంది.

కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్) మీద అంచనాలు మరీ ఎక్కువై పోతున్నాయని అనిపించవచ్చు. కానీ, వైద్య చికిత్స విషయంలో ఇది ఇప్పటికే తన సత్తా ఏమిటో నిరూపించుకుంది.

అయితే, ఇప్పుడు మానవాళిని హడలగొడుతున్న కరోనా మహమ్మారి విసురుతున్న సవాలును ఈ యంత్ర పరిజ్ఞానం అందుకోగలదా? ఈ సందేహానికి బదులివ్వడానికి ముందుకు వస్తున్న సంస్థలు తక్కువేమీ లేవు.

ఆక్స్‌ ఫర్డ్‌ లో ఉన్న ఎక్స్‌సైన్షియా మొట్టమొదట కృత్రిమ మేథస్సు కనుగొన్న మందును మనుషులపై ప్రయోగించింది. ఇది కాలిఫోర్నియాలో ఉన్న స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఉన్న 15 వేల మందుల్లోంచి తీసిన ఒక మందు,

వయాగ్రా సహ ఆవిష్కర్త డాక్టర్ డేవిడ్ బ్రౌన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ కంపెనీ హీల్ఎక్స్ అరుదైన వ్యాధులకు మందులు కనుగొనేందుకు తయారు చేసిన తమ కృత్రిమ మేధా వ్యవస్థను మళ్లీ వినియోగిస్తోంది.

ప్రయోగశాల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఔషధాల పనితీరు గురించి ఎంతో శ్రమతో అసంఖ్యాకంగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ఈ సిస్టమ్‌ను 3 భాగాలుగా విభజించారు.

  • వ్యాధికి సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన మొత్తం సమాచారాన్ని రాబట్టడం
  • వైరస్ డీఎన్ఏ, నిర్మాణంపై అధ్యయనం చేయడం
  • రకరకాల మందులు సరిపోతాయా లేదా చూడడం

మందుల ఆవిష్కరణ అనేది సంప్రదాయబద్ధంగా నెమ్మదిగా ఉంటుంది.

“నేను దీన్ని 45 ఏళ్లుగా చేస్తున్నా, ఇప్పటివరకూ 3 మందులు మార్కెట్లోకి తీసుకొచ్చాను”! అని డాక్టర్ బ్రౌన్ బీబీసీకి చెప్పారు.

కానీ, కృత్రిమ మేధస్సు చాలా వేగంగా చేస్తుందని నిరూపితమైంది.

“మాకు అవసరమైన డేటాను సేకరించడానికి కేవలం కొన్ని వారాలు పట్టింది. మా దగ్గర కొన్ని రోజుల క్రితం వచ్చిన తాజా సమాచారం కూడా ఉంది. అంటే, మేం ఇప్పుడు కీలక దశలో ఉన్నాం” అని డాక్టర్ బ్రౌన్ చెప్పారు.

“ఈస్టర్ సమయంలో మా అల్గారిథం నడిపించాం. మా దగ్గర వచ్చే వారం రోజుల్లో మూడు పద్ధతుల్లో అవుట్‌పుట్ ఉంటుంది” అన్నారు..

ఆ సమాచారాన్ని మే నెలకల్లా మందుల జాబితాలో ఉంచాలని హీల్‌ఎక్స్ భావిస్తోంది. తమ అంచనాలను క్లినికల్ ట్రయల్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రయోగశాలలో చర్చలు జరుపుతోంది.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్‌ను ఓడించే ఔషధాల మిశ్రమాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చూపించగలదా?

కృత్రిమ మేధ ముందున్న ప్రత్యామ్నాయాలు

  • పూర్తిగా ఒక కొత్త రకం మందు కనుగొనడం, ఉపయోగించడానికి అది సురక్షితం అనే ఆమోదం పొందడానికి కొన్నేళ్లు వేచిచూడడం.
  • ప్రస్తుతం ఉన్న మందులనే మళ్లీ వినియోగించడం

కానీ, “ఒకే మందుతో దానికి పరిష్కారం కనుగొనగలం అనుకోవడం కూడా చాలా అరుదు” అని డాక్టర్ బ్రౌన్ చెప్పారు.

