కరోనావైరస్: రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేయడంపై ప్రణాళిక విడుదల చేసిన డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
'ఓపెనింగ్ అప్ అమెరికా అగైన్' లక్ష్యంగా మొత్తం మూడు దశల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్‌ను ఎత్తేయవచ్చని అధ్యక్షుడు డోనల్ట్ ట్రంప్ సూచించారు.
ఫెడరల్ ప్రభుత్వ సాయంతో గవర్నర్లే తమ పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చని హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఈ నెలలోనే తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని కూడా ఆయన సూచించారు.
ట్రంప్ ఇంకా ఏం చెప్పారు?
రోజువారీ జరిగే సమీక్షా సమావేశంలో భాగంగా భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన ట్రంప్.. అమెరికాను తిరిగి పట్టాలపైకి ఎక్కించడమే తాము చేయాల్సిన తదుపరి యుద్ధమని వ్యాఖ్యానించారు.
“అమెరికా, అమెరికా దేశస్థులు తిరిగి తమ పనిని ప్రారంభించాలనుకుంటున్నారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కాదు” అని ట్రంప్ అన్నారు.
ఆరోగ్యవంతులు కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ తిరిగి తమ విధుల్లో చేరవచ్చని సూచించారు. సామాజిక దూరం పాటించడం కొనసాగుతుందని, అలాగే అనారోగ్యంతో బాధపడే వారు ఇంటి దగ్గరే ఉండవచ్చని తెలిపారు.
అమెరికా ఆర్థిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ప్రారంభం కావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలన్న ట్రంప్.. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్లు తమ పరిస్థితులకు అనుగుణంగా చాలా వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్రంప్ ప్రణాళిక
మొత్తం 3 విడతలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం కానుంది. ప్రతి ఫేజ్ 14 రోజుల పాటు కొనసాగుతుంది.
మొదటి విడతలో భాగంగా ప్రస్తుతం లాక్ డౌన్‌లో కొనసాగుతున్న నిబంధనలే కొనసాగుతాయి. అయితే రెస్టారెంట్లు, ప్రార్థనాస్థలాలు, క్రీడా ప్రాంగణాలు సామాజిక దూరం నియమాలను నిర్లక్ష్యం చెయ్యకుండా తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
వైరస్ తిరిగి విజృంభించడం లేదన్న స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాతే ఫేజ్ 2 మొదలవుతుంది. అందులో భాగంగా పాఠశాలలు, బార్లు, సాధారణ ప్రయాణాలు తిరిగి ప్రారంభమవుతాయి. అది కూడా నిర్దిష్ట పరిస్థితుల మధ్య మాత్రమే.
మూడో ఫేజ్ విషయానికొస్తే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గి కేసుల సంఖ్య కూడా తగ్గుతోందన్న నమ్మకం రాష్ట్రాలకు కలిగిన తరువాత మాత్రమే ఇది మొదలవుతుంది. అప్పుడు కూడా సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. సభలు, సమావేశాలు జరుపుకోవచ్చు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆస్పత్రులు, బార్లపై ఉన్న ఆంక్షల్ని మరింత సడలిస్తారు.
కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్న చోట లాక్ డౌన్ ఎత్తేయడానికి మరి కాస్త సమయం పడుతుంది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

మే 1 నుంచి దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని ట్రంప్ ప్రభుత్వం గతంలో భావించింది. అయితే బుధవారం మాత్రం వీలైతే కొన్ని రాష్ట్రాలు అంత కంటే ముందే తమ సూచనలు అనుసరిస్తూ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చని ట్రంప్ సూచించారు.
అయితే వీలైనంత త్వరగా లాక్ డౌన్‌ను ఎత్తేయాలన్న ట్రంప్ సూచనల్ని, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, వైద్య నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.
“మనం మరీ ఎక్కువగా ఆశపడుతున్నట్లుంది. సామాజిక దూరం నియమాల్ని సడలించే నిర్ణయం తీసుకోవడం కన్నా ముందు దేశంలో చాలా ప్రాంతాల్లో ఇంకా వైరస్ నిర్ధరణ పరీక్షల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది” అని ప్రభుత్వ సాంక్రమిక వ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌసీ అన్నారు.
న్యూయార్క్ గవర్నర్ కూడా మే 15 వరకు స్టే ఎట్ హోమ్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని గురువారం స్పష్టం చేశారు.
అయితే మిచిగాన్, ఒహియో, విస్కాన్సిన్, ఇల్లినోయిస్, ఇండియానా, కెంటకీ తదితర రాష్ట్రాల గవర్నర్లు మాత్రం తమ ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించడంలో కలిసి పని చేస్తామని ప్రకటించారు.

ఫొటో సోర్స్, EPA
ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి?
- జర్మనీ నెమ్మదిగా ఆంక్షల్ని సడలిస్తూ వస్తోంది. బహుశా వచ్చే వారం దుకాణాలు తెరచుకోవచ్చు.
- ఆస్ట్రియాలో ఇప్పటికే వేలాది దుకాణాలు తెరచుకున్నాయి.
- ఫ్రాన్స్ మే 11 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది.
- ఇటలీలో కరోనావైరస్ ప్రభావం పడని ప్రాంతాల్లో కొద్ది సంఖ్యలో దుకాణాలను తెరిచేందుకు అధికారులు అనుమతించారు.
- బ్రిటన్ మరో మూడు వారాల పాటు లాక్ డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
- అనుకున్నదాని కన్నా ముందుగానే ఆంక్షల్ని ఎత్తేయాలని డెన్మార్క్ భావిస్తోంది.
- స్పెయిన్‌లో ఇప్పటికే కొన్ని వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
- ఈ వారంతంలో పోలెండ్‌లో కూడా ఆంక్షల్ని ఎత్తివేయనున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి
- అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యోమగాములు... వారికి కరోనావైరస్ సోకకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కరోనావైరస్:'మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు' -రాహుల్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








