మనోహర్ పారికర్: గోవా ముఖ్యమంత్రి కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ వయసు 63 ఏళ్లు.
ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ కొన్ని నిమిషాల కిందట ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఆస్పత్రి వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గోవా ముఖ్యమంత్రిగా ఉన్న పారికర్ గతంలో రక్షణ మంత్రిగా పని చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆయన గత కొంతకాలంగా పాంక్రియాస్ కేన్సర్‌తో బాధపడుతున్నారు.
అమెరికా, ఎయిమ్స్, ముంబయిలోని ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందారు.
మోదీ ప్రభుత్వంలో పారికర్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం, 2017 మార్చిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవి ప్రమాణం చేశారు.
అంతకు ముందు 2000 నుంచి 2002 వరకు, 2002 నుంచి 2005 వరకు, 2012 నుంచి 2014 వరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఈయన ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికై 2014 నుంచి 2017 వరకు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఈయన 1955 డిసెంబరు 13న పనాజీకి 13 కిలోమీటర్ల దూరంలోని మాపుసలో జన్మించారు. 1978లో ఐఐటీ ముంబయిలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
- జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ: ‘‘ఈ రోజు నుంచి జనసైనికుడిని’’
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- టీడీపీ ఎన్నికల శంఖారావం: ‘కేంద్రం, కేసీఆర్ బెదిరింపులకు భయపడం’
- వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








