అంగట్లో దొరికిన గాంధీజీ అరుదైన చిత్రాలు

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

ఫొటో క్యాప్షన్, ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

గాంధీజీ దండి యాత్రను ప్రారంభించినప్పుడు ఆ చారిత్రాత్మక సందర్భాన్ని రిపోర్ట్ చేయడానికి ప్రపంచం నలుమూలల ఉన్న జర్నలిస్టులు సబర్మతిలో ఉన్న సత్యాగ్రహ ఆశ్రమానికి తరలివచ్చారు.

అక్కడే 27 ఏళ్ల ఛగన్‌లాల్ జాదవ్ కూడా ఉన్నారు. చారిత్రక దండి యాత్రను చిత్రాల రూపంలో డాక్యుమెంట్ చేసింది ఆయనే.

ఛగన్‌లాల్ జాదవ్ చిత్రాలు ప్రస్తుతం పుస్తకంగా ప్రచురితమయ్యాయి.

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

ఈ చిత్రాలు ఎక్కడ దొరికాయి?

గాంధీ, ఛగన్‌లాల్‌కు సంబంధించిన ఈ చిత్రాలు నాకు అహ్మదాబాద్‌లోని గుజరీ బజార్‌లో నిర్వహించే వారాంతపు సంతలో దొరికాయి. అవన్నీ దండి యాత్రను వివరించే చిత్రాలు.

వాటిని ఆ అంగట్లో చూడగానే ఆశ్చర్యపోయాను. ఆ చిత్రాలను చూస్తే గాంధీ శకం వచ్చినట్లు అనిపించింది.

ఛగన్‌లాల్ కుంచె నుంచి శోక్ ధరా, ప్రకాశ్, ప్రతి, గుణహిత్, విశ్వరూపం, నిర్ణయ్ క్షణ్, మంగళ్ ప్రభాత్ తదితర ఎన్నో చిత్రాలు జాలువారాయి. అవన్నీ ప్రపంచంలోని వివిధ మ్యూజియంలో, ఆర్ట్ గ్యాలరీల్లో భద్రపరిచిఉన్నాయి.

అయితే, ప్రపంచం ఆయన సృష్టించిన కొన్ని చిత్రాలను చూడలేకపోయింది.

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

ఈ చిత్రాల పుస్తకం గుజరీ బజార్‌లో దొరికింది అని తెలియగానే ప్రసిద్ధ రచయిత నిరంజన్ భగవత్ ఆశ్చర్యపోయారు.

''ఓహ్, ఈ చిత్రాలు దండి యాత్రకు సంబంధించినవి. ఛగన్‌లాల్ చాలా సార్లు ఎంతో ఆసక్తితో వీటి గురించి నాకు చెప్పారు'' అని అన్నారు.

ఈ చిత్రాలు చూడగానే ఛగన్‌లాల్ శిష్యుడు అమిత్ అంబాలాల్ గత స్మృతుల్లోకి వెళ్లారు. ''ఈ చిత్రాలతో కూడిన డైరీని నేను ఆయన దగ్గర చూశాను. ఒక వేళ మీకు ఆ డైరీ దొరికితే మరింత ఎక్కువ సమాచారం దొరుకుతుంది.'' అని చెప్పారు.

దండి యాత్రను నిర్వహించే 'అరుణోదయ టుక్టీ' సంస్థలో ఛగన్‌లాల్ సభ్యుడు. అందుకే, ఈ చారిత్రక ఘటనను చిత్రీకరించే అవకాశం ఆయనకు వచ్చింది.

అంత్యోదయ రాత్రి పాఠశాలను ఏర్పాటు చేస్తానని గాంధీ అస్సలు అనుకోలేదు. ఆ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థే ఛగన్‌లాల్.

సత్యాగ్రహ ఆశ్రమంలోని ఓ మంచి నీటిబావిలో నీటిని తోడుకునేందుకు 11 సెప్టెంబర్ 1915న దళితులకు ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా ఆశ్రమం దగ్గర్లో ఉన్న కొచ్రబ్ గ్రామంలో రాత్రి పాఠశాలను గాంధీజీ ఏర్పాటు చేశారు.

