ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

గుడ్డు ఎంత మేలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ వారం చదవాల్సిన ముఖ్యమైన, ఆసక్తికర 5 కథనాలివి. మీరు చదవకపోతే వెంటనే చదవండి.

1. గుడ్డు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన 5 విషయాలు

పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునే వారికి వైద్యులు సూచించే పదార్థాల్లో గుడ్డు ఒకటి. ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో కోడి గుడ్డు వినియోగం మీద నేటికీ కొద్దిమంది నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గుడ్డు తినడం వల్ల ఏం ఉపయోగం? గుడ్డులో ఏ భాగం తినాలి? ఎప్పుడు తినాలి? అసలు గుడ్డులో ఏముంటాయి? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి.

గుడ్డు గురించి తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివి.

జనరిక్ మెడిసిన్

ఫొటో సోర్స్, FACEBOOK/PMBJPPMBI

2. ఈ కేంద్రాల్లో 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే మందులు దొరుకుతాయి

జ్వరం వస్తే చాలా మంది మెడికల్ షాపుకెళ్లి డోలో 650నో, క్రోసిన్ 650 టాబ్లెట్లో తెచ్చుకుని మింగేస్తుంటారు.

కానీ 'పారాసెటమాల్ 650' పేరుతో కూడా ట్యాబ్లెట్లు దొరుకుతాయి.

ఈ మూడింట్లో ఉండేది ఒకటే మందు. డోస్ కూడా సేమ్. ధరలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది.

15 ట్యాబ్లెట్లు ఉండే డోలో 650 స్ట్రిప్ ధర సుమారు 30 రూపాయలు. 10 ట్యాబ్లెట్ల క్రోసిన్ 650 స్ట్రిప్ ధర సుమారు 20 రూపాయలు ఉంటుంది.

కానీ నాలుగున్నర రూపాయలకే పది పారాసెటమాల్‌ 650 ట్యాబ్లెట్లు లభిస్తున్నాయి.

ఎందుకంటే పారాసెటమాల్‌ 650 అనేది జనరిక్ మెడిసిన్. ఇదొక్కటే కాదు కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయి.

ఆవు తేన్పులు

ఫొటో సోర్స్, Getty Images

3. ఆవు తేన్పుల మీద పన్ను, ఎక్కడ, ఎందుకు?

మీ దగ్గర ఒక ఆవు ఉంది అనుకోండి.

అది తేన్చినప్పుడు పన్ను కట్టాల్సిందే అంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తే ఎలా ఉంటుంది?

వినడానికే కొంచెం వింతగా... మరి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా!

నయనతార, విఘ్నేష్ శివన్

ఫొటో సోర్స్, INSTAGRAM/NAYANTHARAOFFICIIAL

4.నయనతార తల్లి కావడంపై వివాదం ఏంటి?

సినీ నటి నయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు తాము తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించారు. దీనిపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

''నయనతార, విఘ్నేశ్ శివన్‌లు పెళ్లి తర్వాత ఇంత తక్కువ సమయంలోనే తల్లిదండ్రులు ఎలా అయ్యారు? వారు చట్టంలోని నిబంధనల ప్రకారమే నడుచుకున్నారా? దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఎంఎస్) ద్వారా వివరణ కోరతాం'' అని తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి అన్నారు.

అసలు ఈ వివాదం ఏంటి.. సరోగసి నిబంధనలు ఏం చెబుతున్నాయి?

కేటీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KTR

5. 'హిందీని రుద్దకండి... మరొక భాషా యుద్ధానికి తెరతీయకండి...' కేంద్రానికి కేటీఆర్, స్టాలిన్ హెచ్చరిక

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కమిటీ, హిందీ భాష మీద చేసిన సిఫారసులు వివాదంగా మారుతున్నాయి.

ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిత్ షా కమిటీ సిఫారసులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

దేశంలోని అన్ని భాషల్లో హిందీ కూడా ఒకటని దాన్ని బలవంతంగా రుద్దడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)