టర్కీ బహిష్కరించిన ఐఎస్ జిహాదీల పరిస్థితి ఏమిటి... తమ దేశం వద్దంటే వారు ఎటు పోవాలి?

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ పౌరులను టర్కీ బహిష్కరించడం మొదలుపెట్టింది. కొన్ని యూరోపియన్ దేశాలు తమ పౌరులను తిరిగి తీసుకోడానికి ఇష్టపడకపోయినప్పటికీ టర్కీ తన పని తాను చేస్తోంది.
తమ దేశం నుంచి వెళ్లి జిహాదీ గ్రూప్‌లో చేరిన పౌరులు తిరిగి స్వదేశం రాకుండా ఉండేందుకు వీలుగా జర్మనీ, డెన్మార్క్, ఇంగ్లండ్ దేశాలు వారి పౌరసత్వాన్ని రద్దు చేశాయి.
మరోవైపు, జర్మనీ, డేన్స్, ఫ్రెంచ్, ఐరిష్ జాతీయులతో సహా 20 మందికి పైగా యూరోపియన్లను తిరిగి పంపించే పనిలో ఉన్నట్లు టర్కీ వెల్లడించింది.
అయితే, టర్కీ నుంచి బహిష్కరణకు గురైన వారి పరిస్థితి ఏమిటి? వారికి ఏం జరుగుతుంది?
టర్కీ స్థితి ఏమిటి?
వందలాది విదేశీ ఫైటర్లు టర్కీ జైళ్లలో మగ్గుతున్నారని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పారు.
విదేశీ మిలిటెంట్లను వారి దేశాలకు పంపిస్తామని, ఆ దేశాలు వారి పౌరసత్వం రద్దు చేసినప్పటికీ వారిని స్వదేశాలకు పంపిస్తామని టర్కీ ప్రభుత్వం ఇటీవల పేర్కొంది.
''ఇప్పుడు ప్రపంచం ఒక కొత్త పద్ధతితో వస్తోంది. మిలిటెంట్ల పౌరసత్వాన్ని రద్దు చేస్తోంది'' అని టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయిలు చెప్పారు.
''వారు ఎక్కడైతే పట్టుబడ్డారో అక్కడే విచారణ ఎదుర్కోవాలని కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఇదో కొత్త రకం అంతర్జాతీయ చట్టంగా రూపొందింది. దీనిని ఆమోదించడం సాధ్యం కాదు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
విదేశీయులతో వ్యవహరించే విధానం ఏమిటి?
విదేశాలలో ఉన్న పౌరులు దౌత్య సహాయం పొందటానికి అర్హులు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్ (ఐసీఆర్‌సీ) వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్బంధంలో ఉన్నవారిని గుర్తించి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాయి.
అయితే, సిరియాలో క్యాంపు విషయానికి వస్తే, ఇందులోని ఐఎస్ సభ్యులు, వారి కుటుంబాలను అధికారులు సంప్రదించడం చాలా ప్రమాదకరమని కొన్ని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి.
మరోవైపు, టర్కీ వెనక్కి పంపినవారిని తన దేశంలోనే అదుపులోకి తీసుకుందా లేక సిరియా భూభాగంలోనా అనేదానిపై స్పష్టత లేదు.
కొన్ని యూరోపియన్ దేశాలు ఐఎస్‌లో చేరిన పౌరులను తిరిగి తీసుకోవటానికి ఇష్టపడలేదు. ప్రజల అభిప్రాయం, ఈ పౌరులతో వ్యవహరించే చట్టపరమైన సవాళ్ల గురించి ఆందోళన చెందుతున్నాయి.
కానీ, దేశాలు తమ పౌరులు ఎక్కడున్నా వారి గురించి బాధ్యత వహించాలని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది.
''అంతర్జాతీయ స్థాయి నేరాలు కానట్లయితే, వారిని తిరిగి స్వదేశానికి రప్పించాలి'' అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్ మిచెల్లీ బచిలెట్ తెలిపారు.
అంతర్జాతీయ చట్టం ప్రకారం, పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయడం చట్టవిరుద్ధం, అలా చేస్తే వారు దేశంలేనివారు అవుతారు.

ఫొటో సోర్స్, Reuters
టర్కీ నుంచి బహిష్కరణకు గురైనవారి పరిస్థితి ఏమిటి?
జర్మనీ, డెన్మార్క్, అమెరికాకు చెందిన ముగ్గురు ఐఎస్ జిహాదీలను నవంబర్ 12న టర్కీ తమ దేశం నుంచి బహిష్కరించింది.
ఇంకా చాలా మందిని స్వదేశానికి పంపివేయనున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.
అమెరికాకు తిరిగి వెళ్లాలని లేని ఆ దేశ పౌరుడు గ్రీస్ భూ సరిహద్దులో చిక్కుకుపోయారు. అమెరికా వెళ్లడం కంటే గ్రీస్‌లోనే ఉండాలని అతను కోరుకుంటున్నారు. కానీ, గ్రీస్ అతనిని తమ దేశంలోకి అనుమతించడానికి నిరాకరిస్తోంది. ప్రస్తుతం అతను టర్కీ అదుపులో ఉన్నట్లు తెలిసింది.
సిరియా, ఇరాక్ భూభాగం లోపల పట్టుబడిన తమ పౌరులను స్థానికంగానే విచారించాలని ఫ్రాన్స్ పట్టుబడుతోంది. ఈ ఏడాది మొదట్లో నలుగురు ఫ్రెంచ్ పౌరులకు ఇరాక్ మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి.
టర్కీతో 2014లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తమ పౌరులైన అనేక మంది జిహాదీలను ఫ్రాన్స్ వెనక్కి రప్పించుకుంది. వారు ఫ్రెంచ్ గడ్డపై అడుగుపెట్టిన తర్వాతే అరెస్టు చేసింది.
కొన్ని దేశాలు ఐఎస్ సభ్యులను తిరిగి తమ దేశం రాకుండా నిరోధించడానికి వారి పౌరసత్వాన్ని రద్దు చేశాయి. ఉదాహరణకు, సిరియాలోని ఒక క్యాంపులో ఉన్న షమీమా బేగం విషయంలో ఇంగ్లండ్ ఇదే పనిచేసింది.
ఆమె తన తల్లి ద్వారా బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని పొందగలదనే నమ్మకంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ దీన్ని ఖండించింది. ఆమె బాధ్యత ఇంగ్లండ్‌దేనని నొక్కి చెప్పింది.
టర్కీ తమ దేశంలో ఉన్న విదేశీయులను బహిష్కరిస్తే, స్వదేశాలు వారిని తిరిగి తీసుకోకపోతే లేదా ఆ వ్యక్తులు స్వదేశానికి వెళ్లాలని అనుకోకపోతే వారి పరిస్థితి ఏమిటి? వారు ఎక్కడ ఉండాలి?
ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
యూరోపియన్ దేశాలు వారి పౌరులైన జిహాదీ ఫైటర్లను వెనక్కి రప్పించుకోవడం లేదని విమర్శించిన అమెరికా, వారి పౌరులైన ఐఎస్ సభ్యులతో మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య తీర్పుపై ఐదు ప్రశ్నలు
- అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ
- కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?
- 'అయోధ్య పీటముడిలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చిక్కుకుపోయింది’
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