ఛగన్‌ జాదవ్ దళిత విద్యార్థి, 12 ఏళ్ల వయసులో తన ఊరు వడాజ్ నుంచి నాలుగైదు కిలోమీటర్లు ఉన్న కొచ్రబ్‌లో రాత్రి పాఠశాలకు వెళ్లేవారు.

ఈ రాత్రి పాఠశాలకు పరిక్షిత్‌లాల్ మజుందార్ టీచర్‌గా పనిచేసేవారు. ఛగన్‌కు పాఠాలు చెప్పింది ఈయనే. గాంధీ మార్గదర్శకత్వంలోనే ఛగన్ పెరిగి పెద్దవాడయ్యారు.

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

గుజరాత్ విద్యాపీఠ్ గుమస్తాగా ఛగన్‌ను నియమించింది గాంధీనే. ఛగన్ సృజనాత్మకతను కూడా మహాత్ముడు గుర్తించారు.

అయితే, కొన్నాళ్లకు ఉన్నత చదువుల కోసం ఛగన్ ఉద్యోగాన్ని వదిలివేశారు. తర్వాత అదే రాత్రి పాఠశాలలో టీచర్‌గా చేరారు.

ఛగన్ శిక్షణపొందిన చిత్రకారుడు కాదు. అయితే, అతని సామర్థ్యాన్ని గుర్తించిన మహాత్ముడు గుజరాత్ విద్యాపీఠ్‌ నుంచి ఆయనకు ఉపకారవేతనాన్ని ఇప్పించారు.

గుజరాత్ విద్యాపీఠ్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు కను దేశాయి వద్ద నేర్చుకునే అవకాశం ఛగన్‌కు దక్కింది. ఆర్ట్ గురు రవిశంకర్ రావల్‌కు కూడా ఛగన్‌ను గాంధీ పరిచయం చేశారు.

ఛగన్‌ వేసిన కొన్ని చారిత్రక చిత్రాలు

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

  • దండి యాత్ర కోలాహలం, 1930
  • నవస్రీ, దండి, కరాబి శిబిరాలు.
  • గాంధీ చేసిన జలయాత్ర -1932
  • జైల్లో సత్యాగ్రహి జీవిత చరిత్ర
  • మహాత్ముడు ఆశ్రమాన్ని వదిలివెళుతున్న సమయంలో చిత్రించినవి. 1933
  • హరిపురాలో నేతాజీ నాయకత్వంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం 1938

తదితర చారిత్రక ఘటనలకు సంబంధించిన చిత్రాలను ఛగన్ వేశారు.

చిత్రాలన్నీ కలపి పుస్తకంగా..

ఛగన్‌లాల్ చిత్రించిన గాంధీ చిత్రం

ఫొటో సోర్స్, Dr. Rizwan kadari

ఫొటో క్యాప్షన్, ఛగన్‌లాల్ వేసిన గాంధీ రేఖాచిత్రాల సంకలనం

నవీన గుజరాత్ ఉద్యమ పితామహుడిగా ఛగన్‌లాల్ సుపరిచితం. అతని కాలంనాటి చిత్రకారులు ఆయనను ఛగన్ కాకా అని ముద్దుగా పిలిచేవారు.

గాంధీ స్మృతులను తన చిత్రాలలో బంధించిన ఛగన్ 12 ఏప్రిల్ 1978లో తన 82వ ఏట చనిపోయారు.

ఈ చిత్రాల పుస్తకంలో 1930 నుంచి 1938 వరకు జరిగిన స్వతంత్ర ఉద్యమాలకు సంబంధించిన చిత్రాలను చూడొచ్చు.

'అన్‌సీన్ డ్రాయింగ్స్ ఆఫ్ దండి యాత్ర' పుస్తకంలో ఈ చిత్రాలు భాగంగా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని 1915లో అంత్యోదయ రాత్రి పాఠశాలలో గాంధీజీ ఆవిష్కరించారు.

ఇది కేవలం స్కెచ్ బుక్ కాదు. స్వతంత్ర పోరాటంలోని చారిత్రక సన్నివేశాల సంకలనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)