టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి ఇజ్రాయెల్ సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

ఫొటో సోర్స్, Idf
ఇజ్రాయెల్ సైన్యంలోని చాలా మంది సైనికుల స్మార్ట్ ఫోన్లకు అమ్మాయిల ఫొటోలు పంపించిన హమాస్ మిలిటెంట్ సంస్థ, వాటిని హ్యాక్ చేసిందని ఆ దేశ ఆర్మీ చెప్పింది.
"మా సైనికులకు మొదట టీనేజీ అమ్మాయిల ఫొటోలు పంపించారు. ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునేలా వారిని ఊరించారు" అని సైనిక ప్రతినిధి చెప్పారు.
కానీ, ఆ అప్లికేషన్ తమ ఫోన్లను హ్యాక్ చేస్తుందని ఇజ్రాయెల్ సైనికులు తెలుసుకోలేకపోయారు. ఈ హ్యాకింగ్ వెనుక హమాస్‌కు సంబంధించిన వారు ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ ఆరోపించింది.
గాజాపై అదుపు సాధించిన మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య పురాతన శత్రుత్వం ఉంది.
"మా సైనికుల ఫోన్లను హ్యాక్ చేయడానికి హమాస్ మూడో ప్రయత్నం చేసింది. కానీ, అన్నిటికంటే ఇది అత్యాధునికమైనది" అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి కల్నల్ జోనాథన్ కార్నికస్ చెప్పారు.
వాళ్లు సరికొత్త సాంకేతికతను నేర్చుకుని, హ్యాకింగ్‌తో తమపై పైచేయి సాధించారని ఆయన తెలిపారు.
హమాస్ హ్యాకర్లు పొడిపొడిగా హిబ్రూ మాట్లాడే, వలస వచ్చిన యువతుల్లా నటించారని కల్నల్ కార్నికస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
కుట్ర గురించి ముందే తెలుసు: ఇజ్రాయెల్ సైన్యం
సైనికులతో స్నేహం చేసిన తర్వాత ఆ యువతులు వారికి కొన్ని లింక్స్ పంపించారు. వాటిని క్లిక్ చేస్తే పరస్పరం ఫొటోలు పంపించుకోవచ్చని చెప్పారు.
కానీ, అది నిజానికి ఒక వైరస్. స్మార్ట్ ఫోన్లను, సిస్టంలను హ్యాక్ చేసేంత ప్రమాదకరమైనది.
ఒక్కసారి క్లిక్ చేయగానే ఆ లింక్ స్మార్ట్ ఫోన్లలోని డేటా, లొకేషన్, ఫొటోల యాక్సెస్‌ను హ్యాకర్ల చేతికి అందిస్తుంది.
అంతే కాదు, ఆ తర్వాత హ్యాకర్లు సైనికుల ఫోన్‌ను తమ అదుపులోకి తీసుకోగలరు. ఫోన్ ఉపయోగించేవారికి తెలీకుండానే ఫొటోలు తీయచ్చు, వారి మాటలు రికార్డ్ చేయవచ్చు.
"ఈ కుట్ర గురించి మాకు నెలల క్రితమే తెలిసింది. మా నిఘాలో దానిని కొనసాగించాం. తర్వాత ఎక్కువ నష్టం జరగకముందే వాటిని ఆపివేశాం" అని కల్నల్ కార్నికస్ చెప్పారు.
స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేటపుడు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ఆర్మీ ఇంతకు ముందే తమ సైనికులను హెచ్చరించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దశాబ్దాలుగా ఘర్షణ జరుగుతోంది. రెండు ఒకదానిపై ఒకటి నిఘా పెట్టుకుంటున్నాయి. ప్రత్యర్థి వ్యూహాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:
- ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి?
- నాకు పెళ్లి వద్దు.. అంటార్కిటికా వెళ్తున్నా..
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









