మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిమ్ స్మెడ్లీ
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

భూమి నుంచి తవ్వి తీసే ఖనిజాలపై ఆధునిక ప్రపంచం ఆధారపడి ఉంది. అయితే మన ఇంట్లోనే అత్యంత విలువైన లోహాలు దొరికే అవకాశముంది.

అటక మీద పేరుకుపోయిన సామాన్లు శుభ్రం చేస్తున్నప్పుడో, వంటగదిలో అవసరం లేని వస్తువులను తొలగిస్తున్నప్పుడో, అదనపు గదిలో దాచి పెట్టిన అవసరం లేని సామాన్లను తీస్తున్నప్పుడో, లేదా మీరు చేయాలనుకున్న పనుల జాబితాని సిద్ధం చేస్తున్నపుడు కానీ, ఎప్పుడైనా విలువైన వస్తువులు మీ కంటపడవచ్చు. మీరు చేయాల్సిందల్లా కాస్త శ్రద్దగా వెతకడమే.

గదుల మూలల్లో దాచి పెట్టిన వస్తువుల్లో విలువైన లోహాలు, ఖనిజాలు ఉండవచ్చు.

వీటి ఆధారంగానే ఆధునిక జీవనం నడుస్తోంది.

నిజానికి మన ఇంటి పెరట్లు, ఇంటి లోపల వెతికితే అవసరమైన వస్తువులు బయట పడే ఒక ‘నగర గని’గా చెప్పవచ్చు.

ఇంట్లో వస్తువులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోని కొన్ని కోట్లాది ఇళ్లల్లో వాడకుండా పడేసిన ఎలక్ట్రానిక్ సాధనాలు, పాత మొబైల్ ఫోన్లు, పక్కన పడేసిన గేమ్ యూనిట్లు, పాత స్టీరియో సెట్లు, కంప్యూటర్లు, పనికి రాని ప్రింటర్లు లాంటివి ఉంటాయి. వీటిలో, వెండి, రాగి, ఒక్కొక్కసారి బంగారం ఇంకా కొన్ని భూమిలో లభించే అరుదైన లోహాలు ఉండే అవకాశం ఉంది.

ఈ లోహాలని ఆ వస్తువుల నుంచి వేరు చేసి తిరిగి వాడుకునేందుకు వీలయ్యేలా చేయడమే అసలైన సమస్య.

మీ ఇంటిలో దాగున్న నిధిని వెతకాలనుకునే ముందు ఒక చిన్న నిబంధన పాటించాలి.

ఒక వైపు పారిశుద్ధ్య కార్మికులు పనితో సతమతమవుతున్నప్పుడు ఇంట్లో చెత్తనంతా ఒకేసారి బయట పడేసి వారి మీద మరింత ఒత్తిడి పెంచవద్దని కొన్ని స్థానిక సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సేకరించిన చెత్తనంతా జాగ్రత్తగా పక్కన పెట్టి తర్వాత చెత్త బుట్టలో వేయవచ్చు.

భూమిలో దొరికే ఖనిజాల గురించి వెతుకులాట ఆపి నగరాలలో దొరికే లోహాల పై దృష్టి పెట్టవచ్చని కొందరి అభిప్రాయం.

పాత వస్తువుల నుంచి సేకరించిన లోహాలను మళ్ళీ కొత్త వస్తువులలో వాడేందుకు అనువుగా ఉంచితే, కొత్తగా గనులను తవ్వాల్సిన పని ఉండకపోవచ్చు.

