మొదటి ప్రపంచ యుద్ధాన్ని రంగుల్లో చూడండి...

మానవాళి చూసిన భయంకరమైన పోరాటాలలో మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి. ఎన్నో లక్షల మంది సైనికుల ఈ యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ యుద్ధానికి సంబంధించిన అరుదైన బ్లాక్ అండ్ వైట్ మూకీ దృశ్యాలను లండన్‌లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో భద్రపరిచారు.
ఇప్పుడు ఆ దృశ్యాలకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రంగులు అద్దారు. హాలీవుడ్‌లో 'లార్డ్ అఫ్ ది రింగ్స్' లాంటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాలు రూపొందించి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ పీటర్ జాక్సన్ మొదటి ప్రపంచ యుద్ధాన్ని మన కళ్ళ ముందుకు రంగుల్లో తీసుకొచ్చారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లో విద్యార్థులు కోసం ప్రదర్శించబోయే ఈ చిత్రంలోని హైలైట్స్ ఒక సారి చూడండి.
''మొదటి ప్రపంచ యుద్ధం అంటే నలుపు తెలుపు దృశ్యాలే. కానీ, యుద్ధం బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో జరగలేదు. సైనికులు ఏ విధంగా కదనరంగంలో పరిస్థితులను చూశారో అదే అనుభూతిని వీక్షకులకు కూడా అందించాలన్నది మా ప్రయత్నం వెనుక ఉద్దేశం. సైనికులకు యుద్ధ రంగం, అక్కడి పరిస్థితులన్నీ సహజమైన రంగులలోనే కనిపించింది తప్ప బ్లాక్ అండ్ వైట్ లో కాదు.'' ఈ ప్రాజెక్టు గురించి దర్శకుడు పీటర్ జాక్సన్ బీబీసీకి చెప్పారు.
ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ నాటి యుద్ధానికి సంబంధించినదే తప్ప నాటకీయంగా రంగులద్ది చిత్రాన్ని రూపొందించలేదని అన్నారు.
నిజంగా యుద్ధం జరుగుతున్నపుడు సౌండ్ రికార్డిస్ట్ అక్కడే ఉండి రికార్డ్ చేశారా ..! అన్నట్టుగా ధ్వనిని జోడించామని తెలిపారు.
''న్యూజిలాండ్ సైన్యం సహాయంతో లైవ్ ఫైరింగ్ రికార్డ్ చేశాం. ఇందులో కనిపించే షెల్స్ శబ్దాలు, నిజమైన షెల్స్ నుంచి వచ్చినవే.'' అని తెలిపారు.
వీటిని చిన్నారులకు చూపిస్తే చరిత్రను తెలుసుకుని స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









