కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్‌లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో 69 ఏళ్ల మహిళ కరోనావైరస్‌తో మరణించినట్లు పీటీఐ తెలిపింది. దీంతో భారత్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య రెండుకు చేరింది.

పశ్చిమ దిల్లీకి చెందిన ఈ మహిళ రామ్‌మనోహర్ లోహియా హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు దూరదర్శన్ ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అంతకుముందు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

"ప్రస్తుతం భారత్‌లో 81 కరోనావైరస్ కేసులు నిర్థరణయ్యాయి. వీరిలో కేరళకు చెందిన ముగ్గురు పూర్తిగా కోలుకుని హాస్పటల్ నుంచి విడుదలయ్యారు. దిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న మరో ఏడుగురు కోలుకున్నారు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

"ఇప్పటివరకూ 1199 శాంపిళ్లు ఇరాన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చాం. ఇరాన్‌లో ఉన్న 58 ప్రయాణికులను రప్పించేందుకు విమానం ఏర్పాటుచేశాం. ఈరోజు ముంబయిలో 44మంది ప్రయాణికులతో విమానం చేరింది. వారంతా ప్రత్యేక నిర్బంధ పర్యవేక్షణలో ఉన్నారు. మరో విమానం రేపు దిల్లీ రాబోతోంది. పరీక్షల్లో నెగటివ్ వచ్చిన భారతీయులను తిరిగి తీసుకువస్తాం. రోమ్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించాం. వారు శాంపిళ్లు సేకరిస్తారు.

ఇప్పటివరకూ భారత్‌లో 81 కరోనావైరస్ కేసులు నిర్థరణయ్యాయి. వీరిలో కేరళకు చెందిన ముగ్గురు పూర్తిగా కోలుకుని హాస్పటల్ నుంచి విడుదలయ్యారు. దిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న మరో ఏడుగురు కోలుకున్నారు.

ఆరోగ్య శాఖ

ఫొటో సోర్స్, ANI

మొత్తం 81 కేసుల్లో 54 మంది భారతీయులు, 16 మంది ఇటలీ దేశస్తులు, ఒకరు కెనడా దేశస్తుడు.

కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు మరణించారు. ఆయనకు ఆస్థమా కూడా ఉంది. కరోనావైరస్ కూడా పాజిటివ్ అని తేలింది.

కరోనావైరస్ ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రయాణాలు వాయిదావేసుకోవాలని ఇప్పటికే సూచించాం. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

కేంద్ర ప్రభుత్వం 37 అంతర్జాతీయ చెక్ పోస్టుల్లో కేవలం 19 చెక్ పోస్టుల ద్వారానే రవాణాను అనుమతించాలని నిర్ణయించింది. ఇది కేవలం స్క్రీనింగ్‌ను సమర్థంగా చేయడం కోసమే. దీంతోపాటు, సరిహద్దులు దాటి ప్రయాణించే రైళ్లను కూడా నిలిపివేస్తున్నాం" అని ఆరోగ్య శాఖ ప్రతినిధి వెల్లడించారు.

బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్‌లతో భారత్‌కు ఉన్న అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి ప్రయాణికుల రాకపోకలను మార్చి 15 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, iplt20.com

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లనూ కరోనావైరస్ కారణంగా రద్దుచేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే వర్షం కారణంగా ధర్మశాలలో గురువారం (మార్చి 12)జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లోని మిగతా రెండూ కూడా రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

కరోనావైరస్ దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌లపై కూడా పడింది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ భారీ క్రికెట్ ఈవెంట్‌ను ఏప్రిల్ 15కి వాయిదా వేసినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేది లేదని తేల్చి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

"ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ప్రజలందరి రక్షణ ముందు అందరికీ ముఖ్యమైన అంశం" అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్

మరోవైపు కరోనావైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం లేకుండా చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నారు.

మహారాష్ట్రలోని ముంబయి, నవీ ముంబయి, థానే, నాగ్‌పూర్, పింప్రి-చించవాడ్‌లలో ఉన్న సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ శనివారం అర్థరాత్రి నుంచి మార్చి 30 వరకూ మూసేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

పంజాబ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలను మార్చి 31 వరకూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఒడిశా ప్రభుత్వం కోవిడ్-19ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. మేరేజ్ రిసెప్షన్లు, మతపరమైన కార్యక్రమాలలో భారీ ఎత్తున ప్రజలు గుమిగూడకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

పరీక్షలు నిర్వహిస్తున్న స్కూల్స్ మినహా మిగతా పాఠశాలన్నీ మార్చి 31వరకు మూసివేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల చివరి వరకు స్విమింగ్ పూల్స్, జిమ్‌లు, సినిమా హాళ్లు కూడా మూసివేయిస్తున్న ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఒడిశా అసెంబ్లీని మార్చి 29 వరకు సస్పెండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఏప్రిల్ 8 వరకు జరగాల్సిన కేరళ అసెంబ్లీని శుక్రవారం నిరవధికంగా వాయిదా వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఉత్తరాంఖండ్‌లో మార్చి 31 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

జమ్ముకశ్మీర్‌లో అన్ని క్రీడా శిక్షణ కార్యక్రమాలను రద్దు చేశారు.

కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దిల్లీ హైకోర్టు తన కార్యకలాపాలను అత్యవసర అంశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. కక్షిదారులు కూడా అత్యవసరం అయితే తప్ప కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP

సరిహద్దులను మూసేసిన పాకిస్తాన్

అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా 15రోజుల పాటు పరిమితులు విధించింది.

దేశవ్యాప్తంగా స్కూళ్లను కూడా సెలవులు ప్రకటించింది.

15 రోజుల పాటు అన్ని సరిహద్దులను మూసి ఉంచాలని నిర్ణయించామని మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించారు.

అంతర్జాతీయ విమాన సర్వీసులు కేవలం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌ల నుంచి మాత్రమే ఉంటాయని తెలిపారు.

కరోనావైరస్ ప్రారంభమైన చైనా, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటైన ఇరాన్‌లతో పాకిస్తాన్ సరిహద్దులను పంచుకుంటోంది.

ఇప్పటివరకూ 21 నిర్థరిత కేసులు నమోదయ్యాయి, అయితే మరణాలు సంభవించలేదు.

విశాఖపట్నం

ఫొటో సోర్స్, Getty Images

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన 64 మందికి కరోనా లక్షణాలు

కరోనావైరస్ ప్రపంచ మహమ్మారిగా మారుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు 666 మంది కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

News image

కోవిడ్-19 అదుపు, నియంత్రణ, నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు శుక్రవారం ఉదయం ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు.. ఎంతమందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి.. ఎంతమందికి నిర్ధరణైంది వంటి వివరాలున్నాయి.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో తొలి పాజిటివ్ కేసు

ఆంధ్రలో మొదటి కరోనా కేసు నమోదయింది. ఇటలీ వెళ్లొచ్చిన నెల్లూరు వ్యక్తికి కరోనా రావడంతో ఆయన్ను ప్రభుత్వాసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ నెల ఆరవ తేదీన ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఒక నెల్లూరు వ్యక్తికి పొడి దగ్గు వచ్చింది. దీంతో ఆయన్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డులో ఉంచారు. తిరుపతి వైరాలజీ ల్యాబులో జరిగిన పరీక్షల్లో అతనికి కోవిడ్ 19 లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణయింది.

Sorry, your browser cannot display this map