'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్‌ను యూదు జాతి దేశంగా పేర్కొనే ఓ వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై పార్లమెంటులో అరబ్ ఎంపీలు మండిపడ్డారు.
బిల్లు ఆమోదాన్ని 'నిర్ణయాత్మక పరిణామం'గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. 122 ఏళ్ల క్రితం ఆధునిక జియోనిజమ్ వ్యవస్థాపకుడు థియోడర్ హెర్జ్ కన్న కల ఈ చట్టంతో సాకారమైందని వ్యాఖ్యానించారు. ''ఇజ్రాయెల్ యూదు జాతి ప్రజల దేశం. పౌరులందరి హక్కులను ఇజ్రాయెల్ గౌరవిస్తుంది'' అని ప్రధాని చెప్పారు.
'ద బేసిక్ లా: ఇజ్రాయెల్ యాజ్ ద నేషన్ స్టేట్ ఆఫ్ ద జ్యూయిస్ పీపుల్' పేరుతో తెచ్చిన ఈ చట్టం ఇజ్రాయెల్ ప్రప్రథమంగా, ప్రధానంగా యూదు దేశమని చెబుతోంది. ఇజ్రాయెల్ యూదుల నివాసమని పేర్కొంటోంది. ఇజ్రాయెల్ యూదు దేశమనే ప్రతిపాదన ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఒక కీలక వివాదం. ఈ అంశానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్ సంపూర్ణ, ఐక్య రాజధాని జెరూసలెమేనని ఈ చట్టంలో ఇజ్రాయెల్ మరోసారి ఉద్ఘాటించింది. జెరూసలెంపై ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఉంది. ఈ నగరంలో తమ భూభాగం కూడా ఉందని, తమ భావి రాజధాని ఇదేనని పాలస్తీనా వాదిస్తోంది.
ఇజ్రాయెల్‌లో అరబ్ మైనారిటీలు తాము వివక్షకు గురవుతున్నామని ఎంతో కాలంగా భావిస్తున్నారు. కొత్త చట్టంతో వారిలో ఈ భావన మరింతగా పెరిగిపోయే ఆస్కారముంది. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు కాగా, ఇందులో 20 శాతం మంది అరబ్‌లు.
హిబ్రూకు పెద్దపీటపైనా వివాదం
ఈ చట్టంలో అరబిక్ కంటే హిబ్రూకు పెద్దపీట వేసే అంశం కూడా వివాదాస్పదం అయ్యింది. ఇజ్రాయెల్‌లో దశాబ్దాలుగా హిబ్రూతోపాటు అరబిక్ అధికార భాషగా ఉంది. అయితే ఈ చట్టం 'హిబ్రూ'ను మాత్రమే దేశ భాషగా గుర్తిస్తోంది. అరబిక్‌కు 'ప్రత్యేక హోదా' కల్పిస్తోంది. అరబిక్ ప్రాధాన్యాన్ని తగ్గించడం లేదని ఈ చట్టం చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
తొలిసారిగా 2011లో పార్లమెంటులోకి బిల్లు
ఇజ్రాయెల్‌కు 'యూదు దేశం' హోదాను కల్పించే అంశం చాలా కాలంగా రాజకీయంగా వివాదాస్పదమైనది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఇజ్రాయెల్ యూదుల దేశమని, ఈ దేశం ఏర్పడటానికి మూలమైన మౌలిక భావనలకు ముప్పు ఎదురవుతోందని, భవిష్యత్తులో ఈ భావనలకు ప్రాధాన్యమే లేకుండా పోవచ్చని ఇజ్రాయెల్‌లోని కొందరు యూదు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెలీ అరబ్బుల్లో జననాల రేటు ఎక్కువగా ఉండటంపైనా కొందరు యూదుల్లో ఆందోళన ఉంది.
ఇప్పుడు ఆమోదం పొందిన బిల్లును పార్లమెంటులో తొలిసారిగా 2011లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. పలు సవరణలు జరిగాయి. ఇజ్రాయెల్‌లో యూదులు కానివారిపై వివక్ష చూపే నిబంధనలను తొలగించడం లేదా వాటి తీవ్రతను తగ్గించారు.
ఇజ్రాయెల్‌కు లిఖిత రాజ్యాంగం లేదు. అవసరమైనప్పుడు రాజ్యాంగ హోదా ఉండే ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు తీసుకొస్తుంటుంది. ఈ చట్టాన్ని 'బేసిక్ లా' అంటారు. ఇప్పుడు తెచ్చిన చట్టం 14వ బేసిక్ లా.
ఇవి కూడా చదవండి:
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. నేడు అమ్మగా మరో ఫైనల్లో
- ఇరాన్‌పై ఆంక్షలు: ఈయూ కంపెనీలకు మినహాయింపుల్లేవ్..
- అణు ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా: ఇప్పుడేం జరుగుతుంది?
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
- కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- బ్రిటన్: పార్లమెంటు సభ్యులకు ‘కొత్త ప్రవర్తనా నియమావళి’.. ఎంపీల సభ్యత్వం రద్దుకు ప్రతిపాదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








