సిరియాలోని ప్రభుత్వ బలగాలు, ఇరాన్ దళాలపై ‘విస్తృతంగా దాడులు’ చేశాం - ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AFP/Getty Images
సిరియాలోని ప్రభుత్వ బలగాలు, ఇరాన్ సంకీర్ణ దళాలకు చెందిన డజన్ల కొద్దీ లక్ష్యాలపై ‘విస్తృత స్థాయి దాడులు’ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఓ ఇరానియన్ యూనిట్ తమ దేశంపై చేసిన రాకెట్ల దాడులకు ప్రతీకారంగా సిరియాలో ఈ దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
మరోవైపు డమాస్కస్ మీదుగా వచ్చిన క్షిపణుల్లో చాలా వాటిని కూల్చేశామని, తమ పౌరులు ఇద్దరు మరణించారని సిరియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఇతర నివేదికలు సూచిస్తున్నాయి.
బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) 11 మంది ఫైటర్లు చనిపోయినట్లు తెలిపింది. వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది.
ఈ దాడులపై ఇరాన్ ఇంతవరకూ బహిరంగంగా స్పందించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

డమాస్కస్‌లో భారీ పేలుళ్ల చప్పుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
సిరియా నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపుగా వచ్చిన నాలుగు రాకెట్లను తాము ఛేదించామని, అవేవీ నేలను తాకలేదని మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడ ఇజ్రాయెల్ వందల సంఖ్యలో దాడులు చేసింది.
సిరియాలో ఇరాన్ సైనిక స్థావరం ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉద్యమానికి ఇరాన్ నుంచి ఆయుధాలు అందకుండా చేసేందుకు దానిని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటివరకూ సిరియాలో ఇజ్రాయెల్ చేసిన అతి పెద్ద దాడుల్లో ఇదొకటని బీబీసీ జెరూసలెం ప్రతినిధి బార్బరా ప్లెట్ ఉషెర్ చెప్పారు.
తమ విధానాలు మారుతున్నాయని గట్టి సంకేతాలు ఇచ్చేందుకు శక్తిమంతమైన ప్రతీకార దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు చెప్పారు.
సిరియా నుంచి ఏ చిన్న దాడి జరిగినా, ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించే పరిస్థితులు ఉన్నాయని బీబీసీ ప్రతినిధి అంటున్నారు.
ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ , సిరియా సాయుధ బలగాలపై ఏయే ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డామన్న వివరాలను బుధవారం ఉదయం ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) ట్విటర్‌లో పంచుకున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

‘‘ఇరాన్, సిరియన్ ఉగ్రవాద లక్ష్యాలపై మేం దాడి చేస్తున్న సమయంలో, మేం చేసిన హెచ్చరికలను లెక్క చేయకుండా సిరియా గగనతల రక్షణ క్షిపణిని ప్రయోగించింది. ఫలితంగా సిరియా గగనతల రక్షణ బ్యాటరీలు ధ్వంసమయ్యాయి’’ అని ఐడీఎఫ్ తెలిపింది.
‘‘సిరియా భూభాగంలో జరిగే కార్యకలాపాలకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత. ఇజ్రాయెల్‌పై మళ్లీ దాడులు జరగకుండా చూసుకోవాలని వారిని హెచ్చరిస్తున్నాం’’ అని పేర్కొంది.
ఖుద్స్ ఫోర్స్ ఇరాన్ సాయుధ దళం ఇస్లామిక్ రెవెల్యూషన్ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)లో ఓ విభాగం. ఇది విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఖుద్స్ ఫోర్స్‌లో దాదాపు 5 వేల మంది సిబ్బంది ఉన్నట్లు అమెరికా సైన్యం ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. అమెరికా దీన్ని ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’ (ఎఫ్‌టీఓ)గా గత ఏప్రిల్‌లో గుర్తించింది. ఒక దేశ ప్రభుత్వ విభాగాన్ని ఆ దేశం ఎఫ్‌టీఓగా ప్రకటించడం అదే తొలిసారి.
రష్యా సేనల మోహరింపులు ఉన్న చోట్ల ఉన్న ఎస్-300 క్షిపణి వ్యవస్థలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోలేదని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు అనుకూలంగా రష్యా సేనలు సిరియాలో పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులను రష్యా ఖండించింది.
రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలో చాలా వరకూ సిరియా గగనతలం కూడా వస్తుంది. అయితే, ఇరాన్, దాని మిత్ర పక్షాలపై ఇజ్రాయెల్ చేపట్టే దాడుల్లో రష్యా జోక్యం చేసుకోవడం లేదు.
రష్యా నాయకులకు ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలున్నాయి. దాడులు చేపట్టే ముందే రష్యా సైన్యానికి ఇజ్రాయెల్ సైన్యం సమాచారం ఇస్తూ ఉంటుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
- సౌదీ ప్రిన్స్: 'ఇరాన్ దూకుడుని ఆపకపోతే... చమురు ధరలు చెలరేగిపోతాయి'
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- యెమెన్ యుద్ధం: వేలాది సౌదీ సైనికులను పట్టుకున్నామన్న హౌతీ తిరుగుబాటుదారులు
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- టర్కీ బహిష్కరించిన ఐఎస్ జిహాదీల పరిస్థితి ఏమిటి... తమ దేశం వద్దంటే వారు ఎటు పోవాలి?
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- బగ్దాదీ అక్కను నిర్బంధించిన టర్కీ.. ఐఎస్ రహస్యాలు తెలిసేనా?
- మొబైల్ డేటా రేట్లు పెంచనున్న రిలయన్స్ జియో.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలోనే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