ఒలింపిక్స్ కోసం పాత ఎలక్ట్రానిక్ వస్తువులను జపాన్ ప్రజలు విరాళమిచ్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్ కోసం పాత ఎలక్ట్రానిక్ వస్తువులను జపాన్ ప్రజలు విరాళమిచ్చారు

వస్తువులలో దాగున్న లోహాలను సేకరించి వాటిని ఎలా సంరక్షించాలో తెలిస్తే రీసైక్లింగ్ ప్రక్రియ చవకగా అయిపోతుందని డబ్ల్యూఈఈఈ ఫోరమ్ (ఈయూ ఫండింగ్) రీసైక్లింగ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ జేమ్స్ హార్న్ అన్నారు. నగరాలలో ఖనిజాల కోసం వెతకడం ఒక ఉత్తమమైన పద్దతి అని అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చిన పతకాలను పరిశీలిస్తే 5000 బంగారు, వెండి, రజత పతకాలను తయారు చేయడానికి మార్చ్ 2017 నుంచి ఏప్రిల్ 2019 వరకు 60 లక్షల మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన 70 కోట్ల టన్నుల వ్యర్ధ ఎలక్ట్రానిక్ పరికరాలను జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చారు.

భూమిలో ఉన్న సహజ నిక్షేపాల పై ఆధారపడకుండా నగరాలలో దాగున్న గనులని వెలికి తీస్తే స్థిరమైన భవితవ్యానికి దోహద పడే అవకాశం ఉంది.

కొన్ని దశాబ్దాలుగా భూమిలో ఉన్న విలువైన ఖనిజాలను తవ్వడం, అధికంగా వినియోగించడం, వ్యర్ధాలను మళ్లీ భూమిలోకి విసిరేయడం చేస్తూనే ఉన్నాం. యూరోపియన్లు లోహాలను వినియోగించే స్థాయిలో ప్రపంచంలో ఉన్న 7 .8 కోట్ల ప్రజలు కూడా వాడితే మనకి 2 .8 రెట్లు భూ గ్రహాలు అవసరం ఉంటుందని కొన్ని అంచానాలు చెప్పాయి. యుఎస్ లో జీవన విధానంలా ప్రపంచమంతా అవలంబిస్తే ఐదు భూ గ్రహాలు అవసరం అవుతాయి.

భూమిలో ఉన్న ఈ నిక్షేపాలను వెలికి తీయడం పర్యావరణానికి హానికరం. ప్రపంచంలో వెలువడుతున్న సగం కార్బన్ వ్యర్ధాలకి, జీవావరణ నష్టానికి ఖనిజాలను వెలికి తీసే పరిశ్రమలదే బాద్యత అని ఐక్య రాజ్య సమితి ప్రపంచ వనరుల ఔట్లుక్ చెప్పింది.

సర్క్యూట్లు

ఫొటో సోర్స్, Getty Images

గత 50 సంవత్సరాలలో ఖనిజాలను తవ్వడం మూడింతలు పెరిగింది. కొన్ని దొరకడం కూడా కష్టంగా మారి, ఖరీదు పెరిగిపోయాయి. వీటన్నిటి వలన జరిగే పర్యావరణ హాని అయితే వెల కట్టలేనిది.

కేవలం ఎలక్ట్రిక్ సాధనాల నుంచే కాకుండా వేర్ హౌస్ లలో, ఇళ్లల్లో, వ్యాపార స్థలాల్లో చాలా రోజుల నుంచి వాడకుండా పడేసి ఉంచిన చాలా సామాన్లు కూడా నగరాలలో లభించే గనులేనని హార్న్ అన్నారు.

మనకి అవసరమైనదంతా మనం వెలికి తీశామా? అలాగే సాంప్రదాయ తవ్వకాలు ఆపేస్తే నగరాలలో లభించే గనుల్లో సరిపడేంత నిక్షేపాలు దొరుకుతాయా?

ఈ - వేస్ట్ - వ్యర్ధ ఎలక్ట్రానిక్ , ఎలక్ట్రికల్ పరికరాలు లాంటి పాత టీవీలు, మొబైల్ ఫోన్లు, వంట పరికరాలు, లాప్టాప్ లలో, బంగారం, వెండి, పల్లడియం, రాగి లాంటి విలువైన లోహాలు ఉంటాయి. మనం కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయవలసి ఉంటుంది.

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల ఈ వేస్ట్ తయారు అవుతోంది. ఇది 6000 ఈఫిల్ టవర్ల తో సమానం. ఇది ప్రతి సంవత్సరం 3 నుంచి 4 శాతం పెరుగుతోంది.

