బిహార్: సీఎం పదవికి నితిశ్ కుమార్ రాజీనామా, ఎన్డీఏకు గుడ్ బై... ఇప్పుడేం జరుగుతుంది?

ఫొటో సోర్స్, ANI
బిహార్‌లో ఎన్డీయే ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా కలిసి పోటీ చేసిన బీజేపీ, జేడీయూల మధ్య మరోసారి దూరం పెరిగింది. జేడీయూ ఇప్పుడు ఆర్జేడీకి చేరువైంది.
నితీశ్ కుమార్ రాజీనామాతో ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో నంబర్ గేమ్ మొదలైంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్న ప్రత్యర్ధులైన పార్టీలన్నీ నితీశ్ కుమార్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నితీశ్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను కలిశారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీశ్ కుమార్ నేరుగా తేజస్వి యాదవ్ ఇంటికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రబ్రీదేవి నివాసానికి బయలుదేరారు. తేజస్వి యాదవ్ తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను నితీశ్ కుమార్‌కు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎన్డీయేకు గుడ్ బై
రాజీనామా చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడిన నితీశ్ కుమార్, తాము ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఎన్డీయే నుంచి వైదొలగాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
ఎన్డీయే కూటమిలో బీజేపీతో విభేదాల నేపథ్యంలో జేడీయూ మంగళవారం నాడు ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ''లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించాం. ఎన్డీయే నుంచి బయటకు రావాలన్నదే అందరి కోరిక. మేం దానిని అంగీకరించాము. సమావేశం తర్వా త ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించా'' అని నితీశ్ కుమార్ తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు కూడా నితీశ్ కుమార్‌కు మద్ధతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి బలమెంత ?
బిహార్ అసెంబ్లీలో 243 సీటగ్లు ఉండగా, 122 సీట్ల బలం ఉన్న పార్టీ లేదా పక్షానికి అధికారం దక్కుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 79 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీకి 77 సీట్లు రాగా, జేడీయూకు 45 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌కు 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్ల బలం ఉంది.
ఎన్డీయే కూటమిలో ఎక్కువ సీట్లు సంపాదించినప్పటికీ, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం జేడీయూకే సీఎం పదవిని ఇచ్చింది బీజేపీ.
తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో 122 సీట్ల మ్యాజిక్ సంఖ్యను చేరుకోవడానికి నితీశ్ కుమార్ జేడీయూ పార్టీకి 77మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆర్జేడీ మద్ధతివ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నితీశ్ కుమార్‌కు ఇబ్బంది లేనట్లే.
ఇక బీజేపీ అధికారంలోకి రావాలంటే 45మంది ఎమ్మెల్యేలు కావాలి.
సైద్ధాంతికంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా నితీశ్‌కు మద్ధతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఎన్డీయే ఆధ్వరంలో నడిచిన ప్రభుత్వానికి కూటమికి చెందిన 126 మంది ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి 127 మంది సభ్యుల బలం ఉంది.

ఫొటో సోర్స్, ANI
ఇది ప్రజలకు చేసిన నమ్మక ద్రోహం: బీజేపీ
2020 ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, ఎన్డీయే కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టారని బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ అన్నారు. ఇప్పుడు నితీశ్ కుమార్ ఆర్జేడీతో చేతులు కలపడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నితీశ్ కుమార్ బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదని రాష్ట్రీయ లోక్‌జన్‌శక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తరచూ రాజకీయ మార్పులు
బిహార్‌లో రాజకీయాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇది కొత్త విషయం కాదు. ఇంతకు ముందు కూడా ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం నడిపిన నితీశ్ కుమార్, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో చేతులు కలిపారు.
బీజేపీకన్నా తక్కువ సీట్లే వచ్చినప్పటికీ, బిహార్ పీఠాన్ని నితీశ్‌కు అప్పజెప్పింది బీజేపీ. అయితే, ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇరువర్గాల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
పరిపాలనలో తన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోందని, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందన్న వాదన కూడా జేడీయూ వర్గాల నుంచి వినిపించింది. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వాన్ని బీజేపీ పదేపదే ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు జేడీయూ ఆరోపించింది. ఈ కారణంగానే నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారని చెబుతున్నారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడంపై జేడీ(యూ) నాయకత్వం బహిరంగంగా విమర్శలు చేయకపోయినా, లోలోపల మాత్రం అసంతృప్తితో ఉన్నాయి.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ ప్రభను తగ్గించేందుకు బీజేపీ 'చిరాగ్ పాసవాన్'ని ప్రయోగించిందన్న అసంతృప్తి కూడా జేడీయూలో ఉంది. తాను మోసపోయానని, స్నేహితులెవరో, శత్రువులెవరో గుర్తించలేకపోయానని నితీశ్ కుమార్ స్వయంగా బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానించారు.
కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య బయటకు కనిపించకుండా సాగుతున్న విభేధాలు ఏ క్షణంలోనైనా బద్ధలవుతాయని రాజకీయాల్లో చర్చలు బలంగా సాగాయి. ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ రాజీనామ సమర్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
నితీశ్ పై విమర్శలు తగ్గించిన తేజస్వీ యాదవ్
ఇంతకు ముందు సమయం దొరికితే నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇటీవల తన స్పీడును తగ్గించారు. ప్రతిపక్షంగా విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పై కాకుండా కేంద్రంపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు.
ఆగస్టు 7న మహాకూటమి నిర్వహించిన "నిరసన కవాతు"లో, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యపై బీజేపీ, ఎన్డీయేలపై విమర్శలు చేసిన తేజస్వీ యాదవ్ నితీశ్ కుమార్ పై మాత్రం ఏమీ అనలేదు.
అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు పట్నాకు పిలుపు
రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడినా, అవతలి వర్గానికి కావాల్సిన సంఖ్యాబలం ఎంతో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలను పట్నాకు రప్పించాయి. నితీశ్ కుమార్ రాజీనామా విషయాన్ని చెప్పకుండానే, వేర్వేరు జేడీయూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించింది.
''ఆర్సీపీ సింగ్ వ్యవహారం తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించడానికి ఎమ్మెల్యేలను పట్నాకు పిలిచాం'' అని జేడీయూ నేత లాలన్ సింగ్ అంతకు ముందు అన్నారు. అయితే, అంతకు ముందే రాష్ట్రంలో పరిణామాలపై అటు కాంగ్రెస్, ఇటు జేడీయూ నేతలు పరోక్షంగా సంకేతాలివ్వడంతో మంగళవారం నాడు భారీ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అనుకున్నట్లుగానే నితీశ్ కుమార్ రాజీనామా సమర్పించారు.
ఇవి కూడా చదవండి:
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













