కరోనావైరస్: డయాబెటిస్, బీపీ, ఆస్తమా ఉన్నవారికి ఈ వైరస్ ప్రాణాంతకమా.. సోకితే ఏం చేయాలి

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ ఎవరికైనా వ్యాపించవచ్చు. కానీ, ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లేదా వయసు పైబడిన వారికి ఇది చాలా ప్రాణాంతకం.
‘ద లాన్సెట్ జర్నల్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం వృద్ధులు.. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారికి కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎక్కువ.
చైనాలో వుహాన్‌లోని రెండు ఆస్పత్రుల్లో ఉన్న 191 మంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. కరోనా వల్ల చనిపోయినవారు లేదా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారిపై ఈ పరిశోధనలు చేశారు.
వీరిలో 135 మంది జిన్‌జియాన్ ఆస్పత్రి, 56 మంది వుహాన్ పల్మనరీ ఆస్పత్రి రోగులు. వీరిలో 137 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవగా, మరో 54 మంది మృతి చెందారు.
రోగుల నుంచి సేకరించిన మొత్తం శాంపిళ్లలో 58 మందికి హైపర్‌టెన్షన్, 36 మందికి డయాబెటీస్, 15 మందికి హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నట్టు తేలింది.
ఈ 191 మంది రోగుల వయసు 18 నుంచి 87 ఏళ్ల మధ్యలో ఉంది. వీరిలో ఎక్కువ మంది పురుషులే.
ఈ పరిశోధనలో సీరియస్ వ్యాధులు, మరణానికి సంబంధించిన ప్రమాదాలను పరిశీలించారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌తో చనిపోయినవారిలో వృద్ధులున్నారు. ఆస్పత్రుల్లో చేర్చేటప్పటికే వారిలో సెప్సిస్(ఇన్ఫెక్షన్ వల్ల అవయవాలు పనిచేయడం మానేయడం) లక్షణాలు కనిపించాయి. వారికి హైబీపీ, డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నాయి.
అయితే, శాంపిల్ సైజ్ చిన్నది కావడం వల్ల పరిశోధన ఫలితాల వివరణ పరిమితం అయ్యుండొచ్చని పరిశోధకులకు అనిపిస్తోంది.
భారత్‌లో డయాబెటీస్ రోగుల సంఖ్య ఎక్కువ. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం భారత్‌లో 2019 నాటికి డయాబెటీస్ రోగుల సంఖ్య 7.7 కోట్లు. కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారికి డయాబెటీస్ కూడా ఉందని చెబుతున్నారు. అయితే అలా ఎంతమంది రోగులు ఉన్నారు అనే లెక్కలు అందుబాటులో లేవు.
గ్లోబల్ ఆస్తమా రిపోర్ట్-2018 ప్రకారం భారత్‌లోని 131 కోట్ల జనాభాలో 6 శాతం మంది పిల్లలకు, 2 శాతం వయోజనులకు ఆస్తమా ఉంది.
మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉండి, కరోనావైరస్ వస్తుందని భయంగా ఉంటే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Spl
ఎక్కువ ప్రమాదం ఎవరికి?
మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే, కరోనా వైరస్ ఇతరులతో పోలిస్తే త్వరగా వస్తుందని ఏం లేదు. కానీ ఒకసారి ఇన్ఫెక్షన్‌కు గురైతే, ఆ తర్వాత మీ పరిస్థితి మిగతా రోగుల కంటే సీరియస్‌గా ఉండచ్చు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వృద్ధులు, ఇప్పటికే శ్వాస సంబంధిత వ్యాధుల(ఆస్తమా)తో ఇబ్బంది పడుతున్నవారు, రోగనిరోధక శక్తి లేకపోవడం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు లాంటివి ఉన్నవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చాలామంది రోగులు కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత కరోనా ఇన్పెక్షన్ నుంచి కోలుకుంటారు. చాలా మందిలో ఇది తీవ్రం కావచ్చు. అరుదుగా దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉండచ్చు. దీని లక్షణాలు మిగతా వ్యాధుల్లాగే అనిపిస్తుంటాయి. అంటే దగ్గు-జలుబు, జ్వరం, శ్వాస ఇబ్బందులు లాంటివి ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తమా ఉంటే ఏం చేయాలి?
ఆస్తమా ఉన్నవారు డాక్టర్ సూచించిన ఇన్‌హేలర్ వాడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏదైనా వైరస్ నుంచి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మీ ఇన్‌హేలర్ ప్రతిరోజూ మీతోనే ఉంచుకోవాలి. మీకు ఆస్తమా పెరుగుతున్నట్టు అనిపిస్తే, మీకు కరోనావైరస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలి.
డయాబెటిస్ ఉంటే ఏం చేయాలి?
టైప్ వన్, టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారిలో కరోనావైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు.
"కరోనావైరస్ లేదా కోవిడ్-19 డయాబెటిస్ రోగుల్లో కాంప్లికేషన్స్ సృష్టించవచ్చు. మీకు డయాబెటీస్ ఉంటే, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటే, మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ సాయం తీసుకోవాలి" అన్నారు డయాబెటీస్ యూకే హెడ్ ఆఫ్ కేర్ డాన్ హావర్త్.