2016లో ఆసియాలో అత్యంత ఎక్కువ మోతాదులో ఒక కోటి 80 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు తయారు అయ్యాయి.

ఇది అమెరికాలో కోటి పది లక్షల టన్నులు, ఆఫ్రికాలో 22 లక్షల మిలియన్ టన్నులు, ఓషియానియా లో 0 .7 లక్షల టన్నులు విడుదల అయింది.

మైనింగ్

ఫొటో సోర్స్, Getty Images

అతి తక్కువ మోతాదులో ఈ వేస్ట్ ని విడుదల చేస్తున్న ప్రాంతంగా ఓషియానియా కనిపిస్తున్నప్పటికీ అక్కడ నివసించే జనాభా సాంద్రతతో పోల్చి చూసుకుంటే అది అత్యంత ఎక్కువ అని చెప్పవచ్చు. ఆఫ్రికాలో ప్రతి వ్యక్తికీ 1 .6 కేజీల ఈ వేస్ట్ విడుదల అవుతుంటే ఓషియానియాలో ప్రతి వ్యక్తికీ 17 .3 కేజీల చొప్పున ఈ వేస్ట్ విడుదల అవుతోంది.

ప్రపంచంలోనే ఈ వేస్ట్ ని విడుదల చేయడంలో యూరోప్ రెండవ స్థానంలో ఉంది. సంవత్సరానికి ఒక కోటి ఇరవై లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ వ్యర్ధాలను విడుదల చేస్తోంది. అందులో 330,000 టన్నుల రాగి, 31 టన్నుల బంగారం ఉంటుంది. కొత్తగా తయారు అయ్యే పరికరాల కన్నా పాత వాటిలో ఈ లోహాలు ఎక్కువ ఉండే అవకాశం ఉండటం వలన ఈ వ్యర్ధాలలో దాగున్న లోహాలతో యూరోపియన్లు సంవత్సరానికి కొనుక్కునే ఒక కోటి 43 లక్షల టన్నుల కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీలు తయారు చేయడానికి సరిపోతుంది. యూరోప్ కి అవసరమయ్యే కొత్త పరికరాలను తయారు చేయడానికి 29 లక్షల టన్నుల ప్లాస్టిక్, 270,000 టన్నుల రాగి, 3500 టన్నుల కోబాల్ట్, 26 టన్నుల బంగారం అవసరం అవుతుంది.

భూమిని మరింత వ్యర్ధాలతో నింపకుండా ఈ వ్యర్ధాలని వాడి కొత్త పరికరాలను తయారు చేయవచ్చు.

పాత ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

గతంలో బెల్జియం మైనింగ్ కంపెనీ గా ఉన్న యుమికోర్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రీసైక్లింగ్ కంపెనీగా రూపాంతరం చెంది నగరాలలో చేసే మైనింగ్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉండే రాగి, లిథియం, కోబాల్ట్, నికెల్ లను సేకరించడం ఈ కంపెనీ ప్రధాన ఉద్దేశ్యం.

లోహాలు వాటి లక్షణాలను కోల్పోకుండా తిరిగి వాడే శక్తి కలిగి ఉంటాయని యుమికోర్ ప్రతినిధి మరజోలీన్ స్కిర్స్ చెప్పారు. అవి అమ్మేయవచ్చు లేదా కొత్త బ్యాటరీలలో వాడవచ్చని వివరించారు.

యుమికొర్ ప్రతి సంవత్సరం ఎంత మొత్తంలో లోహాలని రీ సైకిల్ చేస్తుందో బహిరంగంగా వివరాలు ఇవ్వదు. కానీ, 7000 టన్నుల బ్యాటరీ రీసైక్లింగ్ కి తగినంత సామర్ధ్యం ఉందని పేర్కొంటుంది. అంటే ఈ మొత్తంతో 250 మిలియన్ మొబైల్ ఫోన్ బ్యాటరీలు, 2 మిలియన్ ఈ బైక్ బ్యాటరీలు, లేదా 35000 ఈవ్ బ్యాటరీలు తయారు చేయవచ్చు,

స్మార్ట్ ఫోన్ లు, ఎలక్ట్రిక్ కార్లలో లిథియం ఐయాన్ బ్యాటరీలలో వాడే కోబాల్ట్ కి మాత్రం ఎక్కువ డిమాండ్ ఉంది. 2016 - 2018 మధ్యలో కోబాల్ట్ ధరలు 800 శాతం పెరిగాయి. ప్రపంచంలో 60 శాతం కోబాల్ట్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగో నుంచి సరఫరా అవుతుంది. పర్యావరణ ముప్పు, బాల కార్మికుల సమస్యతో ముడి పడి ఉంది.

