రెయిన్‌బో నది: ప్రపంచంలో ఇంత అందమైన నది మరోటి ఉండదేమో

ఫొటో సోర్స్, Eric Mohl
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఉన్న ఈ నదిని 'ఖనిజాల గని' అంటారు. ఈ నది రంగును చూసి పర్యటకులంతా మంత్రముగ్థులు అవుతుంటారు.
ఈ ప్రాంతంలో 'మకరేనియా క్లేవిగెరా' అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి.
వాటి వల్లే ఈ నది రంగు అలా ఉంటుందని స్థానిక టూరిస్టు గైడ్ వాల్తర్ రామోస్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Eric Mohl
వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ నది పేరు 'కనో క్రిస్టాలీస్'. 'రెయిన్‌బో రివర్' అని కూడా పిలుస్తారు.
ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని 'షీల్డ్ ఆఫ్ గయానా'గా అభివర్ణిస్తారు.
ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లల్లో ఖనిజాలు ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని కొందరు అంటారు.
ఖనిజాలతో పాటు, రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల... ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతారు.
ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Eric Mohl
భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఈ పూల రంగు ఉంటుంది.
అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడ కలిశాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేరువేరు జోన్లు ఉన్నాయి.

ఈ నది వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరొస్తోంది.
ఒకప్పుడు దీన్ని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు.
కానీ, పర్యాటకంగా అభివృద్ధి చెందే కొద్దీ ఆ అభిప్రాయం పోతోంది.
ఇక్కడి ప్రకృతి అందాలను చూసి అందరూ ముగ్థులవుతుంటారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- టీడీపీ ఎన్నికల శంఖారావం: ‘కేంద్రం, కేసీఆర్ బెదిరింపులకు భయపడం’
- వైసీపీ లోక్సభ అభ్యర్థులు వీరే
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- మనోహర్ పారికర్ తమ్ముడు కిరాణా షాపు నడుపుతారా?
- ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్యే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