హీల్‌ఎక్స్ 80 లక్షల జతలపై అధ్యయనం చేయడం అంటే, మార్కెట్లో ఆమోదం పొందిన 4 వేల మందుల నుంచి ఉత్పన్నమైన 10.5 బిలియన్ల ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్లు కనుగొంది అని అర్థం.

“తెలుసుకోగలిగే ఒక పరిష్కారం గుర్తించడానికి మనకున్న బలమైన దారుల్లో కృత్రిమ మేథస్సు ఒకటి. కానీ అక్కడ అత్యున్నత నాణ్యత, భారీగా స్పష్టంగా ఉన్న డేటా సెట్స్ కూడా ఒక ప్రాథమిక అవసరం” అని ఇంపీరియల్ కాలేజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఇన్నొవేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆరా దార్జీ బీబీసీతో అన్నారు.

“ఇప్పటివరకూ ఈ సమాచారం ఎక్కువగా బిగ్ ఫార్మా లాంటి సంస్థల్లో శిథిలమైంది. బిగ్ ఫార్మా లేదా యూనివర్సిటీల్లోని పురాతన ప్రయోగశాలల్లో, మేథో సంపత్తిలో కనిపించకుండా పోయింది”.

“ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఈ ఔషధ ఆవిష్కరణల డేటా వనరులను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19ను ఎదుర్కోడానికి వీలైనంత త్వరగా కొత్త చికిత్సను కనుగొనడానికి ఆధునిక యంత్రాల ద్వారా తెలిసిన పద్ధతులను పరిశోధకులు అమలుచేయడానికి కృత్రిమ మేధ వీలు కల్పిస్తుంది.”

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు

“సాధారణంగా అవన్నీ కలిసి పనిచేసేలా చేయడానికి ఒక ఏడాది పేపర్ వర్క్ అవసరం అవుతుంది” అని సైఫర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలీఫ్ సలే చెప్పారు.

“కానీ పని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం ఉన్న కొందరికి వరుసగా చేసిన కొన్ని జూమ్ కాల్స్ ఈ పనిని వేగవంతం చేసింది. దానికి వారి చేతుల్లో ఉన్న బోలెడంత సమయం గురించి కూడా చెప్పుకోవాలి. గత మూడు వారాల్లో జరిగిన వాటిని చేయాలంటే సాధారణంగా సగం ఏడాది పడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతి పనినీ చేశారు” అన్నారు.

కరోనా వైరస్ మెదడు కణజాలంపై కూడా దాడిచేయగల అవకాసాలను, ఈ వైరస్ సోకిన కొందరు రుచి, వాసన శక్తిని ఎందుకు కోల్పోతారన్నది చెప్పవచ్చు.

వైరస్ పురుషులు, స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ మీద కూడా దాడి చేయగలదని ఊహిస్తున్నారు.

కృత్రిమ మేధతో కలిసి ఉన్న సైఫర్ మెడిసిన్‌ను నెట్‌వర్క్ మెడిసిన్ అని అంటున్నారు. ఈ పద్ధతి ద్వారా పరమాణు భాగాల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా ఒక వ్యాధిని చూపిస్తుంది.

“ఒక జన్యువు లేదా ప్రొటీన్ స్వయంగా సరిగా పనిచేయకపోవడం వల్ల ఒక వ్యాధి సమలక్షణం అరుదుగా ఉంటుంది. ప్రకృతి అంత సులభంగా ఉండదు. కానీ కొన్ని ప్రొటీన్ల మధ్య జరిగే చర్యల నెట్‌వర్క్‌ లో ఒక విస్తృత ప్రభావాన్ని చూపుతుంది” అని సలేహ్ చెప్పారు.

నెట్ వర్క్ మెడిసిన్, కృత్రిమ మేథస్సు ఈ రెండింటి కలయికను ఉపయోగించడం వల్ల అది మనం 81 మందులను గుర్తించేందుకు సహకరించే అవకాశం ఉన్న కన్సార్టియం వైపు దారితీస్తుంది.

