హిట్లర్ పుట్టిన ఇంట్లో పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, Getty Images
నాజీ నేత, నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీసు స్టేషన్‌గా మార్చనున్నారు. ఆస్ట్రియాలో ఉన్న ఈ ఇల్లు నాజీయిజానికి ఏమాత్రం స్మృతి చిహ్నం కాదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వోల్ఫ్‌గాంగ్ పెషార్న్ అన్నారు.
హిట్లర్ తన జీవితంలోని మొదటి కొన్ని వారాలను 'బ్రౌనౌ ఆమ్ ఇన్' పట్టణంలోని 17 వ శతాబ్దానికి చెందిన భవనంలోని ఒక ఫ్లాట్‌లో గడిపారు.
ఈ ఫ్లాట్‌పై సుదీర్ఘకాలంగా వివాదం ఉంది. దాని పాత యజమాని నుంచి ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఫార్ రైట్ వర్గాల వారికి ఇది సందర్శన స్థలంగా మారకుండా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు ఇందులో దివ్యాంగులకు డే కేర్ సెంటర్ నిర్వహించేవారు. కానీ, దీన్ని వీల్ చెయిర్ ఫ్రెండ్లీగా మార్చాలన్న సెంటర్ నిర్వాహకులు ప్రయత్నాలకు ఇంటి యజమాని అభ్యంతరం చెప్పడంతో ఆ కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించారు.
అనంతరం 2014 దీన్ని శరణార్థులకు ఆవాసంగా మార్చాలనుకున్నారు కానీ అదీ జరగలేదు.
2016లో ప్రభుత్వం దీన్ని 8,97,000 డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఇంటిపై ఆస్ట్రియా ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దీన్ని కూల్చివేయాలని కొందరు.. ధార్మిక కార్యకలాపాలకు వినియోగించాలని మరికొందరు వాదిస్తుంటారు.
ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రి వోల్ఫ్‌గాంగ్ పెషార్న్ మంగళవారం మాట్లాడుతూ.. ఇది పోలీస్ స్టేషన్‌గా మారాక జాతీయ సామ్యవాదానికి ఇకపై ఎంతమాత్రం జ్ఞాపకంగా ఉండబోదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బ్రౌనౌ ఆమ్ ఇన్'లో హిట్లర్ 1889లో ఏప్రిల్ 20న జన్మించారు. ఆయన జన్మించాక ఆ ఇంట్లో కొన్ని వారాల పాటు ఉన్నాక అతని తండ్రి వేరొక ఇంటికి కుటుంబాన్ని మార్చారు.
హిట్లర్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం బ్రౌనౌ ఆమ్ ఇన్ పట్టణం నుంచి వెళ్లిపోయింది.
హిట్లర్ నాయకత్వంలోని నాజీ జర్మనీ ఆస్ట్రియాను కలుపుకొన్నాక 1938లో ఆయన వియన్నా వెళ్తూ 'బ్రౌనౌ ఆమ్ ఇన్'లో ఆగారు.
1943 నుంచి 45 మధ్య హిట్లర్ పాలనలో జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించింది. 60 లక్షల మంది యూదులు.. ఇతర పోరాటయోధులు, పౌరులు లక్షలాది మంది ఆ సమయంలో బలయ్యారు.
ఇవి కూడా చదవండి.
- రెండో ప్రపంచ యుద్ధం నాటి ‘జర్మన్ గర్ల్స్’కు నార్వే ప్రధాని క్షమాపణ
- మొదటి ప్రపంచ యుద్ధాన్ని రంగుల్లో చూడండి...
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- పపువా న్యూ గినీ: చైనా అమ్ముల పొదిలో కొత్త అస్త్రం?
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- హిట్లర్ ఆరాధనలో మునిగితేలిన హిందూ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