బ్రిటన్ ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ వయోవృద్ధులు తమకు తాముగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అని కొత్తగా సలహా ఇచ్చారు.
"పెద్ద వయసు వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబాలు, స్నేహితులు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వారి ఆరోగ్యం గురించి మీకు ఏదైనా సందేహం లేదా గందరగోళం ఉంటే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి" అని ఏజ్ యూకే చారిటీ డైరెక్టర్ కెరోలైన్ అబ్రహాం చెప్పారు.
ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే?
హై బ్లడ్ ప్రెజర్, శ్వాస సంబంధిత సమస్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనావైరస్ వల్ల కూడా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ వైరస్ గొంతు, శ్వాసనాళం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దాంతో, ఇప్పటికే ఏవైనా సమస్యలు ఉంటే, వాటికి చికిత్స తీసుకోవడం సవాలుగా మారుతుంది. ఒకవేళ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ సలహాలు తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
మీరు పొగతాగుతున్నారా?
ఎక్కువగా పొగతాగేవారు, ఈ వైరస్ ప్రమాదాన్ని తగ్గించడానికి పొగతాగడం వదిలేయాలని పబ్లిక్ హెల్త్ చారిటీ 'యాష్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ దెబోరాహ్ ఆర్నాట్ సూచించారు.
"పొగతాగేవారికి శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగనివారితో పోలిస్తే వీరికి న్యూమోనియా వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుంది. పొగతాగడం మానేయడం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కరోనావైరస్ ఈ సమస్య నుంచి ప్రేరేపితమై, పరిస్థితి తీవ్రం కాకముందే వారు పొగతాగడం వదిలేయడం మంచిది" అని అన్నారు.
శ్వాస తీసుకోగలిగేలా రోగికి సాయం చేయడం, శరీరం వైరస్‌తో సమర్థంగా పోరాడగలిగేలా వారి రోగనిరోధక శక్తిని పెంచడం అనే వాటిపై కరోనావైరస్‌కు చికిత్స ఆధారపడి ఉంటుంది.
భారత్‌లో ఇప్పటివరకూ 147 కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి. వీరిలో ముగ్గురు చనిపోయారు.
ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 146 దేశాలు ప్రభావితం అయ్యాయి. 1,53,648 ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు.


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలంగాణలో ఐదో కేసు, ఏపీలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్‌లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- భారత్‌లో తొలి కరోనా మరణం.. కర్నాటక వృద్ధుడి మృతి
- కరోనావైరస్: కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు.. దిల్లీలో సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు బంద్
- కరోనావైరస్‌కు హోమియోపతి మందు ఉందా-ఆయుష్ ప్రకటనతో అయోమయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