“కృత్రిమ మేధ మెరుగ్గా పని చేయగలదు. ఉన్నత క్రమంలో ఉన్న సహసంబంధాలను మాత్రమే కాదు. ఇది సంప్రదాయ నెట్‌వర్క్ మెడిసిన్‌కు అందని వేరుగా ఉన్న సమాచారాన్ని కూడా చూస్తుంది” అని ప్రొఫెసర్ ఆల్బర్ట్ లాస్లో బార్బసి చెప్పారు.

కానీ కృత్రిమ మేథస్సు మాత్రమే పనిచేయదు. దానికి మొత్తం మూడు విధానాలు కావాలి.

“రకరకాల పరికరాలు, రకరకాల కోణాల్లో చూస్తాయి. కానీ అన్నీ కలిపి చాలా బలంగా అవుతాయి” అని ఆయన చెప్పారు.

అలీబాబా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్‌ను కచ్చితంగా గుర్తించే కృత్రిమ మేధను అభివృద్ధి చేశామని అలీబాబా సంస్థ చెబుతోంది.

కొన్ని కృత్రిమ మేధ కంపెనీలు తమ దగ్గర మందులు సాయపడవచ్చని ఇప్పటికే చెబుతున్నాయి.

అర్థరైటిస్ చికిత్స కోసం ఇప్పటికే ఆమోదం పొందిన బరిసిటినిబ్ అనే మందును, ఊపిరి తిత్తుల కణాలు ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా అడ్డుకునేందుకు సమర్థవంతమైన చికిత్స అందించే ఔషధంగా బెనెవొలెంట్ ఏఐ గుర్తించింది.

యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ జిసీజ్‌తో కలిసి ఇది ఇప్పుడు నియంత్రిత పరీక్షలలోకి ప్రవేశించింది.

మరోవైపు, వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న యాంటీ వైరల్ డ్రగ్స్ సామర్థ్యంపై పరిశోధనలు జరిపిన దక్షిణకొరియా, అమెరికాలోని శాస్త్రవేత్తలు ఎయిడ్స్ చికిత్సకు ఉపయోగించే అటజనవిర్ కరోనాకు మంచి ఔషధం కావచ్చని సూచించారు.

మిగతా కంపెనీలు రేడియాలజిస్టులపై భారం తగ్గేలా స్కానింగ్‌లను విశ్లేషించడానికి, వెంటిలేటర్లు ఎక్కువగా ఎలాంటి రోగులకు అవసరం కావచ్చో ఊహించడానికి, ఇతర ప్రయోజనాల కోసం కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి.

ఉదాహరణకు చైనాలోని భారీ టెక్నాలజీ సంస్థ అలీబాబా ఒక అల్గారిథంను ప్రకగటించింది. అది 96 శాతం కచ్చితత్వంతో, 20 సెకన్లలో కరోనా కేసులను పరీక్షించగలదు అని చెబుతోంది.

కానీ, “వ్యాపించిన అంటువ్యాధుల డేటాకు తగినట్లు కృత్రిమ మేధ వ్యవస్థకు శిక్షణ ఇచ్చి ఉంటారు. అందుకే వైరస్ ప్రాథమిక లక్షణాలను అది అంత ప్రభావవంతంగా గుర్తించలేదు” నిపుణులు చెబుతున్నారు.

“డేటా వనరులను సమకూర్చడానికి చిన్న మందుల డేటా స్టోర్లలో పనిచేసే ఉద్యోగులు, విద్యావేత్తలు, పరిశోధనా స్వచ్చంద సంస్థలతో చేతులు కలిపేలా పెద్ద ఫార్మస్యూటికల్స్ కంపెనీలను ఒప్పించడానికి విధాన నిర్ణేతలు ఒక ప్రపంచ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది” అని ప్రొఫెసర్ డార్జీ అన్నారు.

“కోవిడ్-19పై చేసే యుద్ధంలో సాయం చేసేందుకు కృత్రిమ మేధ కోసం డ్రగ్ డిస్కవరీ డేటా రహస్యాలను విప్పడానికి సమయం ఎప్పుడూ ముఖ్యం కాదు” అని ఆయన అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)