"పాత బ్యాటరీలను రే సైకిల్ చేయడం ద్వారా కోబాల్ట్ సేకరించవచ్చని స్కిర్స్ చెప్పారు.

ఒక టన్ను మొబైల్ ఫోన్ బ్యాటరీల నుంచి 135 -240 కేజీల కోబాల్ట్ సేకరించవచ్చని యుమికోర్ చెబుతోంది. ఇందులోంచే 70 కేజీల రాగి, 15 కేజీల లిథియం సేకరించవచ్చని చెప్పింది.

బ్యాటరీ తీసేసిన తర్వాత కూడా ఒక టన్ను ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఒక కేజీ వెండి, 235 గ్రాముల బంగారం ఉంటాయని తెలిపింది.

సాధారణ గని తవ్వకాలతో పోల్చి చూస్తే ఇది చాలా ఆశాజనకంగా ఉంది.

ఇలా చూస్తే సాంప్రదాయ గనుల తవ్వకం కన్నా నగరాలలో లభించే గనుల్లో లభించే వస్తువుల ద్వారా ఎక్కువ లాభం కనిపిస్తోంది. అలాగే, అర్బన్ మైనింగ్ లో సాంప్రదాయ మైనింగ్ కంటే 17 శాతం తక్కువ శక్తి వినియోగం అవుతుందని నార్వేజియన్ పరిశోధన సంస్థ సింటెఫ్ పేర్కొంది.

చైనా లో వాడకుండా పడేసిన టీవీ సెట్లలో బయట గనుల తవ్వకాలలో లభించే కన్నా ఎక్కువ బంగారం , రాగి దొరికాయని ఒక పరిశోధన పేర్కొంది.

ఇదంతా సిద్ధాంతపరంగా చెప్పవచ్చు.

నిజానికి ఇలా చేయడానికి మనకి చాలా కాలం పట్టవచ్చని హార్న్ అన్నారు.

ముందుగా ఎలక్ట్రానిక్ వ్యర్ధాలన్నీ రీ సైకిల్ చేయడానికి కుదరదు. ప్రస్తుతం యూరోపియాన్ యూనియన్ లో 35 శాతం ఈ వేస్ట్ రీ సైకిల్ అవుతోంది.

అలాగే, అన్ని లోహాలని వెలికి తీయలేమం.

యూరోప్ లో రీ సైకిల్ చేసిన వ్యర్ధాలలోంచి వచ్చిన విలువైన లోహాలు కేవలం ఒక్క శాతం ఉన్నాయి.

ఇది 2030 కల్లా మరో 20 శాతం పెంచాలని యూరోపియన్ యూనియన్ భావిస్తోంది.

ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కి అనుగుణంగా లోహాలని సరఫరా చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని హార్న్ చెప్పారు.

మూడవది, నగరాలలో రక రకాల చోట్ల ఉన్న ఈ వస్తువులను ఒకే చోటికి తెచ్చి లోహాలని వెలికి తీయడం ఎలా అనేది ఇంకొక పెద్ద సవాలు.

రీసైక్లింగ్ పట్ల వినియోగదారులకి అవగాహన కలుగ చేయడం కూడా ఒక పెద్ద సవాలని సింటెఫ్ లో లోహ నిపుణురాలు అన మరియా మార్టినెజ్ చెప్పారు.

చాలా మంది మళ్ళీ ఎప్పుడు అవసరం పడతాయో అని చాలా వరకు వస్తువులని ఇంట్లోనే భద్రంగా దాచేస్తారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)