మనోహర్ పారికర్ తమ్ముడు కిరాణా షాపు నడుపుతారా? - Fact Check

ఫొటో సోర్స్, SM VIRAL POST
గోవా మాజీ ముఖ్యమంత్రి, రక్షణశాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ తమ్ముడు సురేశ్ పారికర్ నిరాడంబర జీవితం గడుపుతున్నారని, ఆయన ఒక కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారని చెప్పే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనోహర్ పారికర్ ఈ నెల 17న కేన్సర్‌తో కన్నుమూశారు.
అప్పటి నుంచి మనోహర్ పారికర్ జీవనశైలి, వ్యక్తిత్వం గురించి సోషల్ మీడియాలో యూజర్లు పెద్దయెత్తున పోస్టులు పెడుతున్నారు.
ఆయన నిరాడంబరత గురించి అందరికీ తెలుసు. విమానాశ్రయంలో తనిఖీల సమయంలోగాని, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దగాని సామాన్య పౌరులతోపాటు ఆయన వరుసలో నిలబడి ఉన్న దృశ్యాలతో కూడిన వీడియోలను చాలా మంది చూశారు.

ఫొటో సోర్స్, SM Viral Post
ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో- కిరాణా దుకాణంలో కుర్చీలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి కనిపించేలా మరో వ్యక్తి దిగిన సెల్ఫీ. కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తే మనోహర్ పారికర్ సోదరుడు సురేశ్ పారికర్ అని ఫొటోను షేర్ చేస్తున్నవారు చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నాయకుల జీవనశైలి మధ్య తేడా ఇదీ అంటూ ట్విటర్‌లో బీజేపీ అనుకూల యూజర్లు ఈ ఫొటోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. వేల సంఖ్యలో ఇది షేర్ అయ్యింది.
కొందరు మాత్రం ఈ ఫొటో నిజమేనా అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter
వాస్తవం ఏమిటి?
ఈ ఫొటోపై బీబీసీ పరిశీలన జరపగా, ఇది నిజమేనని తేలింది. ఫొటోలో ఉన్న వ్యక్తి సురేశ్ పారికరేనని, ఆయన గురించి చెబుతున్న విషయమూ వాస్తవమేనని నిర్ధరణ అయ్యింది.
ఫొటోలో ఉన్నది తమ తండ్రేనని సురేశ్ పారికర్ కుమారుడు అఖిల్ పారికర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Akhil Parrikar
''మా నాన్న ఈ కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఇది మా తాతయ్య నుంచి వచ్చింది. మా పెదనాన్నకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు'' అని ఆయన వివరించారు.
ఉత్తర గోవాలోని మపుసాలో ఈ కిరాణా దుకాణం ఉందని అఖిల్ పారికర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ హయాంలో రహదారుల నిర్మాణం ఎన్ని రెట్లు పెరిగింది?
- జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ: ‘‘ఈ రోజు నుంచి జనసైనికుడిని’’
- రఫేల్ ఒప్పందం: నిన్న... నేడు... రేపు...
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
- ఆలయ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామని డీఎంకే చెప్పిందా
- పాక్‌లో వైరల్ అవుతున్న ఆ పైలట్ వీడియో బెంగళూరులోది
- న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పులు: ఆత్మీయులను కోల్పోయిన వారి అంతరంగం
- ''మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం.. ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే ఏమైపోయేవాళ్లమో" - బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








